HYDRA Effect: షేక్ చేస్తున్న ‘హైడ్రా’.. మీ ఆస్తులు సురక్షితంగా ఉన్నాయా? ఇలా తెలుసుకోండి..

జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ శివార్లలో మునిసిపాలిటీలు, గ్రామాల్లో ఈ ఆపరేషన్ హైడ్రాను చేపట్టారు. ముఖ్యంగా ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, లే అవుట్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు, పరిశ్రమల శాఖకు చెందిన స్థలాల్లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే ఉన్న నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు.

HYDRA Effect: షేక్ చేస్తున్న ‘హైడ్రా’.. మీ ఆస్తులు సురక్షితంగా ఉన్నాయా? ఇలా తెలుసుకోండి..
Hydra
Follow us

|

Updated on: Aug 22, 2024 | 2:46 PM

హైదరాబాద్‌ని ‘హైడ్రా’ షేక్ చేస్తోంది. ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. నాళాలు, చెరువులను మింగేస్తూ చేసిన అక్రమ కట్టడాలను కూల్చేస్తూ దడ పుట్టిస్తోంది. అయితే చాలా మంది తమ ఆస్తులు ఎక్కడ కోల్పోతామన్న ఆందోళనలో ఉన్నారు. హైడ్రా చర్యలు తీసుకునే పరిధి ఏంటి? అని చాలా మంది వెతుకుతున్నారు. మన ఆస్తులు సేఫ్ గా ఉండాలంటే ఏం చేయాలని అని ఇంటర్ నెట్ లో సెర్చింగ్ చేస్తున్నారు? హైడ్రా ఎఫెక్ట్ తమ ఆస్తులపై ఉందా? అనుకొని ఏం చేయాలో తెలీక మదనపడుతున్నారు. అలాంటి వారి కోసమే ఈ కథనం ఇస్తున్నాం. చదవేయండి..

హైడ్రా అంటే..

తెలంగాణలో కొత్త ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా.. ఆక్రమణల తొలగింపే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అండ్ అసెట్ ప్రోటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)ని తీసుకొచ్చారు. జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ శివార్లలో మునిసిపాలిటీలు, గ్రామాల్లో ఈ ఆపరేషన్ హైడ్రాను చేపట్టారు. ముఖ్యంగా ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, లే అవుట్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు, పరిశ్రమల శాఖకు చెందిన స్థలాల్లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే ఉన్న నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు. ఆక్రమణలకు గురైన చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటున్నారు.

దడ పుట్టిస్తున్న హైడ్రా..

ఆపరేషన్ హైడ్రా ప్రారంభమైన దగ్గర నుంచి ఆక్రమణదారుల గుండెల్లో దడ మొదలైంది. ఆయా ప్రాంతాల్లో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై కొరఢా ఝుళిపిస్తుండటతో సర్వత్రా టెన్షన్ మొదలైంది. పలువురు రాజకీయ నాయకులకు సంబంధించిన కట్టడాలపై కూడా బుల్డోజర్లు వెళ్లడంతో సామాన్యుల్లోనూ ఆందోళన రేకెత్తింది. అన్ని పక్కాగా ఉంటే ఓకే కానీ. తెలిసో, తెలియకో ప్రభుత్వం భూముల్లో కట్టడాలు నిర్మిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవన్న సంకేతం అందిరికీ వెళ్లింది.

‘రియల్’ దందాతో టెన్షన్..

‘రియల్’ దందా హైదరాబాద్ శివార్లో జోరుగా సాగింది. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ బోర్డులు పెట్టేసి.. వెంచర్లు వేసేసి, నకిలీ పత్రాలతో విక్రయాలు చేసేసి సొమ్ము చేసుకున్నారు. అలాంటి చోట్ల స్థలాలు కొన్న పలువురు సామాన్యలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. తమ భూములు సురక్షితమైనా.. తమ పైనా హైడ్రా ఎఫెక్ట్ పడుతుందా? అని భయపడుతున్నారు.

