బీఎండబ్ల్యూ కొత్త కారు.. ధర చుక్కల్లో..!
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ తాజాగా తన ఎక్స్ 7 మోడల్ ను భారత విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ. 98.9 లక్షలుగా నిర్ణయించారు. ఇదే సమయంలో సెడాన్ 7 సిరీస్‌లో కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభించనున్న ఈ మోడల్ ధరల శ్రేణి రూ.1.22 నుంచి రూ. 1.34 కోట్లుగా ఉంది. సెడాన్ 7 సిరీస్‌లోనే ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వేరియంట్‌ను సైతం కంపెనీ విడుదల చేసింది. […]
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ తాజాగా తన ఎక్స్ 7 మోడల్ ను భారత విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ. 98.9 లక్షలుగా నిర్ణయించారు. ఇదే సమయంలో సెడాన్ 7 సిరీస్‌లో కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభించనున్న ఈ మోడల్ ధరల శ్రేణి రూ.1.22 నుంచి రూ. 1.34 కోట్లుగా ఉంది. సెడాన్ 7 సిరీస్‌లోనే ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వేరియంట్‌ను సైతం కంపెనీ విడుదల చేసింది. పెట్రోల్ వెర్షన్ ధర రూ.1.65 కోట్లుగా, డీజిల్ వేరియంట్ ధర రూ.2.42 కోట్లుగా ఉన్నాయి. ఎక్స్7 డీజిల్ వేరియంట్‌ను చెన్నై ప్లాంట్ నుంచి ఉత్పత్తి చేస్తున్నామని, పెట్రోల్ వెర్షన్‌ను పూర్తిగా దిగుమతి చేసుకుంటున్నట్లు బీఎండబ్ల్యూ ఇండియా వెల్లడించింది. వచ్చే కొన్ని సంవత్సరాల్లో దాదాపు 5 కార్లు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు హాన్స్ క్రిస్టియన్ బార్డెల్స్ తెలిపారు. విద్యుత్ వాహనాలతో పాటు కొత్త కార్లను విడుదల చేయడానికి ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటామని ఆయన చెప్పారు. ఎక్స్7 పెట్రోల్ వేరియంట్ 340 హార్స్‌పవర్ శక్తిని అందిస్తుంది. గంటకు 0-100 కి.మీ వేగాన్ని 6.1 సెకన్లలోనే అందుకోగలదు. డీజిల్ వెర్షన్ 265 హార్స్‌పవర్‌ను, గంటకు 0-100 కి.మీ వేగాన్ని 7 సెకన్లలో అందుకోగలదు.