Banking Services: SBI ఖాతాదారులకు గుడ్ న్యూస్.. సులభంగా బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా..
సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుండటంతో.. పలు సేవలు పొందడం చాలా ఈజీ అయిపోతుంది. దీనికి బ్యాకింగ్ రంగం కూడా అతీతం కాదు. గతంలో బ్యాంకింగ్ సేవలకు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. మారుతున్న కాలం, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని..
Banking Services: సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుండటంతో.. పలు సేవలు పొందడం చాలా ఈజీ అయిపోతుంది. దీనికి బ్యాకింగ్ రంగం కూడా అతీతం కాదు. గతంలో బ్యాంకింగ్ సేవలకు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. మారుతున్న కాలం, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ బ్యాంకింగ్ రంగం తన సేవలను సులభం చేస్తోంది. ఇప్పటికే చాలా బ్యాంకులు వాట్సప్ సేవలను ప్రవేశపెట్టగా.. తాజాగా దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కోసం వాట్సప్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది. ఈ SBI వాట్సాప్ బ్యాంకింగ్ సేవల ద్వారా మినీ స్టేట్‌మెంట్, బ్యాలెన్స్‌ను ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ మినీ స్టేట్‌మెంట్‌లో కస్టమర్ చివరి ఐదు లావాదేవీల వివరాలను SBI అందిస్తుంది. కొత్తగా ప్రారంభించిన వాట్సాప్ బ్యాంకింగ్ సేవల గురించి ట్విటర్ ద్వారా ఖాతాదారులకు తెలియజేసింది ఎస్‌బీఐ. మీ బ్యాంక్ ఇప్పుడు వాట్సాప్‌లో ఉంది. మీ ఖాతా బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్ తెలుసుకోండి శీర్షికతో ఈ పోస్టు చేసింది.
SBI వాట్సప్ బ్యాంకింగ్ సేవలు పొందడం ఎలా: SBI వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను పొందడానికి ముందుగా ఖాతాదారులు తన ఖాతా వివరాలను నమోదు చేసుకోవాలి. దీని కోసం SMS ద్వారా కస్టమర్ తన అంగీకారాన్ని తెలయజేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు రిజిస్టర్ కాని వారు సేవలు పొందేందుకు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని బ్యాంకు నుంచి మెసేజ్ వస్తుంది. SBI ఖాతాదారులు బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి WAREG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి A/c నెంబర్ ను 72089333148కి SMS పంపించాలి. ఈ సేవలకు సంబంధించిన షరతులను Bank.sbiలో వీక్షించవచ్చు. వాట్సప్ బ్యాంకింగ్ సేవల కోసం రిజిస్టర్ చేసుకున్న తర్వాత.. 9022690226 నెంబర్ కు వాట్సప్ లో హాయ్ అని పంపాలి. లేదా SBI నుంచి WhatsApp ద్వారా వచ్చిన సందేశానికి రీప్లై ఇవ్వవచ్చు. మీ నుంచి మెసెజ్ వెళ్లిన తర్వాత ప్రియమైన కస్టమర్ SBI Whatsapp బ్యాంకింగ్ సేవలకు స్వాగతం.. దయచేసి దిగువన ఉన్న ఏవైనా ఎంపికల నుండి ఎంచుకోండి అని రిప్లే వస్తుంది. అందులో 1. ఖాతా బ్యాలెన్స్, 2. మినీ స్టేట్‌మెంట్, 3. WhatsApp బ్యాంకింగ్ నుండి డి-రిజిస్టర్ చేసుకోండి అనే ఆప్షన్లు డిస్ ప్లే అవుతాయి. మనకి కావలసిన సర్వీస్ ఆప్షన్ పై క్లిక్ చేసి అవసరమైన సేవలను పొందవచ్చు.
Your bank is now on WhatsApp. Get to know your Account Balance and view Mini Statement on the go.#WhatsAppBanking #SBI #WhatsApp #AmritMahotsav #BhimSBIPay pic.twitter.com/taKZQ6FCFN
— State Bank of India (@TheOfficialSBI) August 25, 2022
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..