Australia’s Richest Indian: వారేవ్వా.. ఇది కదరా మామ సక్సెస్ అంటే.. దివాలా తీసి మరీ కోటీశ్వరుడిగా ఎదిగిన భారతీయుడు

ధనం మూలం ఇదం జగత్ అంటారు. డబ్బు ఉన్న వారికే ఈ సమాజంలో గౌరవం అని అర్థం. ఈ నేపథ్యంలో కొందరు డబ్బు సంపాదించడంతో తమ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. ఆస్ట్రేలియాలో అత్యంత డబ్బు ఉన్న భారతీయుల్లో వివేక చంద్ సెహగల్ ఒకరు. ఇతను నెలకు రూ.2500 జీతంతో జీవితం ప్రారంభించి ఇప్పుడు రూ.1,05,600 కోట్ల వార్షిక టర్నోవర్‌తో కంపెనీను నిర్వహించే స్థాయికు ఎదిగాడు. అతని విజయ రహస్యం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Australia's Richest Indian: వారేవ్వా.. ఇది కదరా మామ సక్సెస్ అంటే.. దివాలా తీసి మరీ కోటీశ్వరుడిగా ఎదిగిన భారతీయుడు
Vivek Chand Sehgal
Follow us
Srinu

|

Updated on: Feb 05, 2025 | 3:28 PM

ఓటమి లేకుండా విజయం సాధించడం అనేది అరుదుగా జరుగుతూ ఉంటుంది. లక్ష్య సాధనకు ఒక వ్యక్తికి సంబంధించిన దృఢ సంకల్పాన్ని పరీక్షించే ఎదురుదెబ్బలు, సవాళ్లు ఉంటాయి. భయం లేదా నిరాశతో నిరుత్సాహపడకుండా, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ దృఢంగా ఉండే వారు తమ లక్ష్యాలను సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపారంలో తక్షణ విజయం ఆశించడం చాలా తప్పు అని నిపుణులు చెబుతూ ఉంటారు. పట్టుదల, ఎదురుదెబ్బల నుంచి నేర్చుకోవడం, దృఢ సంకల్పాన్ని కొనసాగించడం ద్వారా విజయాన్ని సాధించవచ్చు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న అత్యంత ధనవంతుడైన భారతీయుడు వివేక్ చంద్ సెహగల్ ఈ సూత్రాన్ని అవలంభించాడు. సెహగల్ సంవర్ధన మదర్సన్ గ్రూప్ (గతంలో మద్రాసన్ గ్రూప్) సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ఇతన 1970లలో నెలకు రూ. 2,500 ఆదాయంతో జీవితం ప్రారంభించి, ఇప్పుడు రూ. 1,05,600 కోట్ల వార్షిక అమ్మకాలతో ఒక కంపెనీని నడిపిస్తున్నాడు.

1956 సెప్టెంబర్ 28న ఢిల్లీలో జన్మించిన వివేక్ చంద్ ఒక ఆభరణాల వ్యాపారి కుటుంబం నుంచి వచ్చాడు. పిలానీలోని బిర్లా పబ్లిక్ స్కూల్‌లో చదివి, తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యాడు. చంద్ వ్యవస్థాపక ప్రయాణం వెండి వ్యాపారంతో ప్రారంభమైంది. ఒకప్పుడు ఆయన ఒక కిలోగ్రాము వెండిని కేవలం 1 రూపాయికి అమ్మారు. 1975లో వివేక్ చంద్ తన తల్లి స్వర్ణ లతా సెహగల్‌తో కలిసి మద్రసన్ కంపెనీని స్థాపించారు. వెండి వ్యాపారంతో జీవితాన్ని ప్రారంభించిన వివేక్ చంద్ ప్రారంభంలో వెండి వ్యాపారంలో చాలా నష్టాలను చవిచూసి దివాలా తీసే పరిస్థితికి వచ్చాడు. ఈ ఎదురుదెబ్బతో నిరుత్సాహపడకుండా వివేక్ కొత్త రంగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు

ప్రస్తుతం కారు విడిభాగాల తయారీ రంగంలో వివేక్ చంద్ సెహగల్ మద్రసన్ గ్రూప్‌లోని అత్యంత కీలకమైన విభాగమైన సంవర్ధన్ మద్రసన్ గ్రూప్‌‌నకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ కంపెనీ ఆటోమోటివ్ పరిశ్రమలో ప్రపంచ శక్తిగా మారింది. ప్రపంచంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారులకు అవసరమైన కారు భాగాలను ఉత్పత్తి చేస్తుంది. జనవరి 2025 నాటికి ఫోర్బ్స్ అంచనా ప్రకారం వివేక్ చంద్ సెహగల్ నికర విలువ 5.5 బిలియన్ల డాలర్లుగా ఉంది. 2021లో అతను ఫోర్బ్స్‌కు భారతదేశపు అత్యంత సంపన్న వ్యక్తుల జాబితాలో 49వ స్థానాన్ని పొందాడు. వ్యాపార ప్రపంచానికి ఆయన చేసిన గణనీయమైన కృషికి గుర్తింపుగా 2016లో భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన ఈవై ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో ఆయనను సత్కరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి