SBI కస్టమర్లకు అలర్ట్.. నేడు, రేపు ఆ సర్వీసులు బంద్.. హెచ్చరిస్తున్న బ్యాంక్..
దేశీయ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు దేశవ్యాప్తంగా వినియోగదారుల సంఖ్య అధికమే. అలాగే బ్యాంకు నియమ నిబంధనలకు సంబంధించిన విషయాలను
దేశీయ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు దేశవ్యాప్తంగా వినియోగదారుల సంఖ్య అధికమే. అలాగే బ్యాంకు నియమ నిబంధనలకు సంబంధించిన విషయాలను ఎస్బీఐ ఎప్పటికప్పుడూ తమ కస్టమర్లకు సోషల్ మీడియా ద్వారా తెలియజెస్తున్న సంగతి తెలిసిందే. అందుకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుపై వినియోగదారులలో విశ్వాసం అధికమే. అయితే ఈ బ్యాంక్ ఆన్లైన్ సేవలు కొన్ని గంటల పాటు అందుబాటులో ఉండవు. ఈ విషయాన్ని ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా వినియోగదారులకు వెల్లడించింది. మెయింటెనెన్స్ కారణంగా సర్వీసులకు అంతరాయం కలుగనుందని ఎస్బీఐ తెలిపింది.
ట్వీట్..
We request our esteemed customers to bear with us as we strive to provide a better Banking experience.#InternetBanking #YONOSBI #YONO #ImportantNotice pic.twitter.com/L7FrRhvrpz
— State Bank of India (@TheOfficialSBI) July 9, 2021
కస్టమర్ల అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. ఈరోజు (జూలై 10న) 22.45 గంటల నుంచి జూలై 11న 00.15 గంటల వరకు ఎస్బీఐ ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉండవు. అంటే ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ సేవలు పనిచేయవు. అలాగే ఎస్బీఐ తమ కస్టమర్లను మరో విషయంలో అలర్ట్ చేసింది. కస్టమర్లు ఆన్లైన్ అకౌంట్ల పాస్వర్డ్లను తరచూ మార్చుకుంటూ ఉండాలని సూచించింది. అప్పుడే మోసాల బారిన పడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని… ఈ విషయాన్ని కస్టమర్లు ఎప్పుడూ గుర్తుంచుకోవాలని సూచించింది.
ట్వీట్..
Frequent change of password for your online accounts acts like a vaccine for viruses. Stay safe against frauds & cyber crimes with an alert mind & appropriate precautions.
Know more: https://t.co/7wBxq78x9Q#SBIAapkeSaath #StayStrongIndia #LargestVaccineDrive #Unite2FightCorona pic.twitter.com/M25loXHPhB
— State Bank of India (@TheOfficialSBI) July 9, 2021