Smartphone Gaming: గేమింగ్ ఫోన్ కొంటున్నారా..? ఆ విషయాల్లో జాగ్రత్తలు మస్ట్..!
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయడంతో పాటు మీ రోజువారీ కార్యక్రమాల ఫొటోలు తీయడం వంటివి స్మార్ట్‌ఫోన్ ద్వారా చేస్తున్నారు. ముఖ్యంగా యువత ఫోన్‌లో గేమింగ్‌ను ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో గేమింగ్ ఫోన్లను కొనే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం.

ఇటీవల కాలంలో యువత ఎక్కువగా స్మార్ట్ ఫోన్లన వినియోగిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్‌లో గేమ్స్ ఆడడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ ఫోన్ల కంటే మంచి గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గేమింగ్ ఫోన్లను ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు కూడా యువతను ఆకట్టుకోవడానికి వివిధ ఫీచర్లతో గేమింగ్ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఫోన్‌ను ఎక్కువగా గేమింగ్ కోసం ఉపయోగించాలనుకుంటే మీ అవసరాలకు తగినదాన్ని కనుగొనడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. సరైన గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకోవడం అంటే పనితీరు, డిస్‌ప్లే, బ్యాటరీ, గేమింగ్ లక్షణాల గురించి తెలుసుకోవాలని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్లను వాడే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో? తెలుసుకుందాం.
పనితీరు, హార్డ్‌వేర్
ఏదైనా స్మార్ట్‌ఫోన్ సరిగ్గా పని చేయాలంటే అతి ముఖ్యమైన అంశం ప్రాసెసర్. గేమింగ్ కోసం ఫోన్‌ను కొనుగోలు చేయాలని బలమైన చిప్‌సెట్‌తో కూడినదాన్ని ఫోన్‌ను ఎంచుకోవాలి. శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 లేదా మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్‌తో వచ్చే ఫోన్లు గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు . మంచి జీపీయూతో కలిపి కనీసం 8 జీబీ ర్యామ్ ఉన్న ఫోన్ ఎంచుకుంటే ముఖ్యంగా మల్టీ టాస్కింగ్ అనుభవాన్ని పెంచుతుందని వివరిస్తున్నారు.
డిస్‌ప్లే, రిఫ్రెష్ రేట్
మంచి గేమింగ్ ఫోన్‌లో అత్యంత ముఖ్యమైన లక్షణం అధిక రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే. ఇది 120 హెచ్‌జెడ్ లేదా అంతకంటే ఎక్కువ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే డిస్‌ప్లేలో కూడా మంచి రిజల్యూషన్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఫుల్ హెచ్‌డీ ప్లస్, లేదా క్యూ హెచ్‌డీ ప్లస్ స్క్రీన్ మెరుగైన విజువల్స్‌ను ఇస్తుంది. కొన్ని పరికరాల్లో 165 హెచ్‌జెడ్ వంటి వేగవంతమైన రిఫ్రెష్ రేట్ అందుబాటులో ఉంది. అలాగే ఫోన్ మెరుగుపరచడానికి ఫోన్‌కు సంబంధించిన టచ్ శాంప్లింగ్ రేటు 240 హెచ్‌జెడ్ లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.
బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్
ఎక్కువ సమయం గేమ్ ఆడాలంటే బ్యాటరీ విషయాన్ని కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. అందువల్ల ఫోన్ కొనుగోలు చేేసే సమయంలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ లేదా అంతకంటే ఎక్కువ ఉన్న పెద్ద ఫోన్ కొనుగోలు చేయాలి. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఫోన్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 65 వాట్స్ లేదా అంతకంటే ఎక్కువ వేగవంతమైన ఛార్జర్లతో ఉన్న ఫోన్ కొన్ని నిమిషాల్లోనే ఛార్జ్ అవుతుంది. వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే కొన్ని ఫోన్‌లు అదనపు సౌలభ్యాన్ని కూడా అందిస్తాయి.
హీట్ నిర్వహణ
ఎక్కువసేపు గేమ్స్ ఆడడం వల్ల మీ ఫోన్ వేడెక్కడం సర్వ సాధారణం. అందువల్ల చాలా గేమింగ్ ఫోన్లలో వేడిని నియంత్రించడానికి లిక్విడ్ కూలింగ్, వేపర్ చాంబర్స్ వంటి కూలింగ్ పరికరాలు అమర్చి ఉన్న ఫోన్లను కొనుగోలు చేయడం ఉత్తమం. ఎక్కువసేపు గేమింగ్‌ను ఆస్వాదించే వ్యక్తులు, లాగ్‌ను నివారించడానికి, సరైన పనితీరు స్థాయిని నిర్వహించడానికి అధునాతన కూలింగ్ మెకానిజం ఉన్న ఫోన్‌ను ఎంచుకోవడం మంచిది.
గేమింగ్ ఫీచర్లు
గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లు కొన్నిసార్లు షోల్డర్ ట్రిగ్గర్‌లు, నిర్దిష్ట గేమింగ్ ప్రొఫైల్‌లు, స్టీరియో స్పీకర్‌లతో సహా అదనపు ఫంక్షన్‌లతో వస్తాయి. మొబైల్ గేమింగ్ మీకు ప్రాధాన్యత అయితే ఫోన్ గేమ్‌ప్యాడ్‌లు లేదా కూలింగ్ ఫ్యాన్ అటాచ్‌మెంట్‌ల వంటి అదనపు పరికరాలను కలిగి ఉందని నిర్ధారించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి ఉపకరణాలు మీ మొబైల్ గేమింగ్ అనుభవాన్ని బాగా మెరుగుపరుస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి