Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ola S1 vs TVS IQube: మార్కెట్‌లో ఆ రెండు ఈవీ స్కూటర్ల మధ్యే ప్రధాన పోటీ.. మైలేజ్ విషయమే అసలు సీక్రెట్

ఇటీవల కాలంలో భారతదేశంలో ఈవీ స్కూటర్ల హవా నడుస్తుంది. ఇక్కడ ప్రజలు పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు ఈవీ స్కూటర్ల కొనుగోలును ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకు తమ కంపెనీకు సంబంధించిన ఈవీ స్కూటర్లను భారతదేశంలో లాంచ్ చేస్తున్నాయి. అయితే దేశంలో ఎన్ని ఈవీ స్కూటర్లు లాంచ్ అయినా ఈ మార్కెట్‌లో ఓలా ఎస్1, టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ల మధ్యే ప్రధాన పోటీగా మారింది. ఈ నేపథ్యంలో ఈ రెండు స్కూటర్ల మధ్య ప్రధాన తేడాలను తెలుసుకుందాం.

Ola S1 vs TVS IQube: మార్కెట్‌లో ఆ రెండు ఈవీ స్కూటర్ల మధ్యే ప్రధాన పోటీ.. మైలేజ్ విషయమే అసలు సీక్రెట్
Ola S1 Vs Tvs Iqube
Follow us
Srinu

|

Updated on: Feb 05, 2025 | 4:00 PM

ఓలా ఎలక్ట్రిక్‌కు సంబంధించిన మూడో తరం ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇటీవల లాంచ్ చేశారు. వీటిలో నాలుగు మోడళ్లు ఉన్నాయి. ఎస్1 ఎక్స్, ఎస్1 ఎక్స్ ప్లస్, ఎస్ 1 ప్రో, ఎస్ 1 ప్రో ప్లస్. అయితే ఈ స్కూటర్లు టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీకు గట్టి పోటినిస్తాయి. టాప్ టైర్ ఎస్1 ప్రో ప్లస్  4680 భారత్ సెల్స్‌తో 5.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ స్కూటర్ 320 కి.మీ పరిధిని క్లెయిమ్ వాస్తవ ప్రపంచ పరిధి మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ స్కూటర్ 17.4 బీహెచ్‌పీతో మంచి శక్తిని అందిస్తుంది. ఈ స్కూటర్ 2.1 సెకన్లలో 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే ఈ స్కూటర్ 141 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకుపోతుంది ఐక్యూబ్ ఎస్‌టీకు సంబంధించిన టాప్ మోడల్ 5.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ స్కూటర్ 5.9 బీహెచ్‌పీ, 33 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ 4.2 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. అలాగే ఈ స్కూటర్ గరిష్టంగా 82 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. 

టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ వాస్తవ ప్రపంచ శ్రేణి 110 కిలో మీటర్లను పేర్కొంటున్నారు. అలాగే ఈ స్కూటర్ 0 నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ చేయడానికి దాదాపు 4 గంటల 18 నిమిషాలు పడుతుంది. ఓలా ఎస్1 ప్రో ప్లస్‌లో డ్యూయల్ ఏబీఎస్, ముందు, వెనుక టైర్స్‌పై ట్విన్ డిస్క్ బ్రేక్‌లు, మెరుగైన స్టాపింగ్ పవర్ కోసం బ్రేక్-బై-వైర్ టెక్నాలజీ వంటీ సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు ఉన్నాయి. రైడర్లు హైపర్, స్పోర్ట్స్, నార్మల్, ఎకో నాలుగు రైడింగ్ మోడ్‌ల నుంచి ఎంచుకోవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ ఇంకా అన్ని వివరాలను వెల్లడించనప్పటికీ, ఈ అద్భుతమైన లక్షణాలు ఎస్1 ప్రో పల్స్‌ను పనితీరు-ఆధారిత ఎంపికగా ఉంచుతాయి. 

టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ కనెక్టెడ్ సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవంపై దృష్టి పెడుతుంది. ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్, వాయిస్ అసిస్టెన్స్‌తో కూడిన 7 అంగుళాల టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ స్కూటర్‌ను అలెక్సాతో కూడా అనుసంధానించుకోవచ్చు. ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌లు, ఉదారమైన 32 లీటర్ల అండర్-సీట్ నిల్వ, జియో-ఫెన్సింగ్, లైవ్ లొకేటర్, క్రాష్, ఫాల్ అలర్ట్‌లు, మొబైల్ యాప్ నోటిఫికేషన్‌లు వంటి భద్రతా లక్షణాలతో వస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి