AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: సైబర్ ముఠాలతో చేతులు కలిపిన బ్యాంకర్లు.. హైదరాబాద్‌లో ఏడుగురు బ్యాంక్ అధికారుల అరెస్ట్.. పోలీసుల భారీ యాక్షన్!

Banking Fraud: ఈ రోజుల్లో సైబర్‌ మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అయితే బ్యాంకు అధికారులే సైబర్‌ నేరగాళ్లతో చేతులు కలిపిన ఉదాంతం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. హైదరాబాద్‌లో ఏడుగురు బ్యాంకు అధికారులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. పూర్తి వివరాలు ఇలా..

Hyderabad: సైబర్ ముఠాలతో చేతులు కలిపిన బ్యాంకర్లు.. హైదరాబాద్‌లో ఏడుగురు బ్యాంక్ అధికారుల అరెస్ట్.. పోలీసుల భారీ యాక్షన్!
Banking Fraud
Subhash Goud
|

Updated on: May 01, 2026 | 12:16 PM

Share

Banking Fraud: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోకుండా సామాన్యులను కాపాడాల్సిన బ్యాంక్ అధికారులే వారితో చేతులు కలిపి మోసాలకు పాల్పడుతున్న ఉదంతం హైదరాబాద్‌లో కలకలం రేపింది. సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ఏడుగురు బ్యాంక్ అధికారులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం (ఏప్రిల్ 30) విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పోలీసులు ఈ వివరాలను వెల్లడించారు.

అసలు ఏం జరిగింది?

నిందితులుగా తేలిన ఈ బ్యాంక్ అధికారులు కేవైసీ (KYC) నిబంధనలను బేఖాతరు చేస్తూ, ఎటువంటి భౌతిక తనిఖీలు లేకుండానే సైబర్ నేరగాళ్ల పేరిట బ్యాంకు ఖాతాలను తెరిచారు. ఐదు వేర్వేరు కేసుల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నా, అధికారులకు సమాచారం ఇవ్వకుండా నేరగాళ్లకు పరోక్షంగా, ప్రత్యక్షంగా మద్దతు పలికారు.

అరెస్టయిన అధికారులు వీరే:

  • ఇండియన్ బ్యాంక్ (కూకట్‌పల్లి): అసిస్టెంట్ మేనేజర్ అనుష, బ్రాంచ్ మేనేజర్ మూడవత్ దినేష్ చౌహాన్.
  • ఇండస్ ఇండ్ బ్యాంక్ (జెఎన్‌టియూ బ్రాంచ్): ఫీల్డ్ ఆఫీసర్ రెడ్డి హరీష్, సేల్స్ మేనేజర్ ఎన్. రవి.
  • బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (ప్రగతి నగర్): మాజీ మేనేజర్ నదీష్ సాంబార్.
  • బంధన్ బ్యాంక్: మాజీ ఫీల్డ్ ఆఫీసర్ రేణికుంట మహేష్.

పోలీసుల విచారణలో తేలిన విషయాలు:

నేరగాళ్లు దోచుకున్న సొమ్మును దాచుకోవడానికి, ఇతర ఖాతాలకు మళ్లించడానికి ఈ బ్యాంక్ అధికారులు విచ్చలవిడిగా ఖాతాలను సృష్టించారు. తమ అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు. ఈ ముఠాల కారణంగా ఎంతో మంది అమాయకులు తమ కష్టార్జితాన్ని కోల్పోయారు. నిబంధనల ప్రకారం అనుమానాస్పద లావాదేవీలను నివేదించాల్సిన బాధ్యతను వీరు పూర్తిగా విస్మరించారు.

ఇవి కూడా చదవండి

జాగ్రత్త:

బ్యాంక్ ఖాతాల విషయంలో, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఏదైనా అనుమానాస్పద కాల్స్ లేదా లింక్స్ వస్తే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.

ఇది కూడా చదవండి: New Rules: ఎల్‌పిజి డెలివరీ నుండి ఆన్‌లైన్ గేమింగ్ వరకు.. మే 1 నుంచి మారిన కొత్త నిబంధనలు ఇవే..!

ఇది కూడా చదవండి: Gold Price Today: మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us