Silver Price Today: వెండి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. స్థిరంగా కొనసాగుతున్న సిల్వర్ ధరలు..!
Silver Price Today: బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పండగ సీజన్‌లో ధరలు షాకిస్తున్నాయి. అయితే నిన్న పెరిగిన వెండి..
Silver Price Today: బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పండగ సీజన్‌లో ధరలు షాకిస్తున్నాయి. అయితే నిన్న పెరిగిన వెండి ధరలు.. ఈ రోజు ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. స్థిరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వెండి దీపాలు, వెండి విగ్రహాలు, వెండి పాత్రలు కొనుగోలు కూడా బాగానే జరుగుతుంటాయి. అలాగే వెండితో తయారు చేసిన రకరకాల అభరణాలను సైతం చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. దేశంలో బంగారం, వెండికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. దేశీయంగా ధరను పరిశీలిస్తే.. కిలో వెండి ధర రూ.65,600 కొనసాగుతోంది. అయితే హైదరాబాద్‌లో నిన్న భారీగా పెరుగగా, ఈ రోజు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ ధరలు ఉదయం 6 గంటల సమయానికి నమోదైనవి. దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ధరలు ఇలా ఉన్నాయి.
ప్రధాన నగరాల్లో వెండి ధరలు.. * దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ.65,600 లుగా ఉంది. * దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెండి ధర కిలో రూ.65,600 వద్ద కొనసాగుతోంది. * తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ.69,900లుగా ఉంది. * బెంగళూరులో వెండి ధర కిలో వెండి రూ.65,600 గా కొనసాగుతోంది. * కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.65,600 ఉంది. * కేరళలో కిలో వెండి ధర రూ.69,900గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో.. * హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.69,900 లుగా కొనసాగుతోంది. * విజయవాడలో వెండి ధర రూ. 69,900 వద్ద కొనసాగుతోంది. * విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ.69,900 లుగా ఉంది.
ప్రతిరోజూ ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొనుగోలుదారులు ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.