SBI: వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్‌ చేయొద్దు.. మరోసారి ఖాతాదారులను హెచ్చరించిన ఎస్‌బీఐ!

|

Oct 04, 2022 | 9:50 PM

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉండి, బ్యాంకు పేరుతో మీకు చాలా ఫేక్ కాల్‌లు వచ్చినట్లయితే మీరు దాని గురించి జాగ్రత్తగా ఉండాలి. దీనికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లందరికీ..

SBI: వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్‌ చేయొద్దు.. మరోసారి ఖాతాదారులను హెచ్చరించిన ఎస్‌బీఐ!
SBI సీనియర్ సిటిజన్‌లకు అన్ని కాల వ్యవధిలో అదనంగా 50 bps వడ్డీ రేటును అందించనుంది. తాజా సవరణ తర్వాత సీనియర్ సిటిజన్లు 7 రోజుల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే FDలపై 3.5% నుంచి గరిష్టంగా 7.25% వరకు వడ్డీని పొందుతారు.
Follow us on

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉండి, బ్యాంకు పేరుతో మీకు చాలా ఫేక్ కాల్‌లు వచ్చినట్లయితే మీరు దాని గురించి జాగ్రత్తగా ఉండాలి. దీనికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లందరికీ ఫేక్ కాల్స్ గురించి హెచ్చరిక జారీ చేసింది. మోసపూరిత నంబర్ల నుండి పంపిన లింక్‌పై క్లిక్ చేయవద్దని ఎస్‌బిఐ తన కస్టమర్లను కోరింది. మీకు మరేదైనా నంబర్ నుండి కాల్ వచ్చి, కేవైసీని అప్‌డేట్ చేయమని అడిగితే, మీరు బ్యాంక్ సంబంధిత సమాచారాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. లేకుంటే మీరు మోసానికి గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఎస్‌బీఐ కస్టమర్లందరూ అలాంటి అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని అభ్యర్థించింది. బ్యాంక్ తన కస్టమర్‌లకు కేవైసీ గురించి ఫోన్‌ చేయదని, కేవైసీ అప్ డేట్ లింక్‌పై క్లిక్ చేయవద్దని కోరింది. కేవలం కాల్స్‌లో మాత్రమే కాకుండా ఎస్‌ఎంఎస్‌, ఇమెయిల్ మొదలైన వాటిపై కూడా ఇటువంటి లింక్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని బ్యాంక్ కోరింది.

అలాగే మీ పుట్టిన తేదీ, డెబిట్ కార్డ్ నంబర్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, డెబిట్ కార్డ్ పిన్, సీబీబీ, ఓటీపీ వంటి నంబర్‌లను ఎవరితోనూ షేర్ చేయవద్దు. ఇది కాకుండా ఎస్‌బీఐ, ఆర్బీఐ కార్యాలయం, పోలీస్, కేవైసీ అథారిటీ పేరుతో వచ్చే ఫోన్ కాల్‌లతో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తెలియని వ్యక్తులు పంపిన మెయిల్స్, మెసేజ్‌లలోని లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దని, తెలియని యాప్స్‌ను సైతం డౌన్‌లోడ్‌ చేసుకోవద్దని సూచించింది. మీకు సోషల్ మీడియా లేదా మెసేజ్‌లు, ఫోన్‌లలో వచ్చే ఎలాంటి ఫేక్ ఆఫర్‌ల పట్ల జాగ్రత్త వహించండి అని ఎస్‌బీఐ చెబుతోంది. మీ బ్యాంక్ ఖాతా నంబర్ పాస్‌వర్డ్, ఏటీఎం కార్డ్ నంబర్‌ను ఉంచడం, దాని చిత్రాన్ని తీయడం కూడా మీ సమాచారాన్ని లీకయ్యే ప్రమాదం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి