Stock Markets: కుప్పకూలిన మండే మార్కెట్లు.. రూ. 20 లక్షల కోట్లు ఆవిరి.. కోలకునేది ఎప్పుడంటే..
మండే మార్కెట్లు మంట పట్టించాయి. స్టాక్ మార్కెట్ భారీ పతనంతో ఇన్వెస్టర్లకు రక్త కన్నీరే మిగిల్చింది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. గతకొన్ని రోజులుగా నష్టాలు..
Sensex Crashes: మండే మార్కెట్లు మంట పట్టించాయి. స్టాక్ మార్కెట్(Stock Markets) భారీ పతనంతో ఇన్వెస్టర్లకు రక్త కన్నీరే మిగిల్చింది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. గతకొన్ని రోజులుగా నష్టాలు చవిచూస్తున్న ఇన్వెస్టర్లపై ఏమాత్రం కనికరం లేకుండా వారి సంపదను దోచుకుంది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ మొదలు పెట్టడంతో స్టాక్ మార్కెట్లలో కోట్ల రూపాయలు ఆవిరయ్యాయి. స్టాక్ మార్కెట్లు బ్లాక్ మండేగా మిగిలపోనుంది. సెన్సెక్స్(Sensex), నిఫ్టీ(nifty) ఘోరంగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 3,900 పాయింట్లు, నిఫ్టీ 1,200 పాయింట్లు నష్టపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ(BSE)లో నమోదిత కంపెనీల విలువ ఆరు రోజుల్లో దాదాపు రూ.20 లక్షల కోట్లకు పైగా కనిపించకుండా మాయం అయ్యింది.
ఈరోజు సెన్సెక్స్ 1545 పాయింట్ల పతనంతో 57,491 వద్ద , నిఫ్టీ 468 పాయింట్ల పతనంతో 17149 వద్ద క్లోజయ్యాయి. సెన్సెక్స్ టాప్-30లో ఉన్న అన్ని స్టాక్‌లు రెడ్ మార్క్‌లో ముగిశాయి. US ఫెడరల్ రిజర్వ్ ముఖ్యమైన సమావేశం మంగళవారం నుండి ప్రారంభమవుతుంది. ఇది బుధవారంతో ముగుస్తుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం మార్కెట్‌కు సెలవు ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు అమ్మకాల ఒత్తిడిని పెంచారు. ఈరోజు టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ , విప్రో, టెక్ మహీంద్రా టాప్ లూజర్లుగా ఉన్నాయి. ఈ స్టాక్స్ 5-6 శాతం పతనాన్ని నమోదు చేశాయి.
ఈ వారంలో మొదటి రోజైనా మార్కెట్ వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్‌లో క్షీణతను నమోదు చేసింది. ఈ ఐదు సెషన్లలో సెన్సెక్స్ 3817 పాయింట్ల పతనాన్ని నమోదు చేసింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.260.49 లక్షల కోట్లకు క్షీణించింది. ఈ ఐదు సెషన్లలో దాదాపు 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిదారులు మునిగిపోయారు. ఇవాళ్టి ఈ పతనం కారణంగా ఇన్వెస్టర్లు రూ.9.16 లక్షల కోట్లు నష్టపోయారు.
ఇవి కూడా చదవండి: Viral Video: నువ్వు తగ్గొద్దన్న.. పాకిస్తాన్ జర్నలిస్ట్ మళ్లీ ఏసేశాడు.. నవ్వులు పూయిస్తున్న వీడియో..
Medicinal Plants: ఔషద మొక్కల పెంపకంతో అద్భుతాలు.. ఎలాంటివి ఎంచుకోవాలో తెలుసా..