AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: మేమేం పాపం చేసాం రోహిత్ బ్రో! నెట్టింట ఆడిపోసుకుంటున్న MI ఫ్యాన్స్

ఐపీఎల్ 2025లో ముంబై vs బెంగళూరు మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరోసారి డిజాస్టర్‌గా మారాడు. కేవలం 17 పరుగులకే అవుట్ కావడంతో అభిమానులు తీవ్రంగా స్పందించారు. బెంగళూరు జట్టు విరాట్, పాటిదార్, జితేష్‌లతో భారీ స్కోరు నమోదు చేసింది. బౌలింగ్‌లో బుమ్రా తానే ఏకైక ఆకర్షణగా నిలవగా, మిగతా బౌలర్లు నిరాశపర్చారు.

IPL 2025: మేమేం పాపం చేసాం రోహిత్ బ్రో! నెట్టింట ఆడిపోసుకుంటున్న MI ఫ్యాన్స్
Rohit Sharma Mi
Follow us
Narsimha

|

Updated on: Apr 08, 2025 | 12:38 PM

ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపర్చాడు. గత మ్యాచ్‌కు గాయం కారణంగా దూరంగా ఉన్న రోహిత్ శర్మపై ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి కేంద్రీకృతమైంది. అయితే అతను కేవలం 17 పరుగులకే పెవిలియన్ చేరాడు. రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో ప్రారంభంలో మంచి టచ్‌లో ఉన్నట్లే కనిపించిన రోహిత్, చివరికి యష్ దయాల్ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ పరాజయం తర్వాత సోషల్ మీడియాలో రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన ఆటతీరు, తరచూ ఫెయిలవుతున్న ఫామ్‌పై అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. “భారం, నిరాశ” అంటూ ట్వీట్లు వెల్లువెత్తాయి.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన శక్తివంతమైన బ్యాటింగ్‌తో ముంబైపై పైచేయి సాధించింది. విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 పరుగులు చేసి మళ్లీ తన క్లాస్‌ను నిరూపించాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ కూడా 32 బంతుల్లో 64 పరుగులు చేసి ఎంఐ బౌలింగ్‌ను విచ్చిన్నం చేసి మైదానాన్ని అదిరిపోయే షాట్లతో సందడి చేశాడు. దేవదత్ పడిక్కల్ 22 బంతుల్లో 37 పరుగులతో కీలక భాగస్వామ్యాన్ని అందించగా, చివర్లో జితేష్ శర్మ 19 బంతుల్లో 40 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను శుభంగా ముగించాడు.

మరోవైపు ముంబై బౌలింగ్ లైనప్‌లోకి తిరిగి వచ్చిన జస్ప్రీత్ బుమ్రా తన స్థిరతతో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో కేవలం 29 పరుగులే ఇచ్చి తన క్లాస్‌ను చూపించాడు. హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీసినా, ఎక్కువ పరుగులు ఇవ్వడం వల్ల ప్రభావం చూపలేకపోయాడు. మొత్తం మీద RCB 221/5 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగా, ముంబై బౌలర్లు పైనుంచి చివరివరకు ఒత్తిడిలోనే ఉన్నారు. పవర్‌ప్లేలో 73/1, మిడిల్ ఓవర్లలో 78/3, డెత్ ఓవర్లలో 70/2తో పూర్తి ప్రణాళికతో ఆడిన బెంగళూరు, మ్యాచ్‌ను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకుంది.

ఈ మ్యాచ్‌తో రోహిత్ శర్మ ఫామ్‌పై ప్రశ్నలు మరింత ముదురగా మారాయి. ముంబై అభిమానులు అతని ఫామ్ తిరిగి రావాలని ఆశపడుతున్నారు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమవుతుందా అన్నదానిపై గాఢమైన సందేహాలే వినిపిస్తున్నాయి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..