TATA Motors: దేశంలోని 540 నగరాల్లో టాటా ఛార్జింగ్ స్టేషన్లు.. ఈ కంపెనీలతో ఒప్పందం
టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సదుపాయాలను మరింత మెరుగుపరచడానికి డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇండియా, థండర్‌ప్లస్ సొల్యూషన్స్ అనే రెండు ప్రముఖ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను మరింత సౌకర్యవంతంగా, అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యం పెట్టుకుంది టాటా. భారతదేశంలోని ప్రముఖ..
టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సదుపాయాలను మరింత మెరుగుపరచడానికి డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇండియా, థండర్‌ప్లస్ సొల్యూషన్స్ అనే రెండు ప్రముఖ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను మరింత సౌకర్యవంతంగా, అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యం పెట్టుకుంది టాటా. భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలలో ఒకటైన టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. సంస్థ ఈ భాగస్వామ్యంలో 540 కొత్త ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు స్థానించింది. తద్వారా ఎలక్ట్రిక్ వాహనాల యజమానులు ఛార్జింగ్ కోసం మరిన్ని ఆప్షన్లను పొందవచ్చు. అలాగే వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు.
50కి పైగా నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్లు:
టాటా మోటార్స్ ఈ ఛార్జింగ్ పాయింట్ 50 కంటే ఎక్కువ నగరాల్లో ఇన్‌స్టాల్ కానున్నాయి. ఈ నగరాల్లో 540కి పైగా ఛార్జింగ్ స్టేషన్లు నిర్మించనున్నారు. టాటా మోటార్స్ ప్రకారం, ఈ ఛార్జింగ్ స్టేషన్ ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పూణె, కొచ్చి వంటి నగరాల్లో ఏర్పాటు కానున్నాయి. అలాగే, ఎక్కువగా ఉపయోగించే రూట్లలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించనున్నట్లు టాటా మోటార్స్ తన ప్రకటనలో తెలిపింది. తద్వారా కస్టమర్లు మరింత సౌలభ్యాన్ని పొందుతారు. ఈవీ వాహనాలకు మరింత ప్రోత్సాహాన్ని పొందుతారు.
మీరు ఈ విధంగా ప్రయోజనం పొందుతారు
ఛార్జింగ్ సౌకర్యాలు సులభంగా అందుబాటులో ఉంటే, ఎక్కువ మంది ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను అవలంబిస్తారు. ఇది కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా దేశ ఇంధన భద్రతను కూడా పెంచుతుంది. అదనంగా, టాటా మోటార్స్ రాబోయే సంవత్సరాల్లో మరిన్ని కొత్త ఈవీ మోడళ్లను విడుదల చేయడానికి తన ఈవీ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరింపజేస్తుందని, ఇది భారతీయ కస్టమర్ల అవసరాలు, ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడుతుందని స్పష్టం చేసింది.
ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను ప్రోత్సహించడానికి ప్రాధాన్యత
ఈ భాగస్వామ్యం ద్వారా టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను ప్రోత్సహించడమే కాకుండా, స్థిరమైన, పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దశ భారతదేశ ఈవీ పరిశ్రమ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, దేశం క్లీన్, గ్రీన్ ఎనర్జీ వైపు పయనించడంలో సహాయపడుతుందని కంపెనీ విశ్వసిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి