AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI Penalty: తెలుగు రాష్ట్రాల బ్యాంకులతో సహా ఈ 8 బ్యాంకులపై ఆర్‌బీఐ భారీ జరిమానా.. కారణం ఏంటో తెలిపిన ఆర్బీఐ

RBI Penalty: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సోమవారం ఏకకాలంలో 8 సహకార బ్యాంకులపై జరిమానా విధించింది. నిబంధనలు పాటించని బ్యాంకులపై ఈ జరిమానా విధిస్తూ..

RBI Penalty: తెలుగు రాష్ట్రాల బ్యాంకులతో సహా ఈ 8 బ్యాంకులపై ఆర్‌బీఐ భారీ జరిమానా.. కారణం ఏంటో తెలిపిన ఆర్బీఐ
Rbi
Subhash Goud
|

Updated on: Aug 30, 2022 | 10:48 AM

Share

RBI Penalty: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సోమవారం ఏకకాలంలో 8 సహకార బ్యాంకులపై జరిమానా విధించింది. నిబంధనలు పాటించని బ్యాంకులపై ఈ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ జరిమానా విధించిన బ్యాంకుల్లో విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ కూడా ఉంది. ఈ బ్యాంకుపై ఆర్బీఐ రూ.55 లక్షల జరిమానా విధించింది. ఈ బ్యాంకులన్నీ నిబంధనలలో అలసత్వం, ఆర్బీఐ సూచనలను పాటించడం లేదని రిజర్వ్‌ బ్యాంక్‌ పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు ఇటువంటి చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. ఇచ్చిన మార్గదర్శకాల గురించి బ్యాంకులను హెచ్చరిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ కింద నిబంధనలను రూపొందించింది. వీటిని ఏ సందర్భంలోనైనా పాటించాలి. లేని పక్షంలో రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంటుంది.

సహకార బ్యాంకులపై చర్యలకు సంబంధించి ఆర్‌బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని కైలాసపురంలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌పై రూ.10 లక్షల జరిమానా విధించింది. ఒట్టపాలన్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, No.F., పాలక్కాడ్ జిల్లా, కేరళ బ్యాంకులకు రూ.5 లక్షల జరిమానా విధించింది ఆర్బీఐ.

దీంతో పాటు తెలంగాణ, హైదరాబాద్ కేంద్రంగా ఉన్న దారుస్సలాం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ రూ.10 లక్షల జరిమానా విధించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సహకార బ్యాంకుపై రూ.55 లక్షల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ బ్యాంక్ ఆదాయ గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ, ప్రొవిజనింగ్, హౌసింగ్ స్కీమ్‌ల ఫైనాన్స్‌కి సంబంధించిన సూచనలను ఉల్లంఘించినట్లు ఆర్బీఐ ఆరోపించింది.

ఇవి కూడా చదవండి

దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా గాంధీ నగర్‌లోని నెల్లూరు కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్‌కు రిజర్వ్ బ్యాంక్ రూ.10 లక్షల జరిమానా విధించింది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్న కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్‌కు రూ.10 లక్షల జరిమానా విధించారు. ఇది కాకుండా, కేంద్రపారా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, కేంద్రపారాపై రూ. 1 లక్ష, ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లోని నేషనల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌పై రూ. 5 లక్షల జరిమానా విధించబడింది.

రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పింది?

ఇందుకు సంబంధించిన ప్రతి పెనాల్టీలు రెగ్యులేటరీ సమ్మతిలో లోపాలపై ఆధారపడి ఉంటాయి. వారు తమ కస్టమర్లతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం చెల్లుబాటును నిరోధించడానికి ఉద్దేశించినది కాదని RBI తెలిపింది. కస్టమర్లు మునుపటిలా బ్యాంకింగ్ సౌకర్యాలను పొందవచ్చని ఆర్బీఐ తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి