Sensex Hit: త్వరలోనే లక్ష మైలురాయిను చేరుకోనున్న సెన్సెక్స్.. నిపుణుల అంచనాలు ఏంటంటే..?
భారతదేశంలో ఇటీవల కాలంలో సెన్సెక్స్ పెరుగుదల అనేది పెట్టుబడిదారులకు కొత్త ఆశలను రేకెత్తిస్తుంది. ఏడు నెలల కంటే తక్కువ వ్యవధిలో బీఎస్ఈ సెన్సెక్స్ 70,000 నుంచి 80,000 వరకు దూసుకెళ్లింది. భారతదేశ హెడ్‌లైన్ ఈక్విటీ ఇండెక్స్‌కు సంబంధించిన 16 శాతం చారిత్రక సీఏజీఆర్ రికార్డును పరిశీలిస్తే సెన్సెక్స్ డిసెంబర్ 2025 నాటికి 1 లక్ష మైలురాయిని చేరుకోగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 1979లో సెన్సెక్స్ బేస్ విలువ 100 వద్ద ఉండేది క్రమేపి 45 సంవత్సరాలలో 800 రెట్లు పెరిగింది.
భారతదేశంలో ఇటీవల కాలంలో సెన్సెక్స్ పెరుగుదల అనేది పెట్టుబడిదారులకు కొత్త ఆశలను రేకెత్తిస్తుంది. ఏడు నెలల కంటే తక్కువ వ్యవధిలో బీఎస్ఈ సెన్సెక్స్ 70,000 నుంచి 80,000 వరకు దూసుకెళ్లింది. భారతదేశ హెడ్‌లైన్ ఈక్విటీ ఇండెక్స్‌కు సంబంధించిన 16 శాతం చారిత్రక సీఏజీఆర్ రికార్డును పరిశీలిస్తే సెన్సెక్స్ డిసెంబర్ 2025 నాటికి 1 లక్ష మైలురాయిని చేరుకోగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 1979లో సెన్సెక్స్ బేస్ విలువ 100 వద్ద ఉండేది క్రమేపి 45 సంవత్సరాలలో 800 రెట్లు పెరిగింది. సెన్సెక్స్ ఏడాదికి అదే వేగంతో 15.9 శాతం వృద్ధిని కొనసాగిస్తే వచ్చే ఏడాది డిసెంబరు నాటికి లక్ష మైలురాయిని దాటవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ విషయంలో నిపుణుల అంచనాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
సెన్సెక్స్ కేవలం 20 ట్రేడింగ్ సెషన్లలో 10 శాతం పెరిగింది. సెన్సెక్స్ చరిత్రలో ఇది అత్యంత వేగవంతమైన వృద్ధిగా నిపుణులు పేర్కొంటున్నారు. స్థూల ఆర్థిక మూలాధారాలు, యూఎస్ ఫెడ్ రేట్ల తగ్గింపుల అంచనాలు, వృద్ధికి అనుకూలమైన ప్రభుత్వ విధానాల ఆధారంగా పెరుగుదల ఆధారపడి ఉంది. ప్రస్తుతం 70,000 నుంచి 80,000కి ఎగబాకింది. ఏడు నెలల కంటే తక్కువ సమయంలో లేదా 139 సెషన్లలో అత్యంత వేగవంతమైన 10,00 పాయింట్లు లాభపడింది. ప్రస్తుతం సెన్సెక్స్ దాదాపు 11.06 శాతం కంటే ఎక్కువ లాభాల్లో ఉంది.
లక్ష మార్కును చేరుకునేదెప్పుడు..?
సెన్సెక్స్‌కు సంబంధించిన చారిత్రక సమ్మేళనం వార్షిక వృద్ధి రేటు దాదాపు 14-16 శాతంగా ఉంది. సెన్సెక్స్ 1.5 నుంచి 2 సంవత్సరాల కాల వ్యవధిలో 100,000 మార్క్‌ను చేరుకోవచ్చు. అయితే, 2024 లీప్ ఇయర్ అని పరిగణించాలని నిపుణులు చెబుతున్నారు. చారిత్రాత్మకంగా లీప్ ఇయర్‌లు తరచుగా మార్కెట్ కరెక్షన్‌లతో సమానంగా ఉంటాయి. ఈ సంవత్సరం ఎన్నికల ఫలితాల కారణంగా భారతీయ మార్కెట్ ఇప్పటికే భారీ అస్థిరతను ఎదుర్కొంది. అదనంగా రాబోయే బడ్జెట్ ప్రకటన వల్ల అస్థిరత పెరిగే అవకాశం ఉంది. ఇది 2024 బడ్జెట్‌కు ముందు హెచ్చుతగ్గులకు లేదా చిన్న దిద్దుబాటుకు దారితీయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..