Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tata Altroz iCNG: 5 స్టార్ రేటింగ్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‌జీ కారు.. అత్యాధునిక ఫీచర్లు.. అనువైన ధరలోనే.. 

గతంలో టాటా టియాగో, టైగోర్ మోడళ్లకు సీఎన్‍జీ వెర్షన్‍ను తీసుకొచ్చిన టాటా మోటార్స్ ఇప్పుడు మరో మోడల్ ను లాంచ్ చేసింది. పాపులర్ ప్రీమియమ్ హ్యాచ్‍బ్యాక్ కారు ‘ఆల్ట్రోజ్’కు సీఎన్‍జీ వెర్షన్‍ను అందుబాటులోకి తెచ్చింది. టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ పేరిట కారును భారత మార్కెట్‍లో ఆవిష్కరించింది.

Tata Altroz iCNG: 5 స్టార్ రేటింగ్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‌జీ కారు.. అత్యాధునిక ఫీచర్లు.. అనువైన ధరలోనే.. 
Tata Altroz Icng Car
Follow us
Madhu

|

Updated on: May 24, 2023 | 4:00 PM

రోజుకీ పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు, అంతకంతకూ అధికమవుతున్న వాతావరణ కాలుష్యాన్నినియంత్రించేందుకు ప్రభుత్వాలు పర్యావరణ హితమైన వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు సీఎన్‌జీ(కంప్రెస్జ్ నేచురల్ గ్యాస్) వాహనాలు మార్కెట్లోకి విడుదలవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా కనిపిస్తుండగా.. వాటికన్న ముందు నుంచి అందుబాటులో ఉన్న సీఎన్‌జీ వేరియంట్లో మాత్రం వాహనాలు తక్కువగా ఉన్నాయి. వాటిల్లో ఎక్కువ టాటా కంపెనీకి చెందని మోడళ్లే అధికంగా ఉన్నాయి. గతంలో టాటా టియాగో, టైగోర్ మోడళ్లకు సీఎన్‍జీ వెర్షన్‍ను తీసుకొచ్చిన టాటా మోటార్స్ ఇప్పుడు మరో మోడల్ ను లాంచ్ చేసింది. పాపులర్ ప్రీమియమ్ హ్యాచ్‍బ్యాక్ కారు ‘ఆల్ట్రోజ్’కు సీఎన్‍జీ వెర్షన్‍ను అందుబాటులోకి తెచ్చింది. టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ పేరిట కారును భారత మార్కెట్‍లో ఆవిష్కరించింది. వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రానిక్ సన్‍రూఫ్, వైర్లెస్ చార్జింగ్, ఎయిర్ ప్యూరిఫయర్ వంటి అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉన్న ఈ సీఎన్‌జీ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ట్విన్ సిలెండర్ సిస్టమ్..

భారతదేశంలో ట్విన్ సిలిండర్ సీఎన్జీ సిస్టమ్ కలిగి ఉన్న మొట్టమొదటి మోడల్ గా ఈ టాటా ఆల్ట్రోజ్ రికార్డులకెక్కింది. కారును డైరెక్టుగా సీఎన్‍జీ మోడ్‍లోనే ఆన్ చేసే సదుపాయం ఉంటుంది. అయితే పెట్రోల్, సీఎన్‍జీ రెండింట్లో దేనితోనైనా ఈ ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ కారు నడుస్తుంది.

ఇంజిన్ సామర్థ్యం..

ఈ కారులో 1.2-లీటర్ పెట్రోల్ రెవోట్రోన్ ఇంజిన్‍ ఉంది. 6,000 ఆర్పీఎం వద్ద 73.5 పీఎస్ పవర్, 3,500 ఆర్పీఎం వద్ద 103ఎన్ఎం పీక్ టార్క్ ను ఈ ఇంజిన్ జనరేట్ చేస్తుంది. రెండు సీఎన్‍జీ సిలిండర్లను ఈ కారు లగేజ్ ఏరియాలో టాటా మోటార్స్ ఇచ్చింది. దీంతో సాండర్డ్ ఆల్ట్రోజ్‍తో పోలిస్తే ఈ ఐసీఎన్‍జీ వెర్షన్‍లో బూట్ స్పేస్ తక్కువగా ఉంటుంది. టాటా ఆల్ట్రోజ్ కారు ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉంది. XE, XM+, XM+(S), XZ, XZ+(S), XZ+O(S) వేరియంట్లు.. ఒపేరా బ్లూ, డౌన్‍టౌన్ రెడ్, అర్కేడ్ గ్రే, అవెన్యూ వైట్ కలర్ ఆప్షన్‍లలో అందుబాటులో ఉన్నాయి. ఈ కార్లకు మూడేళ్లు లేదా లక్ష కిలోమీటర్లు ఏది త్వరగా వస్తే అంది స్టాండర్డ్ వారంటీని కంపెనీ అందిస్తోంది.

ఇవి కూడా చదవండి

అత్యాధునిక ఫీచర్లు..

టాటా కొత్త సీఎన్ జీ కారులో ప్రొజెక్టర్ హెడ్‍ల్యాంప్‍లు, ఎల్ఈడీ డీఆర్ఎల్‍లు, ఆర్16 డైమండ్ కట్ అలాయ్ వీల్స్, క్యాబిన్‍లో ఎనిమిది స్పీకర్లు, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‍మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆటో కార్ ప్లే కనెక్టివిటీ సపోర్ట్ ఫీచర్లు ఉంటాయి. ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక ఏసీ వెంట్స్, ఎత్తును అడ్జస్ట్ చేసుకునే వీలుండే డ్రైవర్ సీటు కూడా ఉంటాయి. వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రానిక్ సన్‍రూఫ్, వైర్లెస్ చార్జర్, ఎయిర్ ప్యూరిఫైర్ లాంటి అధునాతన ఫీచర్లను ఈ టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ కారు కలిగి ఉంది.

క్రాష్ టెస్ట్ లో 5స్టార్ రేటింగ్..

టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ కారులో సేఫ్టీకి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఏఎల్ఎఫ్ఏ(అజైల్, లైట్, ఫ్లెక్సిబుల్, అడ్వాన్స్డ్) ఆర్కిటెక్చర్ ప్లాట్ ఫారం ఉంటుంది. గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ దీనికి 5స్టార్ రేటింగ్ వచ్చింది. అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లైన మైక్రో స్విచ్ ఉంటుంది. ఇది కారు రీ ఫ్యూలింగ్ చేసుకొనే టప్పుడు కారు ఇంజిన్ ఆఫ్ లో ఉంచేలా చేస్తుంది.  టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ కారు ధరలు రూ.7.55 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ.10.55లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. వేరియంట్లను బట్టి ఈ మధ్య రేటు మారుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?