RBI Repo Rate: లోన్లు తీసుకున్న వారికి గుడ్‌న్యూస్.. రెపో రేటును తగ్గించిన ఆర్బీఐ.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
దేశంలో కరెన్సీ చలామణి పెంచడం కోసం కేంద్రం విధానాలను మారుస్తోంది.. దీనిలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది..మొన్న బడ్జెట్‌లో పన్ను మినహాయింపులు, ఇవాళ రెపోరేట్‌లో కోత విధించడంతో.. సామాన్యులకు వడ్డీ రేట్ల నుంచి కొంచెం ఊరట లభించనుందని వ్యాపార రంగంలోని నిపుణులు..

ఎప్పుడో కరోనా టైమ్‌లో, 2020లో ఆర్బీఐ 40 బేసిక్ పాయింట్లు తగ్గించింది. ఆ తర్వాత ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం పుణ్యమా అని వడ్డీ రేట్లు పెరగడం ప్రారంభమైంది. అప్పటి నుంచి పెంచుడే తప్ప ఏనాడూ తగ్గించింది లేదు. ఇక 2023 మే నుంచి మాత్రం ఆర్బీఐ రెపో రేటులో ఎలాంటి మార్పులేకుండా 6.50 దగ్గరే ఉంచేసింది. మొత్తంగా చూస్తే ఐదేళ్ల తర్వాత ఓ గుడ్‌న్యూస్ ఇది. 25 బెసిక్ పాయింట్లు అంటే పావలా మందం వడ్డీ తగ్గించింది అన్నమాట.. దీంతో గుడ్ న్యూస్ చెప్పినట్లయింది.. తాజాగా రెపోరేట్‌లో 25 బెసిక్ పాయింట్లు తగ్గింపుతో ప్రోత్సాహం అందించినట్లయింది.. దాదాపు ఐదేళ్ల తర్వాత తొలిసారి 25 పాయింట్లు ఆర్బీఐ తగ్గించడంతో.. వడ్డీ రేట్ల నుంచి కాస్త ఊరట లభించనట్లయింది.
ఇంతకీ రెపోరేటు అంటే ఏంటి..! సింపుల్ వడ్డీ రేటు కింద చూడొచ్చు. ఇది తగ్గితే బ్యాంక్‌లు ఇచ్చే లోన్లకు వడ్డీరేటు తగ్గుతుంది. పెంచితే పెరుగుతుంది. సో.. ఇప్పుడు తగ్గింది కాబట్టి లోన్లకు వడ్డీలు స్వల్పంగా తగ్గుతాయి. ఆల్రెడీ లోన్లు ఉన్నవాళ్లకు ఈఐఎం భారం కొంత మేర తగ్గుతుంది.
ఉదాహరణకు మీరు 20ఏళ్ల కాలానికి 50లక్షల హోమ్ లోన్ తీసుకుని ఉంటే.. 9శాతం వడ్డీకి ఇప్పుడు మీరు కడుతున్న EMI దాదాపు 45వేలు ఉంటుంది. తాజాగా 25 పాయింట్లు తగ్గింది కాబట్టి.. ఇప్పుడు మీకు పడే వడ్డీ 8.75%. అంటే నెల EMI మీద దాదాపు 800రూపాయల భారం తగ్గుతుంది. అంటే 20ఏళ్ల కాలాలనికి దాదాపు 96వేలు. ఇక ఇప్పుడు బ్యాంక్ మీ ముందు బ్యాంక్ రెండు ఆప్షన్లు పెడుతుంది. EMI అలాగే ఉంచి.. EMIల సంఖ్య తగ్గించాలా.. లేదంటే EMIల సంఖ్య అలాగే ఉంచి EMIని తగ్గించాలా అని. మీకు బెటర్ ఆప్షన్ ఏంటంటే EMIల సంఖ్య తగ్గించుకోవడం. దీని వల్ల 20ఏళ్ల కాలవ్యవధిలో 10నెలలు ఈఎంఐ కట్టే బాధ తప్పినా దాదాపు 4 నుంచి 5లక్షలు సేవ్ అవుతాయి.
ఇక రెపోరేటు తగ్గించడం వల్ల ఉపయోగం ఏంటి అంటే.. బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గించడం వల్ల లోన్ల సంఖ్య పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వంటివి పుంజుకుంటాయి. మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది కాబట్టి ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ఫలితంగా రూపాయి బలపడుతుంది. రూపాయి బలపడితే.. మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న క్రూడాయిల్, బంగారం వంటివి ధరలు తగ్గుతాయి. సో తగ్గించింది పావలా మందమే అయినా.. ఎంతో కొంత ఇది గుడ్‌న్యూసే. ఫ్యూచర్‌లోనూ ఇంకాస్త తగ్గే అవకాశం కూడా ఉండొచ్చంటున్నారు ఎక్స్‌పెర్ట్స్.. ఈ క్రమంలోనే.. 2026 వార్షిక సంవత్సరంలో జీడీపీ 6.7% ఉండే అవకాశం ఉందని ఆర్బీఐ అంచనా వేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..