Silver Price Today: బంగారం బాటలోనే పరుగులు పెడుతున్న వెండి… ప్రధాన నగరాల్లో సిల్వర్ ధరలు ఇలా ఉన్నాయి
Silver Rate Today: వెండి ధరలు కూడా బంగారం రూట్లోనే వెళ్తున్నాయి. బంగారం పరుగులు పెడుతుంటే నేనెందుకు పరుగులు పెట్టకూడదన్నట్లు.. వెండి కూడా రోజురోజుకు పెరుగుతోంది....
Silver Rate Today: వెండి ధరలు కూడా బంగారం రూట్లోనే వెళ్తున్నాయి. బంగారం పరుగులు పెడుతుంటే నేనెందుకు పరుగులు పెట్టకూడదన్నట్లు.. వెండి కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఏప్రిల్ 1 నుంచి పెరుగుతున్న వెండి.. మధ్య మధ్యలో కాస్త తగ్గుముఖం పట్టినట్లు అనిపించినా.. ఓవరల్‌గా చూస్తే.. తగ్గుదలకంటే పెరుగుదలనే ఎక్కువగా ఉంది. గత 17 రోజుల్లో వెండి ధర కిలోపై రూ 6 వేలకుపైగా పెరిగింది. నిన్న కూడా కిలో వెండిపై రూ.1,500 వరకు పెరిగింది. గత 6 నెలలతో పోల్చితే… వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఆరు నెలల కిందట కిలో వెండి ధర రూ. 62 వేల వరకు ఉండగా, ఇప్పుడు రూ.73వేల వరకు ఎగబాకింది. ఇక తాజాగా ఆదివారం కూడా వెండి ధర పెరిగింది. కాకపోతే నిన్న పెరిగినంతగా కాకుండా కొంత తక్కువగా పెరిగింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.68,600 ఉండగా, ముంబైలో 68,600 ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.73,700 ఉండగా, విజయవాడలో రూ.73,700 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.73,700 ఉండగా, కోల్‌కతాలో రూ.68,600 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ.68,600 ఉండగా, కేరళలో రూ.68,600 ఉంది. విశాఖలో కిలో వెండి ధర రూ.73,700 వద్ద కొనసాగుతోంది.
కాగా, తాజాగా బంగారం ధరలు పెరిగినట్లే వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలలో బంగారం, వెండి ధరల్లో తేడా ఏమి ఉండటం లేదు. ప్రతి రోజు ధరలు పెరుగుతూ ఇతర రాష్ట్రాల ధరల్లో తేడా ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో ఒకేలా ఉంటున్నాయి.
ఇవీ కూడా చదవండి:
Fixed Deposit: బ్యాంకులు ఎఫ్‌డీలపై విధించే టీడీఎస్‌ను తగ్గించుకోవాలంటే ఏం చేయాలి…?
Credit Card Payment: క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారా..? అయితే ఇలా చేయండి
Gold Price Today: పరుగులు పెడుతున్న బంగారం ధర… ఇదే ట్రెండ్ కొనసాగవచ్చంటున్న విశ్లేషకులు