AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corporate FDs: ఈ ఎఫ్‌డీలతో కొంచెం రిస్క్ ఉన్నా లాభాలు అదుర్స్.. డిపాజిట్లపై అత్యధిక వడ్డీ

సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల బ్యాంకులు వివిధ ఫిక్స్ డ్ డిపాజిట్ (ఎఫ్ డీ) పథకాలను అమలు చేస్తుంటాయి. వాటిలో డిపాజిట్లపై నిర్ణీత కాలవ్యవధికి వడ్డీని అందిస్తాయి. మెచ్యూర్ అయిన తర్వాత వడ్డీతో కలిసి అసలు తీసుకునే అవకాశం పెట్టుబడి దారులకు ఉంటుంది. రిస్కు లేకుండా తక్కువ రాబడి కోరుకునే వారికి ఇవి చాాలా అనుకూలంగా ఉంటాయి.

Corporate FDs: ఈ ఎఫ్‌డీలతో  కొంచెం రిస్క్ ఉన్నా లాభాలు అదుర్స్.. డిపాజిట్లపై అత్యధిక వడ్డీ
Money Astrology
Nikhil
|

Updated on: Dec 01, 2024 | 7:00 PM

Share

కొంచెం రిస్క్ చేసినా పర్వాలేదు. వడ్డీ బాగా ఎక్కువగా రావాలని ఆశించే వారికి కార్పొరేట్ ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఎఫ్ డీలను బ్యాంకులు అమలు చేస్తే, కార్పొరేట్ ఎఫ్ డీలను కార్పొరేట్ సంస్థలు, కంపెనీలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్ సీలు) అమలు చేస్తాయి. కార్పొరేట్ ఫిక్స్ డ్ డిపాజిట్ల కాల వ్యవధి తక్కువగా ఉంటుంది. బ్యాంకులతో పోల్చితే ఇక్కడ ఎక్కువ వడ్డీ అందిస్తారు. కానీ వీటిని ఎంచుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆయా కంపెనీల రేటింగ్ ను పరిశీలించి డిపాజిట్ చేయాలి. ఎందుకంటే బ్యాంకుల విషయంలో రూ.5 లక్షల వరకూ డిపాజిట్ ఇన్స్యూరెన్స్ పథకంలో రక్షణ ఉంటుంది. కానీ కార్పొరేట్ సంస్థలు, ఎన్బీఎఫ్ సీలలో ఆ అవకాశం ఉండదు. ఒకవేళ ఆ కంపెనీ దివాళా తీస్తే డిపాజిట్లు వెనక్కి రావడం చాలా కష్టం. వివిధ కార్పొరేట్ సంస్థల్లో ఎఫ్ డీలపై ఇస్తున్న వడ్డీరేట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

  • శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీలో ఐదేళ్ల కాల వ్యవధికి కలిగిన ఎఫ్ డీలకు గరిష్టంగా 8.47 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఒక ఏడాదికి 7.59 శాతం, మూడేళ్లకు 8.38 చొప్పున అమలు చేస్తున్నారు. సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో 0.50 శాతం అందిస్తారు.
  • మహీంద్రా ఫైనాన్స్ సంస్థ ఏడాది కాల వ్యవధి గల ఎఫ్ డీలపై 7.50 శాతం, మూడేళ్లు, ఐదేళ్లకు 8.10 శాతం వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు మరో పదిశాతం అదనంగా ఇస్తున్నారు.
  • మణిపాల్ హౌసింగ్ ఫైనాన్స్ సిండికేట్ లిమిటెడ్ లో ఏడాది, మూడేళ్ల డిపాజిట్లకు అత్యధికంగా 8.25 శాతం వడ్డీ అమలవుతోంది. ఐదేళ్ల డిపాజిట్లకు 7.75 శాతం ఇస్తున్నారు. సీనియర్ సిటిజన్లకు మరో 0.25 శాతం ఎక్కువగా అందిస్తారు.
  • ముత్తూట్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ లో ఏడాదికి 7.21, మూడేళ్లకు 8.07, ఐదేళ్లకు 8.38 శాతం వడ్డీ రేట్లు అమలవుతున్నాయి. మరో 0.50 శాతం రేటు సీనియర్ సిటిజన్లకు ఇస్తారు.
  • కెన్ ఫిన్ హోమ్ లిమిటెడ్ లో ఏడాదికి 6.50, మూడేళ్లకు 8.10, ఐదేళ్లకు 6.75 శాతం వడ్డీరేటు ఇస్తున్నారు. సీనియర్ సిటిజన్లకు మరో 0.25 శాతం అదనం.
  • బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో ఏడాదికి 7.60 నుంచి 7.40, మూడేళ్లకు 8.3 నుంచి 8.10 వరకూ, ఐదేళ్లకు 8.3 నుంచి 8.10 వరకూ వడ్డీ రేట్లు అమల్లో ఉన్నాయి. సీనియర్ సిటిజన్లకు మరో 0.25 శాతం అదనంగా లెక్కిస్తారు.

కార్పొరేట్ ఎఫ్ డీలను అమలు చేస్తున్న కంపెనీలు, సంస్థలకు కేర్, ఐసీాఆర్ఏ, క్రిసిల్ వంటి ప్రసిద్ధ సంస్థలు రేటింగ్ ను ఇస్తాయి. వాటిని పరిశీలించి డిపాజిట్లు చేసుకోవాలి. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, నేషనల్ హౌసింగ్ బ్యాంకులు ఈ ఎఫ్ డీలను నియంత్రిస్తాయి. కొంచెం రిస్కు ఉన్నప్పటికీ సాధారణ బ్యాంకులతో పోల్చితే ఇక్కడ తక్కువ కాలవ్యవధికే అత్యధిక వడ్డీ పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!