AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI: ఈ నంబర్ల నుండి వచ్చే కాల్స్ మాత్రమే నిజమైనవి.. లేకుంటే మోసపోతారు.. ఫోన్‌ నంబర్ల విడుదల!

SBI Number Series: డిజిటల్ చెల్లింపులు పెరగడంతో, సైబర్ మోసాలు కూడా వేగంగా పెరిగాయని ఆర్‌బిఐ తెలిపింది. నేడు బ్యాంకింగ్ లావాదేవీలలో మొబైల్ నంబర్ గుర్తింపుకు ముఖ్యమైన మార్గంగా మారింది. OTP, లావాదేవీ హెచ్చరికలు, ఖాతా అప్‌డేట్‌లు వంటి ముఖ్యమైన సమాచారం మొబైల్ నంబర్లలో మాత్రమే వస్తాయి..

SBI: ఈ నంబర్ల నుండి వచ్చే కాల్స్ మాత్రమే నిజమైనవి.. లేకుంటే మోసపోతారు.. ఫోన్‌ నంబర్ల విడుదల!
Subhash Goud
|

Updated on: Jun 07, 2025 | 10:12 AM

Share

SBI Issues Authentic Number Series: దేశంలో అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డిజిటల్ మోసం నుండి తన కస్టమర్లను రక్షించడానికి ఒక ముఖ్యమైన సమాచారాన్ని విడుదల చేసింది. +91-1600 తో ప్రారంభమయ్యే ఫోన్ నంబర్ల నుండి వచ్చే కాల్స్ పూర్తిగా సురక్షితమైనవని, అలాగే చట్టబద్ధమైనవని బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ కాల్స్ బ్యాంకింగ్ లావాదేవీ, సేవలకు సంబంధించిన సమాచారాన్ని అందించడానికి మాత్రమే, కాబట్టి వాటి గురించి భయపడాల్సిన లేదా అనుమానించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసంది. అలాగే, నకిలీ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని SBI కస్టమర్లకు సూచించింది. SBI ఉపయోగించే అనేక నంబర్ల జాబితాను కూడా బ్యాంక్ విడుదల చేసింది.

సంఖ్యలకు సంబంధించి RBI సూచనలు:

కస్టమర్ సర్వీస్, లావాదేవీ సంబంధిత కాల్స్ కోసం “1600xx” తో ప్రారంభమయ్యే నంబర్లను మాత్రమే ఉపయోగించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జనవరి 2025లో అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలను ఆదేశించింది. అదే సమయంలో మార్కెటింగ్ లేదా ప్రమోషనల్ కాల్స్ కోసం “140xx” నంబర్లను ఉపయోగించాలి. సైబర్ మోసాన్ని నివారించడానికి కస్టమర్లు నిజమైన కాల్స్, నకిలీ కాల్స్ మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడటం ఆర్బీఐ లక్ష్యం.

ఇవి కూడా చదవండి

SBI అధికారిక సంఖ్యల జాబితాను విడుదల:

బ్యాంక్ కాల్ చేసే అధికారిక సోషల్ మీడియా పోస్ట్‌లో SBI కస్టమర్ల కోసం నంబర్ల జాబితాను కూడా విడుదల చేసింది.

  • 1600-01-8000
  • 1600-01-8003
  • 1600-01-8006
  • 1600-11-7012
  • 1600-11-7015
  • 1600-01-8001
  • 1600-01-8004
  • 1600-01-8007
  • 1600-11-7013
  • 1600-00-1351
  • 1600-01-8002
  • 1600-01-8005
  • 1600-11-7011
  • 1600-01-7014
  • 1600-10-0021

ఈ నంబర్ల నుండి వచ్చే కాల్స్‌ను కస్టమర్లు విశ్వసించవచ్చని బ్యాంక్ తెలిపింది. అయితే, ఏదైనా ఇతర నంబర్ నుండి కాల్ వస్తే, కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకూడదు అంటూ తెలిపింది.

డిజిటల్ లావాదేవీలతో సైబర్ మోసం ప్రమాదం:

డిజిటల్ చెల్లింపులు పెరగడంతో, సైబర్ మోసాలు కూడా వేగంగా పెరిగాయని ఆర్‌బిఐ తెలిపింది. నేడు బ్యాంకింగ్ లావాదేవీలలో మొబైల్ నంబర్ గుర్తింపుకు ముఖ్యమైన మార్గంగా మారింది. OTP, లావాదేవీ హెచ్చరికలు, ఖాతా అప్‌డేట్‌లు వంటి ముఖ్యమైన సమాచారం మొబైల్ నంబర్లలో మాత్రమే వస్తుంది. కానీ మోసగాళ్ళు ఈ నంబర్లను దుర్వినియోగం చేయడం ద్వారా కస్టమర్లను ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తారు. అందువల్ల, ఆర్‌బిఐ, ఎస్‌బిఐ రెండూ కస్టమర్లకు విజ్ఞప్తి చేశాయి. ఆర్‌బిఐ స్థిరపడిన నంబర్ల నుండి వచ్చే కాల్‌లను మాత్రమే నమ్మాలని, ఏదైనా తెలియని నంబర్ నుండి వచ్చే కాల్స్‌పై జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ఇలా జాగ్రత్తగా ఉండండి:

  • +91-1600 తో ప్రారంభమయ్యే నంబర్ల నుండి వచ్చే కాల్‌లను మాత్రమే నమ్మదగినవిగా పరిగణించండి.
  • మీకు తెలియని లేదా అనుమానాస్పద నంబర్ నుండి కాల్ వస్తే మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వకండి.
  • OTP, పాస్‌వర్డ్ లేదా ఏదైనా సున్నితమైన బ్యాంకు సంబంధిత సమాచారాన్ని ఫోన్‌లో పంచుకోవద్దు.
  • మీకు అనుమానాస్పద కాల్స్ వస్తే, వెంటనే బ్యాంకుకు తెలియజేయండి.

ఇది కూడా చదవండి: Musk’s Starlink: భారత్‌లో స్టార్ లింక్‌ సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌.. కేంద్రం ఆమోదం!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి