Sugar Exports: వచ్చే సీజన్ లోనూ చక్కెర ఎగుమతులపై ఆంక్షలు తప్పవా.. ప్రభుత్వం ఏమంటోందంటే..

Sugar Exports: ప్రస్తుత సీజన్‌లో ఎగుమతి అయ్యే చక్కెర పరిమాణంపై ప్రభుత్వం ఇప్పటికే పరిమితి విధించింది. గతంలో భారత్ నుంచి గోధుమల ఎగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం మనందరికీ తెలిసిందే.

Sugar Exports: వచ్చే సీజన్ లోనూ చక్కెర ఎగుమతులపై ఆంక్షలు తప్పవా.. ప్రభుత్వం ఏమంటోందంటే..
Sugar Exports Ban
Follow us

|

Updated on: Jun 18, 2022 | 2:52 PM

Sugar Exports: ప్రస్తుత సీజన్‌లో ఎగుమతి అయ్యే చక్కెర పరిమాణంపై ప్రభుత్వం ఇప్పటికే పరిమితి విధించింది. గతంలో భారత్ నుంచి గోధుమల ఎగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం మనందరికీ తెలిసిందే. దేశీయ మార్కెట్లో లభ్యతను నిర్ధారించడానికి, ధరలను అదుపులో ఉంచడానికి.. భారత ప్రభుత్వం (GOI) తదుపరి సీజన్‌లో కూడా చక్కెర ఎగుమతిపై పరిమితులను విధించవచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే.. చక్కెర ఎగుమతులపై భారత్ ఆంక్షలు విధించడం వరుసగా రెండవ సీజన్ అవుతుంది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

చక్కెర ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారు, రెండవ అతిపెద్ద ఎగుమతిదారుగా భారత్ నిలిచింది. అక్టోబరు 2022లో ప్రారంభమయ్యే కొత్త సీజన్‌లో 6 నుంచి 7 మిలియన్ టన్నుల చక్కెరకు పరిమితి విధించవచ్చని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ తాజా రాయిటర్స్ వార్తా సంస్థ నివేదిక పేర్కొంది. ఇది ప్రస్తుత సీజన్ ఎగుమతుల కంటే దాదాపు మూడింట ఒక వంతు తక్కువ. దేశంలో చక్కెర సీజన్ అక్టోబర్ నుంచి మొదలై వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. అయితే.. వచ్చే సీజన్‌లో చక్కెర ఎగుమతిపై ఆంక్షలపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ఏమీ చెప్పలేదు. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా తలెత్తిన గ్లోబల్ ఫుడ్ క్రైసిస్ పరిస్థితి అనేక దేశాలు ఆహార పదార్థాల ఎగుమతిని నిలిపివేయవలసి వచ్చింది.

అదే సమయంలో చక్కెర ఎగుమతిలో రెండో స్థానంలో ఉన్న భారత్‌ దేశీయ ఎగుమతులపై నిషేధం విధించడం వల్ల గ్లోబల్ మార్కెట్‌లో దాని ధరలు మరింత పెరగవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. ప్రపంచ మార్కెట్‌లో చక్కెర ధరలు ఇప్పటికే ఐదున్నరేళ్ల గరిష్టానికి చేరాయి. మరో పక్క బ్రెజిల్ కూడా చక్కెర ప్రధాన ఉత్పత్తిదారులు, ఎగుమతిదారుల్లో ఒకటిగా ఉంది. బ్రెజిల్‌లో చెరకు పంట దిగుబడి తక్కువగా ఉంటుందని అంచనా. ముడి చమురు ధరలు చాలా సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్నందున, చక్కెర మిల్లులు చెరకు నుంచి ఎక్కువ ఇథనాల్‌ను తయారు చేయడం ప్రారంభించాయి. ఇది చక్కెర ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ అంశాలు కూడా చక్కెర ధరలను పెరుగుదలకు కారణాలుగా నిలుస్తున్నాయి. దేశీయ మార్కెట్‌లో భయాందోళనలను నివారించడానికి చక్కెర ఎగుమతిపై నిషేధం అవసరమని విషయం తెలిసిన ప్రభుత్వ అధికారి ఒకరు రాయిటర్స్‌తో అన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.