Fashion Tips: లెహంగా వేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారా.. ఈ స్పెషల్ చిట్కాలను ఫాలో అవ్వండి..

పండుగ వచ్చిందంటే చాలా అడపడుచులు రెడీ అవ్వడం మాములుగా ఉండదు. పట్టుపరికిణీలు, లెహంగాలతో మెరిసిపోతుంటారు. ఇలా అందంగా ముస్తాబైన తర్వాత కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు అమ్మాయిలు.

Fashion Tips: లెహంగా వేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారా.. ఈ స్పెషల్ చిట్కాలను ఫాలో అవ్వండి..
Lehenga
Follow us

|

Updated on: Oct 24, 2021 | 1:44 PM

పండుగ వచ్చిందంటే చాలా అడపడుచులు రెడీ అవ్వడం మాములుగా ఉండదు. పట్టుపరికిణీలు, లెహంగాలతో మెరిసిపోతుంటారు. ఇలా అందంగా ముస్తాబైన తర్వాత కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు అమ్మాయిలు. ఎందుకంటే ఏడాదిలో కొన్నిసార్లు మాత్రమే ఈ సంప్రదాయం దుస్తులను ధరిస్తుంటారు. అయితే ఒక్కడే కొందరికి పెద్ద మొహమాటం వచ్చిపడుతుంటుంది. పెళ్లి అయినా.. పండగ అయినా.. ప్రతి ఒక్కరూ తమను తాము చాలా పర్ఫెక్ట్‌గా కనిపించడానికి ఇష్టపడతారు ముద్దుగుమ్మలు. ఆమె మేకప్ నుండి బట్టల వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ప్రతి మహిళ అద్భుతమైన దుస్తులు ధరించి అందంగా కనిపించాలని కోరుకుంటారు. కాబట్టి మహిళలు మరింత అందంగా కనిపించేందుకు కొత్తదానికి ప్రయత్నింస్తుంటారు.

ఇలాంటి సమయంలో చాలా మంది అమ్మాయిలు నార్త్ ఇండియన్ డ్రెస్ లెహంగా ధరించేందుకు ఇష్టపడుతున్నారు. అందుకు ఓ కారణం ఉంది. ఈ డ్రెస్‌లో చాలా స్టైలిష్ లుక్‌తో మెరిసిపోతుంటారు. అటువంటి పరిస్థితిలో లెహంగా ధరించడానికి కొందరు మహిళలు సంకోచిస్తుంటారు. వాస్తవానికి కొంతమంది మహిళలు బెల్లి ఫ్యాట్ కారణంగా లెహంగాను ధరించడానికి దూరంగా ఉంటారు. అయితే ఆ ఇబ్బందిని ఎలా కవర్ చేయాలి..? ఏం చేస్తే మరింత అందంగా కనిపిస్తుంటాము. ఇలాంటివాటికి ఈ స్పెషల్ చిట్కాలను ఫాలో అవ్వండి..

 1) షేప్‌వేర్ 

షేప్‌వేర్ సులభంగా మీ స్టైల్‌ని పూర్తిగా మార్చగలదు. మీరు చలికాలం లేదా వేసవిలో ఎప్పుడైనా మీ డ్రెస్ కింద ధరించండి.  మీ బెల్లి ఫ్యాట్‌ను కనిపించకుండా కవర్ చేస్తుంది.

2) పొడవైన జాకెట్టు 

మీరు మీ బెల్లి ఫ్యాట్ దాచుకోవాలనుకుంటే.. మీరు కవరేజ్ బ్లౌజ్, చోలీ స్టైల్ బ్లౌజ్‌ని ఎంచుకోండి. బ్లౌజ్ చాలా  ఆకర్షణీయంగా ఉంటుంది. అవి స్టైలిష్ లుక్ ఇవ్వడంతోపాటు మీ బెల్లి ఫ్యాట్ కనిపించకుండా చేస్తుంది. 

3) అధిక ఎంబ్రాయిడరీని తగ్గించండి

మీకు స్లిమ్ ఫిగర్ ఇష్టమైతే.. డ్రెస్‌లో పెద్ద పెద్ద పువ్వులు, అప్లైక్ డిజైన్‌లు, ఎంబ్రాయిడరీల కోసం వెళ్లవద్దు. అటువంటి పరిస్థితిలో మీరు ముదురు రంగు లెహంగాను సెలెక్ట్ చేసుకోండి. 

4) డబుల్ దుపట్టా

లేహంగాతోపాటు రెండు లేత రంగు దుపట్టాను ఎంచుకోండి. ఇది మీ మొత్తం రూపానికి భిన్నమైన స్టైలిష్‌లోకి మార్చేస్తుంది. బెల్లి ఫ్యాట్ దాచడంలో మీకు సహాయపడుతుంది. అయితే ఇక్కడ కూడా మీరు రెండింటిపై తక్కువ ఎంబ్రాయిడరీ ఉండాలా ప్లాన్ చేసుకోండి. ఇలా ట్రై చేస్తే మీరు బొద్దుగుమ్మగా కాకుండా ముద్దుగుమ్మగా మారిపోతారు. 

ఇవి కూడా చదవండి: India Pakistan, T20 World Cup LIVE Streaming: బిగ్‌ సండే.. బిగ్‌ ఫైట్‌.. మ్యాచ్ ఎక్కడ, ఎలా చూడాలో తెలుసా..

Ind Vs Pak: భారత్-పాకిస్తాన్ ఫైట్‌కు ముందు అభిమానుల గొడవ.. టీవీలు పగులుతాయ్.. అనడంతో రచ్చ..