ఇలా చెక్ చేసుకోండి..

మీరు కూడా ఇలానే టెన్షన్ పడుతుంటే.. ఇక ఆ టెన్షన్ ని పక్కన పెట్టండి. ఈ ఆస్తులు సురక్షితంగా ఉన్నాయా లేవా అనేది సులువుగా తెలుసుకోవచ్చు. అందుకోసం మీరు ఈ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. మీ ఆస్తులు ఎఫ్టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధిలో ఉన్నాయా లేవా అనేది ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ లేక్స్ అనే పేజీ ఓపెన్ అవుతుంది. జిల్లా, మండలం/సర్కిల్, గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుంటే వాటి పరిధిలోని సరస్సులు, చెరువులకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. దీంతో మన స్థలాలు ఎక్కడున్నాయనేది సులభంగా తెలుస్తుంది. తద్వారా మన ఆస్తులపై హైడ్రా ఎఫెక్ట్ పడుతుందా లేదా అనేది కూడా తెలుస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వెండితెర శిఖరంలా మెగాస్టార్.! హీరో అవ్వకముందు చిరు ఏం చేసేవారంటే?
వెండితెర శిఖరంలా మెగాస్టార్.! హీరో అవ్వకముందు చిరు ఏం చేసేవారంటే?
అబ్బవరం ఇంట మొదలైన పెళ్లి సందడి.! వీడియో షేర్ చేసిన హీరోయిన్.
అబ్బవరం ఇంట మొదలైన పెళ్లి సందడి.! వీడియో షేర్ చేసిన హీరోయిన్.
పద్దతిపాడు లేని మనిషి.! బాలీవుడ్ స్టార్‌పై అజయ్‌ భూపతి సీరియస్.
పద్దతిపాడు లేని మనిషి.! బాలీవుడ్ స్టార్‌పై అజయ్‌ భూపతి సీరియస్.
ఇంద్ర సెట్లో చరణ్..! ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన సోనాలి..
ఇంద్ర సెట్లో చరణ్..! ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన సోనాలి..
ఎట్టకేలకు OTTలోకి వచ్చిన సమంత, రానా సూపర్ హిట్ మూవీ.!
ఎట్టకేలకు OTTలోకి వచ్చిన సమంత, రానా సూపర్ హిట్ మూవీ.!
పైకి చూస్తే వట్టి పూతరేకుల పార్శిళ్లే.. తీరా తెరిచి చూడగా
పైకి చూస్తే వట్టి పూతరేకుల పార్శిళ్లే.. తీరా తెరిచి చూడగా
పెళ్లైన 2 నెలలకే.. బిగ్ ట్విస్ట్‌ ఇచ్చిన సోనాక్షి.! హాట్ టాపిక్..
పెళ్లైన 2 నెలలకే.. బిగ్ ట్విస్ట్‌ ఇచ్చిన సోనాక్షి.! హాట్ టాపిక్..
డైరెక్ట్‌ గా ఓటీటీలోకి కీర్తి సురేశ్ కాంట్రవర్సీ మూవీ. ఎందుకలా.?
డైరెక్ట్‌ గా ఓటీటీలోకి కీర్తి సురేశ్ కాంట్రవర్సీ మూవీ. ఎందుకలా.?
ఎలాంటి టెస్టులకైనా సిద్ధం అంటున్న హేమ. కానీ నెటిజన్స్ రిప్లై వేరే
ఎలాంటి టెస్టులకైనా సిద్ధం అంటున్న హేమ. కానీ నెటిజన్స్ రిప్లై వేరే
సుశీలమ్మ సేఫ్‌ క్షేమంగా ఇంటికి.! వాటిని నమ్మొద్దు అంటూ విజ్ఞప్తి.
సుశీలమ్మ సేఫ్‌ క్షేమంగా ఇంటికి.! వాటిని నమ్మొద్దు అంటూ విజ్ఞప్తి.