Matchbox Price: నేనేందుకు పెరగకూడదన్నట్లు 14 సంవత్సరాల తర్వాత రెట్టింపు కానున్న అగ్గిపెట్టె ధర

Matchbox Price: ప్రస్తుతం అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. నిత్యావసర ధరల నుంచి పాలు, పెట్రోల్‌, గ్యాస్‌ సిలిండర్‌ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో వస్తువుల ధరలు..

Matchbox Price: నేనేందుకు పెరగకూడదన్నట్లు 14 సంవత్సరాల తర్వాత రెట్టింపు కానున్న అగ్గిపెట్టె ధర
Matchbox
Follow us
Subhash Goud

|

Updated on: Oct 24, 2021 | 9:48 AM

Matchbox Price: ప్రస్తుతం అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. నిత్యావసర ధరల నుంచి పాలు, పెట్రోల్‌, గ్యాస్‌ సిలిండర్‌ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ఇందులో భాగంగా తానేం తక్కువ కాదన్నట్లుగా అగ్గిపెట్టె ధర కూడా రెట్టింపు కానుంది. ఇన్ని రోజుల నుంచి 1 రూపాయికి మాత్రమే దొరికి అగ్గిపెట్టె ఇకపై 2 రూపాయలకు చేరుకోనుంది. తాజాగా అగ్గిపెట్టె తయారీదార్లకు సంబంధించిన ఐదు కీలక సంఘాలు తాజాగా తమిళనాడులోని శివకాశీలో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నాయి. దేశంలో చివరిసారి 14 సంవత్సరాల క్రితం అంటే 2007లో అగ్గిపెట్టె ధర 50 పైసలు ఉండగా, 1 రూపాయికి చేరుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1 రూపాయి ఉన్న ధర ఇప్పుడు 2 రూపాయలకు చేరుకుంది. దీంతో ఇప్పటివరకు 600 అగ్గిపెట్టెల బాక్సును రూ.270-300కి తయారీదార్లు విక్రయిస్తుండగా, ఇక నుంచి రూ.430-480కి పెంచాలని సంఘాలు సమావేశంలో నిర్ణయించాయి. దీనికి అదనంగా 12 శాతం జీఎస్టీ, రవాణా చార్జీలు ఉంటాయని నేషనల్‌ స్మాల్‌ మ్యాచ్‌బాక్స్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది.

14 ఏళ్ల తర్వాత ధర పెంపు..

కాగా, అగ్గి పెట్టె ధర 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు పెరగనుంది. ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి అగ్గి పెట్టెను రూ.2 చొప్పున విక్రయిస్తామని తయారీ సంస్థల సమాఖ్య ‘ఆలిండియా ఛాంబర్ ఆఫ్ మ్యాచెస్’ ప్రకటించింది. అగ్గిపుల్లల తయారీలో వినియోగించే 14 రకాల ముడి సరుకుల ధరలు భారీగా పెరగడం కారణంగానే ధరను పెంచాల్సి వస్తోందని తెలిపింది.

రెడ్‌ ఫార్ఫరస్‌ ధర పెంపు

అగ్గి పుల్లల తయారీలో ముఖ్యంగా ఉపయోగించే రెడ్‌ ఫాస్ఫరస్‌ ధర రూ.425 నుంచి రూ.810కు, మైనం ధర రూ.58 నుంచి రూ.80కి పెరిగిందని, అగ్గి పెట్టెల బాక్స్‌ బోర్డులు, పేపర్‌, పొటాషియం క్లోరేట్‌, సల్ఫర్ వంటి ముడి పదార్థాల ధరరూ పెరిగిపోయాయని, అందు వల్ల ధర పెంచాల్సి వస్తోందని ‘ఆలిండియా ఛాంబర్ ఆఫ్ మ్యాచెస్’ చెబుతోంది.పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్నంటుతుండటంతో అగ్గి పెట్టెల రవాణా ఛార్జీలు భారమయ్యాయని, మరో అవకాశం లేక మరో దారి లేని అగ్గిపెట్టే ధర రెట్టింపు చేయాల్సి వస్తోందని వెల్లడించింది.

ఇవీ కూడా చదవండి

Dhanteras: ధన త్రయోదశి రోజు బంగారాన్ని ఎందుకు కొంటారు..? పసిడితో పాటు ఇవి కూడా కొంటే మంచిదేనట..!

Gold Price Today: పండగ సీజన్‌లో షాకిస్తున్న బంగారం ధరలు.. మళ్లీ పెరిగిన రేట్లు.. 10 గ్రాముల ధర ఎంతంటే..!

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.