Vande Bharat: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ వందే భారత్ రైలుకు అదనపు బోగీలు
Vande Bharat Train: భారత రైల్వే తన తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ అప్‌డేట్ వచ్చింది. ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి ప్రస్తుతం చిన్నపాటి మరమ్మతులు జరుగుతున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల వెల్లడించారు..

Vande Bharat Train:పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా బుధవారం నుండి సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలులో సీట్లు మరింతగా పెరిగాయి. ఈ మార్గంలో నడిచే ఈ వందేభారత్‌కు మరిన్ని కోచ్‌లను జోడించింది రైల్వే. ఈ రైలుకు నాలుగు అదనపు కోచ్‌లను పెంచనున్నారు. ఈ అదనపు బోగీలు శాశ్వతంగా ఉండనున్నాయని రైల్వే తెలిపింది. అయితే ఈ కోచ్‌లను పెంచితే మొత్తం సంఖ్య 16 నుండి 20కి పెరుగుతుంది.
సికింద్రాబాద్ నుండి తిరుపతి వెళ్లే రైలు నంబర్ 20701, తిరుపతి నుండి సికింద్రాబాద్ వెళ్లే రైలు నంబర్ 20702 నవంబర్ 26 నుండి నాలుగు అదనపు ఎయిర్ కండిషన్డ్ చైర్ కార్ కోచ్‌లను పెంచినట్లు తెలిపింది. ఈ రైళ్లలో ఇప్పుడు రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లు, 18 చైర్ కార్ బోగీలు ఉంటాయి. దీనితో సీట్ల సంఖ్య 300 కంటే ఎక్కువ పెరుగుతుంది. సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను శాశ్వతంగా అదనపు కోచ్‌లతో పెంచామని దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని విజయవాడ డివిజన్ అధికారిక ప్రకటనలో తెలిపింది.
ఇది కూడా చదవండి: Gold Price Today: మళ్లి రికార్డ్ స్థాయిలోనే.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇవే!
ఈ రైలు ప్రస్తుతం వారానికి ఆరు రోజులు నడుస్తుంది. మంగళవారం వారపు విరామం ఉంటుంది. సికింద్రాబాద్ నుండి తిరుపతికి ప్రయాణం ఎనిమిది గంటల కంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది.ఉదయం 6:00 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం ఆలస్యంగా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు తిరుపతి నుండి 15:15 గంటలకు బయలుదేరి అదే రోజు 23:40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఇది కూడా చదవండి: UIDAI: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆధార్ కోసం పాన్ చెల్లదు!
వచ్చే నెల నుండి వందే భారత్ స్లీపర్ రైళ్లు?
భారత రైల్వే తన తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ అప్‌డేట్ వచ్చింది. ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి ప్రస్తుతం చిన్నపాటి మరమ్మతులు జరుగుతున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల వెల్లడించారు. ఇది వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. రైళ్లలో ఏదైనా సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ రైళ్లలో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు అందించే విధంగా రూపొందించినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: 2026 Holidays List: ఉద్యోగులు, విద్యార్థుల గుడ్‌న్యూస్.. వచ్చే ఏడాది భారీగా సెలవులు.. జాబితా విడుదల
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








