Gold Price Today: పండగ సీజన్‌లో బంగారం ధర అదే జోరు.. మహిళలకు షాకిస్తున్న ధరలు..!

Gold Price Today: పండగ సీజన్‌లో పసిడి అదే జోరు కొనసాగుతోంది. బ్రేకులు వేయకుండా పరుగులు పెడుతోంది. మహిళలకు అత్యంత ఇష్టమైన బంగారం..

Gold Price Today: పండగ సీజన్‌లో బంగారం ధర అదే జోరు.. మహిళలకు షాకిస్తున్న ధరలు..!
Gold
Follow us
Subhash Goud

|

Updated on: Oct 25, 2021 | 5:58 AM

Gold Price Today: పండగ సీజన్‌లో పసిడి అదే జోరు కొనసాగుతోంది. బ్రేకులు వేయకుండా పరుగులు పెడుతోంది. మహిళలకు అత్యంత ఇష్టమైన బంగారం అభరణాలకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. అన్ని వేళల్లో బంగారం కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. బులియన్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు, చేర్పులు చేసుకుంటున్నాయి. పసిడి, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగులు చేసే వినియోగదారులు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిపెడుతుంటారు. కరోనా సెకండ్ వేవ్ అనంతరం తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ క్రమంగా ఎగబాకుతోంది. నిన్న కూడా పెరిగిన బంగారం సోమవారం కూడా పెరిగింది. ఇవి సోమవారం ఉదయం 6 గంటల సమయానికి నమోదైన ధరల వివరాలు. తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ధరల వివరాలు.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,910 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,170గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,660 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,660గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,160 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,260 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,710 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,830గా ఉంది.

బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోవడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఇవ్వబడుతున్నాయి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. అందుకే బంగారం కొనుగోలు చేసే ముందు ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం మంచిది.

ఇవీ కూడా చదవండి:

Special Trains: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లు.. ఎక్కడెక్కడ అంటే..!

Matchbox Price: నేనేందుకు పెరగకూడదన్నట్లు 14 సంవత్సరాల తర్వాత రెట్టింపు కానున్న అగ్గిపెట్టె ధర