Special Trains: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లు.. ఎక్కడెక్కడ అంటే..!
Special Trains: భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే శాఖ అనే చెప్పాలి. ప్రతి రోజు లక్షలాది మందిని తమతమ గమ్యస్థానాలకు చేరుస్తుంటుంది. ఇతర రవాణా..
Special Trains: భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే శాఖ అనే చెప్పాలి. ప్రతి రోజు లక్షలాది మందిని తమతమ గమ్యస్థానాలకు చేరుస్తుంటుంది. ఇతర రవాణా వ్యవస్థ కంటే రైల్వే వ్యవస్థలో తక్కువ ఛార్జీలు ఉంటాయి. సామాన్యుడికి అందుబాటులో రైల్వే ఛార్జీలు ఉంటాయి. అందుకే చాలా మంది కూడా రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ఇక పండగ సీజన్లు వస్తున్నాయంటే రైల్వే శాఖ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని అదనపు ప్రత్యేక రైళ్లను నడుపుతుంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. దీపావళి పండగ నేపథ్యంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
ఆ ప్రత్యేక రైళ్లనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ట్రైన్ నెంబర్ 08585 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే నెల నవంబర్ 2వ తేదీ మంగళవారం ప్రత్యేక రైలు నడపనున్నారు. ఇక ఈ రైలు ఆ రోజు 17.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07.10 గంటలకు గమ్యం చేరుకుంటుంది.
ఇక రైలు నెంబర్ 08586 సికింద్రాబాద్ నుంచి విశాఖట్నం స్పెషల్ ట్రైన్ నవంబర్ 3న నడపనుంది సౌత్ సెంట్రల్ రైల్వే. ఈ రైలు 03వ తేదీన 21.05 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 09.50 గంటలకు గమ్యం చేరుకోనుంది. రైలు నెంబర్ 08583 విశాఖపట్నం నుంచి తిరుపతికి నవంబర్ 1న ప్రత్యేక రైలు నడపనున్నారు. ఈ రైలు ఆ రోజు 19.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07.30 గంటలకు తిరుపతి చేరుకోనుంది. రైలు నెంబర్ 08584 తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు నవంబర్ 2న స్పెషల్ ట్రైన్ నడపనున్నారు రైల్వే అధికారులు. ఈ స్పెషల్ ట్రైన్ 2వ తేదీన 21.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 10.20 గంటలకు విశాఖ చేరుతుంది. ఇలా పండగను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల రద్దీని బట్టిమరిన్ని రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
Special Trains Between Visakhapatnam – Secunderabad and Visakhapatnam – Tirupati #festival #specialtrains #Diwali pic.twitter.com/wpVuwWmMMR
— South Central Railway (@SCRailwayIndia) October 21, 2021