Multibagger Stock: పదేళ్లలో పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని అందించిన కంపెనీ ఏదో తెలుసా?

గత 10 సంవత్సరాలలో పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని అందించిన కంపెనీలలో అస్టెక్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్ ఒకటి. ఈ కాలంలో కంపెనీ షేర్లు 2590 శాతం పెరిగాయి. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఇన్వెస్టర్లకు బలమైన రాబడులు ఒక ఇన్వెస్టర్ 10 సంవత్సరాల క్రితం ఈ స్టాక్‌ను కొనుగోలు చేసి ఉంటే, అతని రాబడి ఇప్పుడు రూ. 2.5 లక్షలకు పెరిగి ఉండేది. ఇన్వెస్టర్ల దృక్కోణంలో మంచి విషయం ఏమిటంటే, ఈ సంవత్సరం కూడా కంపెనీ […]

Multibagger Stock: పదేళ్లలో పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని అందించిన కంపెనీ ఏదో తెలుసా?
Multibagger Stock
Follow us
Subhash Goud

|

Updated on: Jul 06, 2024 | 6:12 PM

గత 10 సంవత్సరాలలో పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని అందించిన కంపెనీలలో అస్టెక్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్ ఒకటి. ఈ కాలంలో కంపెనీ షేర్లు 2590 శాతం పెరిగాయి. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ గురించి వివరంగా తెలుసుకుందాం.

ఇన్వెస్టర్లకు బలమైన రాబడులు

ఒక ఇన్వెస్టర్ 10 సంవత్సరాల క్రితం ఈ స్టాక్‌ను కొనుగోలు చేసి ఉంటే, అతని రాబడి ఇప్పుడు రూ. 2.5 లక్షలకు పెరిగి ఉండేది. ఇన్వెస్టర్ల దృక్కోణంలో మంచి విషయం ఏమిటంటే, ఈ సంవత్సరం కూడా కంపెనీ షేర్లు పెరిగాయి. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ 2024లో 35 శాతం రాబడిని ఇచ్చింది. అదే సమయంలో గత 6 నెలల్లో కంపెనీ షేర్లు 2.5 శాతం పెరిగాయి.

ప్రస్తుతం ఎంత వాటా విక్రయిస్తున్నారు?

కంపెనీలో ప్రమోటర్ల మొత్తం వాటా 66.75 శాతం. అదే సమయంలో, ఈ కంపెనీలో ప్రజలకు 33.25 శాతం వాటా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడినట్లయితే, వాటా 7 శాతం. అయితే, కంపెనీలో విదేశీ పెట్టుబడిదారులకు చెప్పుకోదగ్గ వాటా లేదు. శుక్రవారం కంపెనీ షేర్లు 0.52 శాతం పెరుగుదలతో రూ.1458.45 వద్ద ముగిశాయి.

గత ఏడాది స్టాక్ మార్కెట్లలో కంపెనీ పనితీరు గురించి చెప్పాలంటే, ఈ కాలంలో స్టాక్ ధర కేవలం 6.7 శాతం మాత్రమే పెరిగింది. అంటే కేవలం ఒక సంవత్సరం పాటు ఈ స్టాక్‌ను కలిగి ఉన్న ఇన్వెస్టర్లు పెద్దగా లాభం పొందలేదు.

2010 నుంచి కంపెనీ డివిడెండ్‌లను చెల్లిస్తోంది:

కంపెనీ 2010 నుంచి ఇన్వెస్టర్లకు డివిడెండ్ చెల్లిస్తోంది. బీఎస్‌ఈ డేటా ప్రకారం, ఆగష్టు 12, 2010న, కంపెనీ ఒక షేరుపై 1 రూపాయల డివిడెండ్ ఇచ్చింది. అప్పటి నుండి, పెట్టుబడిదారులు ప్రతి సంవత్సరం డివిడెండ్ ప్రయోజనాన్ని నిరంతరం పొందుతున్నారు. Astec Lifesciences Ltd చివరిగా జూలై 21, 2003న డివిడెండ్ చెల్లించింది. ఈసారి కంపెనీ ఇంకా డివిడెండ్ ఇవ్వలేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ బస్సులు..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ బస్సులు..
డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?