AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Firing: సైలెంట్‌ ఫైరింగ్‌ను ఫాలో అవుతోన్న కంపెనీలు.. అసలేంటిది.?

ఏఐ వినియోగంతో భారీగా ఉద్యోగాల కోత తప్పదని వాదనలు విపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగించుకునే పనిలో పడ్డాయి. అయితే ఇందులో భాగంగానే కంపెనీలు సైలెంట్ ఫైరింగ్ అనే విధానాన్ని అవలంభిస్తున్నాయని అంటున్నారు. ఇంతకీ ఏంటీ సైలెంట్ ఫైరింగ్ ఇప్పుడు తెలుసుకుందాం..

Firing: సైలెంట్‌ ఫైరింగ్‌ను ఫాలో అవుతోన్న కంపెనీలు.. అసలేంటిది.?
Silent Firing
Narender Vaitla
|

Updated on: Oct 30, 2024 | 2:45 PM

Share

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కారణంగా భారీగా ఉద్యోగాల్లో కోత తప్పదని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి కూడా. చిన్న చిన్న స్టార్టప్‌లు మొదలు మల్టీ నేషనల్‌ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగించాయి. అయితే ఇదే సమయంలో కంపెనీలు ఒక సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నాయి. సైలెంట్‌ ఫైరింగ్ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇంతకీ అసలేంటీ సైలెంట్ ఫైరింగ్‌ ట్రెండ్‌ ఇప్పుడు తెలుసుకుందాం..

కంపెనీలు ఉద్యోగులను తొలగించడకుండా.. తామంతటతామే ఉద్యోగం నుంచి వెళ్లిపోయేలా చేస్తున్నాయి. దీనినే సైలెంట్‌ ఫైరింగ్‌గా చెబుతున్నారు. ఉద్యోగులు చేసే పనిని కష్టతరం చేసి వారంతటవారే ఉద్యోగం నుంచి రాజీనామా చేసేలా చేస్తున్నారు. దీంతో ఉద్యోగుల స్థానంలో ఏఐని భర్తీ చేయాలని ఆలోచన చేస్తున్నారని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ విషయమై ప్రాస్పరే.ఏఐ అనే సంస్థ సీఈఓ మాట్లాడుతూ.. ‘కరోనా తర్వాత చాలా కంపెనీలు కచ్చితంగా ఆఫీసులకు రావాలనే నిబంధనను అమలు చేస్తూ వచ్చాయి. దీంతో కొందరు ఉద్యోగులు ఉద్యోగాన్ని వదులుకోవడానికి సైతం సిద్ధమయ్యారు. రిమోట్‌ వర్క్ ద్వారా ఉత్పాదకత పెరుగుతుందని పలు నివేదికలు వెల్లడించినప్పటికీ అమెజాన్‌ లాంటి సంస్థలు కార్యాయాలకు రావాలని సూచిస్తున్నాయి. తద్వారా ‘సైలెంట్‌ ఫైరింగ్‌’ ట్రెండ్‌ను అమెజాన్‌ వంటి సంస్థలు అనుసరిస్తున్నాయి’ అని ఆయన చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే ఏఐ వినియోగం భారీగా పెరుగుతోన్న నేపథ్యంలో చాలా మంది తమ ఉద్యోగం గురించి ఆందోళన చెందుతున్నట్లు సర్వేలో తేలింది. అభద్రత కారణంగా పనిపై ఏకాగ్రత చూపలేకపోతున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. 10 మంది ఉద్యోగుల్లో ముగ్గురు వ్యక్తులు పనిపై ఏకాగ్రత చూపడం లేదని తెలుస్తోంది. అయితే ఏఐ ద్వారా రానున్న దశాబ్ధంలో కేవలం 5 శాతం ఉద్యోగాలపై మాత్రమే ప్రభావం పడుతుందని ఎంఐటీ ఆర్థికవేత్త డారన్‌ అసిమోగ్లూ అభిప్రాయపడుతున్నారు. కార్మికులు చేస్తున్న పనులను ఏఐకి అప్పజెప్పాలంటే ఆ సాంకేతికతకు అంతటి విశ్వసనీయత ఉండాలని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఏఐ వినియోగంతో మరిన్ని కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..