Senior Citizen FD: వృద్ధులకు అధిక వడ్డీనిచ్చే బ్యాంకులివే.. ఎఫ్‌డీ చేయాలంటే ఇవే బెస్ట్ ఆప్షన్లు..
మే 2022 నుంచి ఫిబ్రవరి 2023 మధ్య, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును 2.5% పెంచింది. ఈ గణనీయమైన పెరుగుదల ఎఫ్‌డీ రేట్లను కూడా అధిక స్థాయికి తీసుకెళ్లాయి. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకూ ఆర్బీఐ ఇప్పటి నుంచి యథాతథ స్థితిని కొనసాగించడంతో ఎఫ్‌డీ రేట్లు కూడా అధిక స్థాయిలోనే కొనసాగుతున్నాయి. దీంతో అవి ఇప్పుడు ఆకర్షణీయంగా మారాయి.

స్థిరమైన రాబడి, అధిక రాబడి, పన్ను ప్రయోజనాలు అందించే ఏకైక స్కీమ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు(ఎఫ్‌డీ). పైగా సురక్షితమైన పెట్టుబడి పథకం. అందుకే సీనియర్ సిటిజెన్స్ దీనిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. సాధారణంగా ఎఫ్‌డీల్లో సీనియర్ సిటిజెన్స్ కు ఈ పథకాల్లో అధిక వడ్డీ వస్తుంది. దీంతో పాటు వృద్ధులు తక్కువ రిస్క్ టాలెరెన్స్ ను కలిగి ఉంటారు కాబట్టి వారికి ఇవి బెస్ట్ ఎంపికలుగా ఉంటాయి. ఈ ఎఫ్‌డీలు స్వల్ప వ్యవధితో కూడినవి ఉంటాయి. అలాగే దీర్ఘకాలిక స్కీమ్ లు కూడా ఉంటాయి. సీనియర్‌ల ఆర్థిక ప్రణాళిక అవసరాలకు అనుగుణంగా వారు ఎంపిక చేసుకోవచ్చు. ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత ఇవి వారికి ఆర్థిక భ్రదతను అందిస్తుంది. అయితే ఈ పథకాలో ఒక్కో బ్యాంకులో ఒక్కో విధంగా ఉంటాయి. ఈ క్రమంలో సీనియర్ సిటిజెన్స్ కు అధిక వడ్డీని అందించే బ్యాంకుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మే 2022 నుంచి ఫిబ్రవరి 2023 మధ్య, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును 2.5% పెంచింది. ఈ గణనీయమైన పెరుగుదల ఎఫ్‌డీ రేట్లను కూడా అధిక స్థాయికి తీసుకెళ్లాయి. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకూ ఆర్బీఐ ఇప్పటి నుంచి యథాతథ స్థితిని కొనసాగించడంతో ఎఫ్‌డీ రేట్లు కూడా అధిక స్థాయిలోనే కొనసాగుతున్నాయి. దీంతో అవి ఇప్పుడు ఆకర్షణీయంగా మారాయి.
వృద్ధులకు అధిక వడ్డీ..
వృద్ధులు సాధారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా సాధారణ ప్రజల కంటే 50 నుంచి 100 బీపీఎస్ ఎక్కువ వడ్డీని పొందుతారు. కానీ 5 సంవత్సరాల కంటే తక్కువ పదవీకాలం ఉంటే వడ్డీ ఆదాయం పెట్టుబడిదారుల చేతుల్లో పన్ను విధించబడుతుంది. వృద్ధులకు అధిక వడ్డీని అందించే బ్యాంకుల వివరాలు ఇప్పుడు చూద్దాం..
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దీనిలో ఒక సంవత్సరం కాంటే తక్కువ వ్యవధితో ఉండే ఎఫ్‌డీపై 3.50శాతం నుంచి 6.25శాతం వరకూ వడ్డీ ఉంటుంది. అదే ఒక సంవత్సరం నుంచి ఐదేళ్ల పరిమితి అయితే 7శాతం నుంచి 7.50శాతం వరకూ ఉంటుంది. అలాగే ఐదేళ్లకు మించిన ఎఫ్ డీలపై 7.50శాతం వార్షిక వడ్డీ రేటు వస్తుంది.
- పంజాబ్ నేషనల్ బ్యాంక్.. ఈ బ్యాంకులో ఒక సంవత్సరం కాంటే తక్కువ వ్యవధితో ఉండే ఎఫ్‌డీపై 4శాతం నుంచి 6.75శాతం వరకూ వడ్డీ ఉంటుంది. అదే ఒక సంవత్సరం నుంచి ఐదేళ్ల పరిమితి అయితే 7.25శాతం నుంచి 7.75శాతం వరకూ ఉంటుంది. అలాగే ఐదేళ్లకు మించిన ఎఫ్ డీలపై 7.30శాతం వార్షిక వడ్డీ రేటు వస్తుంది.
- బ్యాంక్ ఆఫ్ బరోడా.. దీనిలో ఒక సంవత్సరం కాంటే తక్కువ వ్యవధితో ఉండే ఎఫ్‌డీపై 3.50శాతం నుంచి 6.75శాతం వరకూ వడ్డీ ఉంటుంది. అదే ఒక సంవత్సరం నుంచి ఐదేళ్ల పరిమితి అయితే 7.25శాతం నుంచి 7.75శాతం వరకూ ఉంటుంది. అలాగే ఐదేళ్లకు మించిన ఎఫ్ డీలపై 7.50శాతం వార్షిక వడ్డీ రేటు వస్తుంది.
- హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్.. ఈ బ్యాంకులో ఒక సంవత్సరం కాంటే తక్కువ వ్యవధితో ఉండే ఎఫ్‌డీపై 3.50శాతం నుంచి 6.50శాతం వరకూ వడ్డీ ఉంటుంది. అదే ఒక సంవత్సరం నుంచి ఐదేళ్ల పరిమితి అయితే 7.10శాతం నుంచి 7.65శాతం వరకూ ఉంటుంది. అలాగే ఐదేళ్లకు మించిన ఎఫ్ డీలపై 7.75శాతం వార్షిక వడ్డీ రేటు వస్తుంది.
- యాక్సిస్ బ్యాంక్.. దీనిలో ఒక సంవత్సరం కాంటే తక్కువ వ్యవధితో ఉండే ఎఫ్‌డీపై 3.50శాతం నుంచి 6.50శాతం వరకూ వడ్డీ ఉంటుంది. అదే ఒక సంవత్సరం నుంచి ఐదేళ్ల పరిమితి అయితే 7.20శాతం నుంచి 7.60శాతం వరకూ ఉంటుంది. అలాగే ఐదేళ్లకు మించిన ఎఫ్ డీలపై 7.57శాతం వార్షిక వడ్డీ రేటు వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..