AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Income Tax Bill: కొత్త ఆదాయపు పన్ను చట్టం రెడీ.. కేంద్రమంత్రి వర్గం ఆమోదించిన బిల్లులో విశేషాలివే..!

భారతదేశంలోని బీజేపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏళ్లుగా ఉన్న ఆదాయపు పన్ను చట్టాన్ని సవరించేందుకు కీలక చర్యలు తీసుకుంది. కొత్త పన్ను విధానాన్ని ప్రతిబింబించేలా కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని తీసుకువస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

New Income Tax Bill: కొత్త ఆదాయపు పన్ను చట్టం రెడీ.. కేంద్రమంత్రి వర్గం ఆమోదించిన బిల్లులో విశేషాలివే..!
Income Tax
Nikhil
|

Updated on: Feb 08, 2025 | 1:18 PM

Share

కొత్త ఆదాయపు పన్ను చట్టం బిల్లును శుక్రవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ బిల్లును దీనిని వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లు ద్వారా ఆదాయపు పన్ను విభాగాల సంఖ్యను దాదాపు మూడో వంతు తగ్గిస్తుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆదాయపు పన్ను చట్టాన్ని సరళంగా, మరింత సంక్షిప్తంగా చేయడానికి మేము సెక్షన్లను 25-30 శాతం తగ్గించడానికి ప్రయత్నించారని వివరిస్తున్నారు. అయితే కొత్త చట్టంలో అధికారులకు అధిక అధికారాలు ఇవ్వలేదని తెలుస్తుంది. ఆదాయాన్ని లెక్కించడం, రేట్లు విధించడం వంటి వాటికి సంబంధించిన గణనీయమైన అధికారం పార్లమెంటు వద్దనే ఉండేలా చట్టాన్ని రూపొందించారు. పార్లమెంటు ఆమోదం తర్వాత ఈ బిల్లు చట్ట రూపం వస్తుంది. ముఖ్యంగా ప్రజలకు అర్థమయ్యే సింపుల్ భాషలోనే ఈ చట్టాన్ని రూపొందించారు. 

కొత్త ఆదాయపు పన్ను బిల్లులో పారదర్శకతను నిర్ధారించడానికి పన్ను చెల్లింపుదారులు, వ్యాపారాలు, నిపుణుల నుండి అభిప్రాయాన్ని సేకరించడానికి బిల్లును ప్రజా సంప్రదింపులకు పంపాలని ఆదాయపు పన్ను శాఖ కోరుతుంది. ముఖ్యంగా ఈ బిల్లును ముందుగానే ప్రజలకు అందుబాటులో ఉంచితే  భవిష్యత్తులో అస్పష్టతలు లేదా చట్టపరమైన వివాదాల అవకాశాలు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త బిల్లు ముసాయిదా రూపకల్పనలో 100 మందికి పైగా అధికారులు పాల్గొన్నారు.  ప్రస్తుతం చట్టం ఉన్న భాషలో ఉన్న అస్పష్టత కారణంగా ఉత్పన్నమయ్యే వివిధ కోర్టుల వివరణ సంబంధిత సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

ఈ కొత్త ఆదాయపు పన్ను బిల్లులో క్రాస్‌-రిఫరెన్సింగ్‌ను నివారించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి అధ్యాయానికి దాని సొంత నిర్వచనాలు ఉండవచ్చని అందువల్ల ఈ చట్టం సామాన్యులకు కూడా అర్థం అవుతుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న పన్ను చట్టం చాలా సంక్లిష్టంగా ఉంది. సరళీకృతంగా రూపొందించిన ఈ బిల్లు చట్ట రూపంలోకి వస్తే ఆదాయపు పన్ను చట్టం సామాన్యుడికి కూడా అర్థం అవుతుందని చెబుతున్నారు. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ప్రభుత్వ నిర్ణయం ఈ బిల్లు ముసాయిదాను కేవలం ఆరు నెలల్లోనే పూర్తి చేయాల్సి వచ్చిందని అదికారులు చెబుతున్నారు. కేవలం ఢిల్లీ ప్రాంతంలోని అధికారులే కాకుండా ఇతర ప్రాంతాల్లోని అధికారులు రోజులు తరబడి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి పని చేశారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..