గుడ్‌న్యూస్‌.. “క్రిప్టో”కు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. ఫుల్‌ఖుషీలో ఇన్వెస్టర్లు..!

క్రిప్టో కరెన్సీలతో ట్రాన్సాక్షన్స్‌ చేయరాదంటూ.. 2018 ఏప్రిల్‌లో రిజర్వ్ బ్యాంక్ నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ..

గుడ్‌న్యూస్‌.. క్రిప్టోకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. ఫుల్‌ఖుషీలో ఇన్వెస్టర్లు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 04, 2020 | 4:25 PM

క్రిప్టో కరెన్సీ వినియోగంపై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పును వెలువరించింది. క్రిప్టో కరెన్సీలతో ట్రాన్సాక్షన్స్‌ చేయరాదంటూ.. 2018 ఏప్రిల్‌లో రిజర్వ్ బ్యాంక్ నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ..ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా నేతృత్వంలో.. పలు క్రిప్టోకరెన్సీ ఏజెన్సీలు సుప్రీంను ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో బుధవారం నాడు..జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారీమణ్‌, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌, జస్టిస్ వి.రామసుభ్రమణియన్‌తో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం.. ఆర్‌బీఐ విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. వర్చువల్‌ కరెన్సీపై సరైన నియంత్రణ చేయలేమంటూ.. తప్పుడు అవగాహనతోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2018లో ఈ నిర్ణయం తీసుకుందని ఐఎమ్‌ఏఐ తరఫు న్యాయవాది ధర్మాసనం ముందు వివరించారు. ఈ క్రిప్టోకరెన్సీ నిషేధం వల్ల.. బ్యాంకింగ్‌ వ్యవస్థ వెలుపల దీనికి సంబంధించిన ట్రేడింగ్ జరిగితే.. అప్పుడు అక్రమాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు.