AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోటీశ్వరులు అవ్వాలనుకుంటున్నారా? జస్ట్‌ నెలకు రూ.10 వేలతోనే మీ కలలు నిజం అవుతాయి..

సాధారణంగా పోస్టాఫీస్ స్కీమ్స్, FDలు తక్కువ రాబడినిస్తాయి. మ్యూచువల్ ఫండ్ SIPలతో దీర్ఘకాలంలో భారీ సంపద సృష్టించవచ్చు. నెలకు రూ.10 వేల SIPతో 30 ఏళ్లలో రూ.7 కోట్లు పొందడం ఎలాగో తెలుసుకోండి. కాంపౌండింగ్ శక్తిని ఉపయోగించుకుంటూ, గత పనితీరును పరిశీలించి సరైన ఫండ్ ఎంచుకోవడం ద్వారా మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవచ్చు.

కోటీశ్వరులు అవ్వాలనుకుంటున్నారా? జస్ట్‌ నెలకు రూ.10 వేలతోనే మీ కలలు నిజం అవుతాయి..
Indian Currency
SN Pasha
|

Updated on: Oct 06, 2025 | 12:40 PM

Share

చాలా మందికి డబ్బు బాగా సంపాదించాలనే కల ఉంటుంది. ఎంత కష్టం అయినా పడాలి కానీ, ఏదో ఒక రోజు కోటీశ్వరులు అవ్వాలని అనుకుంటారు. అయితే అందుకోసం క్రమశిక్షణగా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా మన లక్ష్యాలను అందుకోవచ్చు. అందుకోసం ఒక అద్భుతమైన సిప్‌ ప్లాన్‌ గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

పోస్టాఫీస్ స్కీమ్స్, ప్రభుత్వ పథకాలు, సంప్రదాయ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను చాలా మంది పెట్టుబడి మార్గాలుగా  ఎంచుకుంటారు. వీటిలో నిర్దిష్ట మొత్తం పెట్టుబడులపై నిర్దిష్ట కాల పరిమితికి నిర్దిష్ట వడ్డీ రేటు ప్రకారం రాబడి వస్తుంటుంది. దీర్ఘకాలంలో మంచి రాబడి అందుకునేందుకు.. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటివి ఉంటాయి. అయితే ఇక్కడ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కానీ, సుదీర్ఘ కాలంలో మంచి రాబడి వస్తుందని చెప్పొచ్చు. కచ్చితంగా రిటర్న్స్ వస్తాయని గ్యారెంటీ ఏం ఉండదు కానీ చాలా వరకు గతంలో మంచి రిటర్న్స్ అందించినవి ఉన్నాయి. ఇక్కడ వార్షిక ప్రాతిపదికన సగటున 12 శాతానికి మించి రాబడి వస్తుంటుంది.

వీటిలో మీరు చిన్న మొత్తాల్లో పెట్టుబడితో 30 ఏళ్లలో పెద్ద మొత్తంలో రాబడి అందుకోవచ్చు. సామాన్యులు కూడా పెట్టుబడి పెట్టేందుకు వీలుగా కనీసం రూ.2 వేల నుంచి కూడా ఇన్వెస్ట్ చేస్తే మెరుగైన రాబడే వస్తుంటుంది. ఉదాహరణకు రూ.10 వేల సిప్ లెక్కన 15 శాతం వార్షిక ప్రాతిపదికన 30 ఏళ్లకు మీ పెట్టుబడి మొత్తం రూ.36 లక్షలు కాగా.. అంచనా రాబడి రూ.6,64,98,206గా ఉంటుంది. మొత్తంగా మీరు రూ.7 కోట్ల వరకు పొందుతారు. ఇక్కడ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ కారణంగా ఇంత మొత్తంలో రిటర్న్స్ వస్తుంటాయని చెప్పొచ్చు.

అయితే మీరు కొన్ని విషయాల్ని గమనించాల్సి ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న మ్యూచువల్ ఫండ్ కేటగిరీ (ఈక్విటీ, డెట్, ఇండెక్స్, హైబ్రిడ్ ఫండ్స్) గత 15-20 సంవత్సరాల్లో ఇచ్చిన సగటు రిటర్న్స్ ఆధారంగా మీ అంచనా రాబడిని నిర్ణయించుకోవాలి. ఇంకా ఏదైనా నిర్దిష్ట పథకంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటే ఆ స్కీం గతంలో ఇచ్చిన సిప్ రాబడుల్ని పరిశీలించి.. దాని పనితీరు నిర్ధరించుకోవాలి. మీరు ఆశించే రాబడి రేటు, ఎంచుకున్న స్కీమ్ పెట్టుబడి లక్ష్యంతో మీ సొంత ఆర్థిక లక్ష్యాలు కూడా సరిపోలాలి.

మరిన్ని పర్సనల్‌ ఫైనాన్స్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా