Flipkart Customer: కొంప ముంచిన బిగ్ బిలియన్ డేస్ సేల్.. ఆన్‌లైన్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్.. ఓపెన్ చేసి చూస్తే షాక్..!

Flipkart Customer: కొంప ముంచిన బిగ్ బిలియన్ డేస్ సేల్.. ఆన్‌లైన్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్.. ఓపెన్ చేసి చూస్తే షాక్..!

Anil kumar poka

|

Updated on: Oct 04, 2022 | 7:17 PM

బిగ్ బిలియన్ డేస్ సేల్ నా కొంప ముంచిందంటున్నాడు ఓ ఫ్లిప్‌కార్ట్ కస్టమర్. ల్యాప్‌టాప్ కోసం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్‌లో ఆర్డర్ చేశాడు. తీరా డెలివరీ అయ్యాకా...


బిగ్ బిలియన్ డేస్ సేల్ నా కొంప ముంచిందంటున్నాడు ఓ ఫ్లిప్‌కార్ట్ కస్టమర్. ల్యాప్‌టాప్ కోసం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్‌లో ఆర్డర్ చేశాడు. తీరా డెలివరీ అయ్యాకా ఆ బాక్సు ఓపెన్ చేసి చూసి షాకవడం మా కుటుంబం వంతయ్యింది. యశస్వి శర్మ అనే వ్యక్తి బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ఆన్‌లైన్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ డెలివరి సమయంలో ఓపెన్ బాక్సు కాన్సెప్ట్ తెలియకపోవడంతో డెలివరి బాయ్ ఇచ్చిన బాక్సు తీసుకుని అతడికి ఓటీపీ చెప్పి పంపించేశారు. తీరా ల్యాప్‌టాప్ బాక్సు ఓపెన్ చేసి చూస్తే.. అందులో ల్యాప్‌టాప్‌కి బదులుగా ఘడి బట్టల సబ్బులు ఉన్నాయని యశస్వి శర్మ వాపోయాడు. డెలివరి బాయ్ వచ్చి, వెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. అతడి ముందు ల్యాప్‌టాప్ బాక్సు ఓపెన్ చేయలేదు. ఆ విషయాన్ని సీసీటీవీ దృశ్యాలతో సహా ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌కి ఫిర్యాదు చేసినప్పటికీ.. వాళ్లు కూడా తనదే తప్పని నింద వేయడం విస్మయానికి గురిచేస్తోందని యశస్వి శర్మ చెప్పుకొచ్చాడు. తాను ఫ్లిప్‌కార్డ్ చేతిలో ఎలా మోసపోయానన్న మొత్తం వైనాన్ని యశశ్వి శర్మ సోషల్ మీడియా వేదికగా పోస్టులో పేర్కొన్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యశస్వి శర్మ పోస్ట్ వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Published on: Oct 04, 2022 07:17 PM