AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tata: అదృష్టం అంటే ఇదే.. ఈ ఒక్క పనితో కోటీశ్వరులయ్యారు.. కేవలం రూ.1 లక్ష పెడితే రూ. 1.09 కోట్లు..!

Tata Large Cap Fund Magic: ఈ ఫండ్ పనితీరును పరిశీలించిన వాల్యూ రీసెర్చ్ దీనికి 4-స్టార్ రేటింగ్ ఇవ్వగా, మార్నింగ్ స్టార్ సంస్థ 3-స్టార్ రేటింగ్ ఇచ్చింది. లంప్ సమ్ పెట్టుబడి విధానానికి వస్తే టాటా లార్జ్ క్యాప్ ఫండ్‌..

Tata: అదృష్టం అంటే ఇదే.. ఈ ఒక్క పనితో కోటీశ్వరులయ్యారు.. కేవలం రూ.1 లక్ష పెడితే రూ. 1.09 కోట్లు..!
Tata Large Cap Fund Magic
Subhash Goud
|

Updated on: May 11, 2026 | 6:04 PM

Share

Tata Large Cap Fund Magic: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు ఉండాల్సిన ప్రధాన లక్షణం ‘ఓపిక’. క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక పెట్టుబడి ఎంతటి సంపదను సృష్టిస్తుందో టాటా లార్జ్ క్యాప్ ఫండ్ (Tata Large Cap Fund) నిరూపించింది. గత 28 ఏళ్లుగా ఈ ఫండ్ తన ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలను అందిస్తూ కోటీశ్వరులను చేసింది.

రూ. 1 లక్షకు రూ. 1.09 కోట్లు:

టాటా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (Tata AMC) కి చెందిన ఈ లార్జ్ క్యాప్ ఫండ్‌ను మే 7, 1998న ప్రారంభించారు. ఈ స్కీమ్ ప్రారంభమైనప్పుడు ఎవరైనా ఒక ఇన్వెస్టర్ రూ. 1 లక్షను ఒకేసారి పెట్టుబడిగా పెట్టి ఉంటే, నేడు దాని విలువ అక్షరాలా రూ. 1.09 కోట్లు. అంటే గత 28 ఏళ్లలో ఈ ఫండ్ వార్షికంగా 18.25% (CAGR) రాబడిని అందించింది.

నెలకు రూ. 10 వేల సిప్ (SIP)తో రూ. 5.27 కోట్లు:

అలాగే కేవలం లంప్‌సమ్ మాత్రమే కాదు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా పెట్టుబడి పెట్టిన వారికి కూడా ఈ ఫండ్ అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. ఈ ఫండ్ ప్రారంభమైనప్పటి నుండి నెలకు రూ. 10,000 చొప్పున ఎవరైనా సిప్ చేస్తూ వచ్చి ఉంటే ఇప్పుడు ఆ మొత్తం విలువ రూ. 5.27 కోట్లుగా ఉండేది. గత 10 ఏళ్ల క్రితం నెలకు రూ. 10 వేల సిప్ ప్రారంభించిన వారికి 12.11% వార్షిక రాబడితో ఇప్పుడు సుమారు రూ. 22.37 లక్షలు అందేవి. గత 7 ఏళ్ల క్రితం పెట్టుబడి మొదలుపెట్టిన వారికి 12.75% రాబడితో రూ. 13.12 లక్షలు సమకూరేవి.

ఇవి కూడా చదవండి

రేటింగ్స్, గత కాలపు రాబడులు:

ఈ ఫండ్ పనితీరును పరిశీలించిన వాల్యూ రీసెర్చ్ దీనికి 4-స్టార్ రేటింగ్ ఇవ్వగా, మార్నింగ్ స్టార్ సంస్థ 3-స్టార్ రేటింగ్ ఇచ్చింది. లంప్ సమ్ పెట్టుబడి విధానానికి వస్తే టాటా లార్జ్ క్యాప్ ఫండ్‌ లాంచ్ అయినప్పుడు పదేళ్ల క్రితం ఇందులో రూ. 1 లక్ష పెట్టుబడి ఇప్పుడు రూ. 3.17 లక్షలు (12.24% CAGR). అలాగే ఏడేళ్ల కిందట రూ.1 లక్ష ఇప్పుడు రూ. 2.34 లక్షలు (12.7% CAGR), అలాగే ఐదేళ్ల కిందట రూ. 1 లక్ష పెడితే ఇప్పుడు రూ. 1.78 లక్షలు అయింది.

ఇది కూడా చదవండి: LPG Cylinder: గ్యాస్ సిలిండర్ వాడే వారికి భారీ షాక్.. వీళ్లకు సబ్సిడీ కట్‌.. 7 రోజుల డెడ్‌లైన్‌..!

మార్కెట్లో టాప్ లార్జ్ క్యాప్ ఫండ్స్:

– టాటా లార్జ్ క్యాప్ ఫండ్ మాదిరిగానే గత 10 ఏళ్లలో మరికొన్ని ఫండ్స్ కూడా మెరుగైన ఫలితాలను ఇచ్చాయి:

– నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్: 15.13% వార్షిక రాబడి.

– ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్: 14.47% వార్షిక రాబడి.

– పీజీఐఎం ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్: 10.56% వార్షిక రాబడి.

గమనిక: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం.

ఇది కూడా చదవండి: Pension: నెలకు కేవలం రూ.210 డిపాజిట్‌ చేస్తే చాలు.. ప్రతినెల రూ.5000 పెన్షన్‌.. ప్రభుత్వ నుంచి అద్భుతమైన పథకం!

ఇది కూడా చదవండి: India Gold Ban: బంగారం కొనుగోళ్లపై ప్రభుత్వం పూర్తి నిషేధం విధిస్తుందా? అసలు నియమాలు ఏమిటి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us