Tax Rules: మైనర్ పిల్లల ఆదాయంపై పన్ను ఎవరు చెల్లించాలి..? నిబంధనలు ఏమిటి?
Tax Rules: దేశంలో ఆదాయ పన్ను శాఖలో రకరకాల నిబంధనలు ఉన్నాయి. మన ఆదాయాలపై ఇన్‌కమ్ ట్యాక్స్ ఎప్పుడు నిఘా ఉంచుతుంది. అలాగే పిల్లల సంపదనపై కూడా ఆదాయపు పన్ను చెల్లించాలనే నిబంధన ఉంది. అయితే మరి పిల్లలు సంపాదిస్తున్నట్లయితే పన్ను ఎవరు చెల్లించాలి? పిల్లలా.. లేదా తల్లిదండ్రులా? నియమ నిబంధనలు ఏమిటో తెలుసుకుందాం..

Minor Child Income Tax: మన ఆదాయాలపై రకరకాల పన్నులు ఉంటాయన్న విషయం అందరికి తెలిసిందే. అయితే పిల్లల ఆదాయంపై పన్ను ఎవరు చెల్లించాలి? పిల్లలా? లేక తల్లిదండ్రులా? ఈ రకమైన ఆదాయంపై పన్నులు ఎలా చెల్లించాలో మీకు తెలుసా? భారతదేశంలోని పన్ను చట్టాల గురించి తెలుసుకుందాం..
భారతీయ ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. మైనర్ పిల్లలు (18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు) ఆదాయం పొందినప్పుడు అది సాధారణంగా వారి తల్లిదండ్రుల ఆదాయంతో కలుపుతారు. పిల్లల ఆదాయం అధిక ఆదాయం ఉన్న తల్లిదండ్రుల మొత్తం ఆదాయానికి జోడిస్తారు. తరువాత తల్లిదండ్రుల పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లింపులు ఉంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
అయితే, పిల్లవాడు తన సొంతంగా పని చేయడం ద్వారా లేదా ప్రత్యేక నైపుణ్యాలు, సామర్థ్యాలను ఉపయోగించడం ద్వారా ఆదాయం సంపాదిస్తే, ఈ క్లబ్బింగ్ నిబంధనలు వర్తించవు. ఉదాహరణకు, పిల్లవాడు బాల నటుడిగా లేదా క్రీడా నటుడిగా ఆదాయం సంపాదిస్తే, ఆ ఆదాయం క్లబ్‌లోకి రాదు. అలాంటి సందర్భంలో ప్రతినిధి అసెస్సీ ద్వారా పిల్లల తరపున ప్రత్యేక ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయవచ్చు.
ఇది కూడా చదవండి: Indian Railways: సామాన్యుల కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయాలు.. టికెట్ బుకింగ్‌లో కొత్త నిబంధనలు
పన్ను మినహాయింపు:
క్లబ్ ఆదాయం కోసం ప్రతి బిడ్డకు రూ. 1,500 తగ్గింపు అందుబాటులో ఉంది. గరిష్టంగా ఇద్దరు పిల్లలు ఈ మినహాయింపుకు అర్హులు. పిల్లల ఆదాయం రూ. 1,500 కంటే తక్కువ ఉంటే అది పన్ను మినహాయింపుకు అర్హమైనది. ఆదాయం రూ. 1,500 కంటే ఎక్కువ ఉంటే అదనపు మొత్తాన్ని మాత్రమే తల్లిదండ్రుల ఆదాయానికి జోడిస్తారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80U కింద నిర్వచించే కొన్ని వైకల్యాలున్న పిల్లలు, అనాథల ఆదాయాన్ని తల్లిదండ్రుల ఆదాయంతో కలపరు. బదులుగా, ప్రతినిధి అసెస్సీ ద్వారా పిల్లల తరపున ప్రత్యేక ఐటీఆర్ దాఖలు చేయవచ్చు.
ఇది కూడా చదవండి: Auto News: దేశ ప్రజల మనస్సు దోచుకున్న బైక్‌లు.. కేవలం రూ.75వేలలోనే.. మైలేజీ మాత్రం అదుర్స్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








