ఐదురోజుల నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ట్రేడ్ అవుతున్న షేర్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల బాటపట్టాయి. గత ఐదురోజులుగా నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 9:19 సమయానికి సెన్సెక్స్‌ 147 పాయింట్లు పెరిగి 37,993 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ 37 పాయింట్లు పెరిగి 11,307 వద్ద కొనసాగుతోంది. 353 కంపెనీల షేర్లు నష్టాల్లో ఉండగా, 42 కంపెనీల షేర్లు లాభాలతో మొదలయ్యాయి. భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, సెయిల్‌, జీ ఎంటర్‌టైన్మెంట్‌, కాడిలా హెల్త్‌కేర్‌, సాగర్‌ సిమెంట్‌, , కాన్సాయ్‌ నెరోలాక్‌, బర్గర్‌ పెయింట్స్‌ […]

ఐదురోజుల నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ట్రేడ్ అవుతున్న షేర్స్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 25, 2019 | 10:41 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల బాటపట్టాయి. గత ఐదురోజులుగా నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 9:19 సమయానికి సెన్సెక్స్‌ 147 పాయింట్లు పెరిగి 37,993 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ 37 పాయింట్లు పెరిగి 11,307 వద్ద కొనసాగుతోంది. 353 కంపెనీల షేర్లు నష్టాల్లో ఉండగా, 42 కంపెనీల షేర్లు లాభాలతో మొదలయ్యాయి.

భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, సెయిల్‌, జీ ఎంటర్‌టైన్మెంట్‌, కాడిలా హెల్త్‌కేర్‌, సాగర్‌ సిమెంట్‌, , కాన్సాయ్‌ నెరోలాక్‌, బర్గర్‌ పెయింట్స్‌ చోలమాండలమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఏసియన్‌ పెయింట్స్‌, సిండికేట్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, సింజీన్‌, బయోకాన్‌, ఒబేరియో రియాల్టీ నష్టాల్లో ఉన్నాయి.