Electric Vehicles: భారతదేశంలో ఆశ్చర్యకరంగా ఈవీ వృద్ధి.. 2030 నాటికి వృద్ధి అంచనా ఎంతంటే?
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వ్యాప్తి 2024 క్యాలెండర్ సంవత్సరంలో గణనీయమైన వృద్ధి సాధిస్తుంది. 2024 క్యాలెండర్ సంవత్సరంలో ఈ వృద్ధి 7.4 శాతానికి పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. 2030 నాటికి ఈ వృద్ధి 30 నుంచి 35 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఈవీ రంగ వృద్ధి గురించి మరన్ని వివరాలను తెలుసుకుందాం.

ప్రపంచవ్యాప్తంగా ఈవీ రంగం వృద్ధి ఇతర రంగాలను ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఈవీ రంగం వేగంగా వృద్ది చెందుతుంంది. ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ నివేదిక ప్రకారం 2030 నాటికి భారతదేశంలో ఈవీ రంగం 30 నుంచి 35 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. అయితే అప్పకటికీ కూడా ఐసీఈ వాహనాలు భారతీయ రహదారులపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 2024లో విక్రయించి ప్రతి నాలుగు వాహనాల్లో ఒకటిగా ఈవీగా ఉంది. ఇది ఐదు సంవత్సరాల క్రితం 40 వాహనాలకు ఒక ఈవీ ఉండేది. మొబైల్ కమ్యూనికేషన్‌లలో నేరుగా 3జీ నుంచి 4జీకి మారినట్లే ఈవీ రంగంలో కూడా భారతదేశంలో వేగంగా దూసుకుపోతుందని నివేదికలో పేర్కొంది.
భారతదేశంలో ఈవీ వృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు మద్దతు ఇస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఐసీఈ వాహనాలకు 28 శాతం ట్యాక్స్‌లు చేస్తే ఈవీలపై 5 శాతం మాత్రమే జీఎస్టీ వసూలు చేస్తున్నారు. అలాగే అనేక రాష్ట్రాల్లో రహదారి పన్నులపై మినహాయింపులు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఫేమ్, పీఎం ఈ-డ్రైవ్ పథకాల కింద సబ్సిడీలు కూడా పొందవచ్చు. అలాగే ఎస్‌పీఎంఈపీసీఐ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం దిగుమతి సుంకం రాయితీలు ఇవ్వడంతో స్థానికంగా ఉత్పత్తిని ఏర్పాటు చేయడానికి ప్రపంచ ఈవీ తయారీదారులు ముందుకు వచ్చారని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఖర్చు విషయంలో తక్కువ అవ్వడంతో పాటు చిన్న బ్యాటరీలు, వాణిజ్య వినియోగ కేసుల కారణంగా ద్విచక్ర వాహనాల్లో ఈవీ రంగంలో వేగంగా వృద్ధి చెందిందని నిపుణులు చెబుతున్నారు. అయితే కార్ల వినియోగదారుల విషయానికి వచ్చే సరికి ఖర్చు ఆదా కంటే పనితీరుకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఈవీ కార్ల అమ్మకాలు మందకొడిగా ఉన్నాయని నిపుణులు వివరిస్తున్నారు.
2030 ఆర్థిక సంవత్సరం 100 జీడబ్ల్యూహెచ్ ఈవీ బ్యాటరీ సామర్థ్యాన్ని సాధించడానికి మూలధన వ్యయంలో 500-600 బిలియన్ల రూపాయలు అవసరమని నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం, భారతదేశం దాని బ్యాటరీ అవసరాలలో 75 శాతం దిగుమతులపై ఆధారపడుతుంది. అయితే పీఎల్ఐ పథకంలో జాయింట్ వెంచర్‌లు 2030 నాటికి దీనిని 50 శాతానికి కి తగ్గించగలవని భావిస్తున్నారు. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలకు కూడా గణనీయమైన పెట్టుబడి అవసరమని నివేదికలో స్పష్టం చేశారు. భారతదేశంలో 25,000 కంటే ఎక్కువ ఛార్జర్‌లు ఉన్నాయి. అయితే వీటిల్లో ఫాస్ట్ చార్జర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. 2030 నాటికి పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను 90,000 యూనిట్లకు విస్తరించడానికి మూలధన పెట్టుబడిలో 200 బిలియన్ల రూపాయలు అవసరం అవుతుందని చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి