Seema Chintakaya: రోగనిరోధక శక్తిని పెంచే సీమ చింతకాయ గర్భిణీలకు చేసే మేలు తెలిస్తే వదలురుగా..

Seema Chintakaya: సీమ చింత ,గుబ్బ కాయలు, పులిచింతకాయలు అనేక.. ఇది చూడడానికి చుట్టుకున్న జిలేబీలా చింతకయలా కనిపిస్తాయి. ఈ చెట్టు ఇంగ్లీషు...

Seema Chintakaya: రోగనిరోధక శక్తిని పెంచే సీమ చింతకాయ గర్భిణీలకు చేసే మేలు తెలిస్తే వదలురుగా..
Seema Chintakaya
Follow us

|

Updated on: Oct 24, 2021 | 12:34 PM

Seema Chintakaya: సీమ చింత ,గుబ్బ కాయలు, పులిచింతకాయలు అనేక.. ఇది చూడడానికి చుట్టుకున్న జిలేబీలా చింతకయలా కనిపిస్తాయి. ఈ చెట్టు ఇంగ్లీషు వారి నుండి భారత దేశంలోకి అడుగు పెట్టినట్లు భావిస్తున్నారు కనుకనే దీనికి సీమచింతగా పేరు వచ్చింది. ఈ సీమ చింత.. కాయగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా, గట్టిగా వగరు రుచితో ఉంటాయి. పక్వానికొస్తున్న కొద్దీ బంగారు రంగు, గులాబీ, ఊదా నుంచి ఎరుపు రంగును సంతరించుకుంటాయి. కాయలు పండుతున్నపుడు పైన తొక్క విడిపోతుంది. అందువలన లోపలి పండు తీసుకొని తినుటకు ఈజీ. లోపల ఒక్కొక్క కణుపులోనూ తెల్లటి పల్చటి గుజ్జు…ఒలిస్తే నల్లటి గింజలుంటాయి. కొద్దిగా వగరుగా, తియ్యగా ఉంటుంది గుజ్జు. ఈ చెట్టు అంతా ముళ్ళ మయం. ప్రధాన కాండం, కొమ్మలు అంతా ముళ్ళమయం. అందు చేత ఈచెట్టును ఎక్కడానికి వీలుకాదు. చిలుకు దోటి సహాయంతో వీటి కాయలను కోస్తుంటారు. పట్టణాల్లో ఉన్న వారి కంటే.. గ్రామాల్లోని వారికీ సీమ చింతను పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో విరివిగా పొలం గట్ల వెంబడి ఉంటాయి. నీటిశాతం ఎక్కువగా ఉండే సీమచింతలో ఔషధ విలువలు అధికం. క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్, నియాసిన్, విటమిన్ సిలు ఉండే సీమ చింతకాయలలో పోషకాలు మెండుగా ఉన్నాయి. వీటిని తింటే మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..!

*సీమ చింత గొంతు, చిగుళ్లు, నోటిపూత నివారణకు ఉపయోగపడుతుంది. *వీటి విత్తనాల నుంచి తీసిన నూనెను సబ్బుల తయారీలో వాడతారు. * క్షయవ్యాధి నివారణకు ఈ చెట్టు వేర్లు బాగా పనిచేస్తాయి. *సీమ చింతకాయల లో పీచు పదార్థాలు ఎక్కువగా కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. *సీమ చింతకాయలలో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరం అనేక రకాల వైరస్ బారిన పడకుండా రక్షిస్తుంది. *సీమ చింతలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వృద్ధాప్య ఛాయలను అరికడతాయి. *ఇక గర్భిణీ స్త్రీలకు సీమ చింత మంచి పోషకాలను ఇస్తుంది. నీరసం తగ్గిస్తుంది *ఈ కాయలలో ఉన్న క్యాల్షియం తల్లితో పాటు పుట్టబోయే బిడ్డ ఎముకలను కూడా ధృడంగా ఉంచుతాయి. * ఈ కాయల్లో ఉండే ఫైబర్ గర్భిణీ స్త్రీలలో మలబద్ధకాన్ని నివారిస్తుంది.

Also Read: టీమిండియా గెలుపు కోసం అభిమానులు ఏం చేస్తున్నారంటే..

ఆ దేశంలో హోంవర్క్ లేకుండా కొత్త విద్యా చట్టం.. పిల్లలు తప్పు చేస్తే శిక్ష తల్లిదండ్రులకు అంటున్న ప్రభుత్వం