Business Idea: మార్కెట్లో ఇప్పుడు ఇదే ట్రెండ్‌.. ఈ బిజినెస్‌తో లాభాలే, లాభాలు..

అయితే ఇప్పటికీ చాలా మంది వ్యాపారం అనగానే నష్టాలు వస్తాయన్న భావనలో ఉంటారు. కానీ ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్‌ ఉన్న బిజినెస్‌ను ప్రారంభిస్తే నష్టాలు ఉండవు. అలాంటి ఓ మంచి బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ కామర్స్‌ వ్యాపారం ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న చిన్న గ్రామాలకు...

Business Idea: మార్కెట్లో ఇప్పుడు ఇదే ట్రెండ్‌.. ఈ బిజినెస్‌తో లాభాలే, లాభాలు..
Business Idea
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 06, 2024 | 6:20 PM

యువత ఆలోచనలో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ఉద్యోగం చేసి ఆ తర్వాత వ్యాపారం చేద్దామనే ఆలోచనలో ఉండేవారు. కానీ ప్రస్తుతం చదువు పూర్తికాగానే వ్యాపారం చేసే వారి సంఖ్య పెరుగుతోంది. వినూత్న ఆలోచనలతో కొంగొత్త వ్యాపారాలను చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు.

అయితే ఇప్పటికీ చాలా మంది వ్యాపారం అనగానే నష్టాలు వస్తాయన్న భావనలో ఉంటారు. కానీ ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్‌ ఉన్న బిజినెస్‌ను ప్రారంభిస్తే నష్టాలు ఉండవు. అలాంటి ఓ మంచి బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ కామర్స్‌ వ్యాపారం ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న చిన్న గ్రామాలకు కూడా ఈ కామర్స్‌ సేవలు విస్తరిస్తున్నాయి. ఇలాంటి సమయంలో డెలివరీ ఫ్రాంచైజ్‌ బిజినెస్‌ను ప్రారంభించడం ద్వారా మంచి ఆదాయం పొందొచ్చు. ఈ వ్యాపారం ప్రారంభించేందుకు పెద్దగా పెట్టుబడి కూడా అవసరం ఉండదు.

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా వంటి ఫ్రాంచైజీలను తీసుకోవచ్చు. ఇందుకోసం మీకు కొంత స్థలం ఉండాలి. మీరు ఫ్రాంచైజీ ఏర్పాటు చేయలనుకుంటున్న ఏరియాలో అదే కంపెనీకి చెందిన ఫ్రాంచైజీ ఉండకుండా చూడాలి. ఇక కంపెనీకి రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు సెక్యూరిటీ డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఫ్రాంచైజీ కోసం సదరు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలి. 400 నుంచి 700 గజాల స్థలం ఉండాలి. అలాగే ప్రొడక్ట్స్‌ను సరఫరా చేయడానికి బైక్స్‌తో పాటు ఆటోలు ఉండాలి. కనీసం నలుగురు వర్కర్స్‌ ఉండాలి. ఇక ఇందులో ఏం చేయాల్సి ఉంటుందందే. మీ చుట్టు పక్కల ఏరియాల్లో ఎవరైనా ఆన్‌లైన్‌లో ప్రొడక్ట్స్‌ బుక్‌ చేసుకుంటే మొదట మీ వద్దకు ప్రొడక్ట్స్‌ అన్ని వస్తాయి. వాటిని కస్టమర్లకు వీలైనంత త్వరగా సరఫరా చేయడమే మీ పని. మీకు ఒక్కో ప్రాడక్ట్‌పై కనీసం 35 శాతం కమిషన్‌ ఇస్తుంది. ఆర్డర్స్‌ పెరిగితే కమిషన్‌ పెంచుతుంటారు.

లాభాల విషయానికొస్తే ఇందుకోసం ముందుగా రూ. లక్ష డిపాజిట్ చేయొచ్చు. ఇది రిఫండబుల్‌. అలాగే జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. గోడౌన్‌కు సంబంధించి రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ కామర్స్‌ మార్కెట్ డిమాండ్‌ ప్రకారం తక్కువలో తక్కువ నెలకు రూ. లక్ష వరకు ఆదాయం పొందొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు