Google Pixel 8A: ఆ గూగుల్ పిక్సెల్ ఫోన్‌పై బంపర్ ఆఫర్.. రూ.16 వేలకే మీ సొంతం
భారతదేశంలో స్మార్ట్‌ఫోన్స్ వినియోగం బాగా పెరిగింది. భారతదేశ జనాభాలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువ. దీంతో చాలా మంది బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్స్‌ను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ప్రీమియం ఫోన్స్ వాడాలనే కోరిక ఉన్నా వాటి ధర విషయంలో కాస్త వెనుకడుగు వేస్తారు. ఇలాంటి వారికి ప్రముఖ కంపెనీ గూగుల్ గుడ్ న్యూస్ చెప్పింది. గూగుల్ పిక్సెల్8ఏ ఫోన్‌పై భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో గూగుల్ ఫోన్‌పై ఉన్న ఆఫర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

గూగుల్ స్మార్ట్‌ఫోన్‌లు సాధారణంగా ప్రీమియం కేటగిరీలో ఉంటాయి. సాధారణ ఆండ్రాయిడ్ ఫోన్స్‌తో పోలిస్తే వాటి ఫీచర్లు కొద్దిగా భిన్నంగా ఉంటాయి. అలాగే ధర విషయంలో కూడా భారీ వ్యత్యాసం ఉంటుంది. అయితే గూగుల్ కంపెనీ ఇప్పుడు కేవలం రూ.16 వేలకే గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్‌ను అందించనుంది. ప్రస్తుతం, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డీల్‌లను అందజేస్తున్నాయి. అమెజాన్ గూగుల్ పిక్సెల్ ఫోన్స్‌పై తగ్గింపులను ప్రకటించింది. పిక్సెల్-8 సిరీస్‌లోని గూగుల్ పిక్సెల్ 8ఏ స్మార్ట్‌ఫోన్‌పై గణనీయంగా తగ్గింపు న ప్రకటించింది. ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ 8ఏ అమెజాన్‌లో రూ. 49,999కి అందుబాటులో ఉంది.
అమెజాన్ గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్2పై 22 శాతం తగ్గింపును అందించడంతో ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 38,999 మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌తో చెల్లిస్తే మీరు 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను కూడా అందుకోవచ్చు. ఈ డీల్ గూగుల్ పిక్సెల్ 8ఏ స్మార్ట్‌ఫోన్ 128 జీబీ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందడానికి కొన్ని షరతులు ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్‌పై అమెజాన్ ప్రస్తుతం రూ.22,800 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. దీంతో మీరు మీ ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకుంటే తగ్గింపులతో కలిపి రూ.16,000కే కొనుగోలు చేయవచ్చు. అయితే మీ పాత ఫోన్ ధర అనేది మీరు ఎక్స్చేంజ్ చేసే ఫోన్ మోడల్, కండిషన్‌కు అనుగుణంగా ఉంటుంది.
గత సంవత్సరం మే గూగుల్ గూగుల్ పిక్సెల్ 8ఏ ప్రారంభించింది. అల్యూమినియం ఫ్రేమ్‌తో ప్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్‌తో వచ్చే ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.1 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పని చేస్తుంది. అలాగే గూగుల్ టెన్సర్ జీ3 చిప్ ఈ ఫోన్ ప్రత్యేకత. గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్‌లో 64 ఎంపీ, 1 ఎంపీ లెన్స్‌లతో ఉన్న డ్యూయల్ కెమెరా సెటప్ ఆకట్టుకుంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 ఎంపీ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి