ఇది తెలుసా.. ఇన్‌స్టా రీల్స్‌ను ఇక టీవీలో కూడా చూసుకోవచ్చు! అందుకోసం ఏం చేయాలంటే?
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను టీవీలో చూసే అవకాశం ఇప్పుడు లభించింది. అమెజాన్, మెటా సహకారంతో "ఇన్‌స్టాగ్రామ్ ఫర్ టీవీ" యాప్‌ను ఫైర్ టీవీ పరికరాలకు విడుదల చేశాయి. ఇకపై మీరు మీ ఇంటి టీవీలో పెద్ద స్క్రీన్ పై ఇష్టమైన రీల్స్‌ను ఆస్వాదించవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను ఎంత విపరీతంగా వాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీల్స్ చేసేవారు, చూసేవారితో ఆ యాప్ లేని మొబైల్స్ చాలా తక్కువగా ఉంటాయి. రీల్స్‌ను గంటలకు గంటలు చూసేవారి సంఖ్య భారీగానే ఉంటుంది. ఇలా రీల్స్‌ను ఇష్టపడేవారికి గుడ్‌న్యూస్ ఏంటంటే.. ఇప్పుడు మీరు రీల్స్‌ను టీవీలో కూడా చూడొచ్చు. అందుకోసం అమెజాన్, మెటా కొత్త సహకారంతో ముందుకు సాగుతున్నాయి.
ఇన్‌స్టాగ్రామ్ ఫర్ టీవీ యాప్‌ను తీసుకొచ్చాయి. ఈ యాప్ ఇన్‌స్టాగ్రామ్ ప్రసిద్ధ షార్ట్-ఫారమ్ వీడియో కంటెంట్‌ను, ముఖ్యంగా రీల్స్‌ను ఎంపిక చేసిన అమెజాన్ ఫైర్ టీవీ పరికరాల ద్వారా పెద్ద స్క్రీన్‌లకు తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యాప్‌ను అమెజాన్ యాప్‌స్టోర్ నుండి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టీవీల్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను ప్రవేశపెట్టడంతో, అమెజాన్, మెటా హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్, సోషల్ నెట్‌వర్కింగ్ మధ్య లైన్‌ను చెరిపేస్తున్నాయి.
ఇన్‌స్టాగ్రామ్ ఫర్ టీవీ ఒకే ఫైర్ టీవీ డివైజ్‌లో 5 అకౌంట్లకు సపోర్ట్ చేస్తుంది. ప్రతి యూజర్ వారి స్వంత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోకి లాగిన్ అయి వారికి నచ్చిన రీల్స్ చూడొచ్చు. ఈ యాప్ రీల్స్‌ను లైక్ చేయగలగడం, కామెంట్ చూడటం వంటివి కూడా టీవీలోనే చేయొచ్చు. మొబైల్‌లో ఎలా అయితే ఇన్‌స్టా యాప్‌ను యూజ్ చేస్తున్నారో ఇప్పుడు టీవీలో కూడా అంతే ఈజీగా వాడుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




