Ather 450 Apex: త్వరలోనే మార్కెట్‌లోకి ఏథర్‌ 450 అపెక్స్‌.. అదిరిపోయే ఫీచర్స్‌ ఈ స్కూటర్‌ సొంతం

పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా అన్ని కంపెనీలు కొత్తకొత్త మోడల్‌ ఈవీ స్కూటర్లను లాంచ్‌ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ ఈవీ కంపెనీ ఏథర్‌ మరో కొత్త స్కూటర్‌ను లాంచ్‌ చేస్తుంది. ఏథర్‌ ఎనర్జీ త్వరలో ఏథర్‌ 450 అపెక్స్‌ అలనే కొత్త స్కూటర్‌ను లాంచ్‌ చేయనుంది. ఈ స్కూటర్‌ డెలివరీలో 2024 నుంచి ప్రారంభం అవుతాయని కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్‌ గురించి మరిన్ని వివరాలు తెలియకపోయినా త్వరిత తర్పణం, అధిక వేగం, పనితీరు కోసం ఈ నయా స్కూటర్‌ను ఏథర్‌ లాంచ్‌ చేస్తుంది. ఏథర్‌ అపెక్స్‌ 450 గురించి మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

Ather 450 Apex: త్వరలోనే మార్కెట్‌లోకి ఏథర్‌ 450 అపెక్స్‌.. అదిరిపోయే ఫీచర్స్‌ ఈ స్కూటర్‌ సొంతం
, Ather 450 Apex
Follow us
Srinu

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 01, 2023 | 8:36 PM

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఈవీ వాహనాల ట్రెండ్‌ నడుస్తుంది. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్‌ ధరలకు ప్రత్యామ్నాయంగా సగటు మధ్య తరగతి కుటుంబాలు ఈవీ వాహనాల కొనుగోలుకు ప్రాధాన్యతను ఇస్తున్నారు. అలాగే పెరుగుతున్న వాయు కాలుష్యానికి చెక్‌ పెట్టడానికి ప్రభుత్వాలు కూడా ఈవీ వాహనాలపై సబ్సిడీలను అందిస్తూ ప్రోత్సహిస్తున్నాయి. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా అన్ని కంపెనీలు కొత్తకొత్త మోడల్‌ ఈవీ స్కూటర్లను లాంచ్‌ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ ఈవీ కంపెనీ ఏథర్‌ మరో కొత్త స్కూటర్‌ను లాంచ్‌ చేస్తుంది. ఏథర్‌ ఎనర్జీ త్వరలో ఏథర్‌ 450 అపెక్స్‌ అలనే కొత్త స్కూటర్‌ను లాంచ్‌ చేయనుంది. ఈ స్కూటర్‌ డెలివరీలో 2024 నుంచి ప్రారంభం అవుతాయని కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్‌ గురించి మరిన్ని వివరాలు తెలియకపోయినా త్వరిత తర్పణం, అధిక వేగం, పనితీరు కోసం ఈ నయా స్కూటర్‌ను ఏథర్‌ లాంచ్‌ చేస్తుంది. ఏథర్‌ అపెక్స్‌ 450 గురించి మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

ఏథర్‌ అనర్జీ తన 10వ వార్షికోత్సవం సందర్భంగా ఏథర్‌ అపెక్స్‌ 450ను లాంచ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఈ స్కూటర్‌ అధునాతన బ్యాటరీ ప్యాక్‌తో పని చేస్తుంది. ఏథర్‌ 450 ఎక్స్‌ 26 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా 6.4 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్‌ మోటర్‌తో వచ్చే 3.7 కేడబ్ల్యూహెచ్‌ స్థిర బ్యాటరీ ప్యాక్‌ ద్వారా శక్తిని పొందుతుంది. ముఖ్యంగా ఈ స్కూటర్‌ ఓ సారి చార్జ్‌ చేస్తే 150 కిలో మీటర్ల మైలేజ్‌ ఇస్తుంది. ముఖ్యంగా ఈ స్కూటర్‌ 3.3  నిమిషాల్లో 0-40 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. 

ఏథర్‌లో మిగిలిన స్కూటర్లు ఇవే

ఇవి కూడా చదవండి

450 ఎక్స్‌ 2.9 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ స్కూటర్‌ 111 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. అలాగే ఏథర్‌ 450 ఎస్‌ స్కూటర్‌ 2.9 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 450 ఎస్‌తో రూ.1.30 లక్షల నుంచి ధరలు ప్రారంభం అవుతాయి. ఆ తర్వాత 2.9 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీతో 450 ఎక్స్‌ రూ.1.38 లక్షల ధరతో ప్రారంభం అవుతుంది. టాప్‌ స్పెక్‌తో 450 ఎక్స్‌ 3.7 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీతో వస్తుంది. అలాగే ఈ స్కూటర్‌ ధర రూ.1.45 లక్షలుగా ఉంటుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్