Fixed deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఈ బ్యాంకులు చాలా బెస్ట్.. వడ్డీరేటు వివరాలు ఇవే..!

బ్యాంకులు అందించే వివిధ ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలను (ఎఫ్ డీలు) అత్యంత సురక్షితమైన పెట్టుబడి మార్గాలుగా ప్రజలు భావిస్తారు. తమ దగ్గర ఉన్న సొమ్ములను వాటిలోనే దాచుకోవడానికి ఆసక్తి చూపుతారు. బ్యాంకుల్లో డబ్బులకు ఎంతో భద్రత ఉంటుంది. నిర్ణీత కాలానికి మెచ్యురిటీ తర్వాత వడ్డీతో కలిసి మొత్తాన్ని పొందుతారు. నెలవారీ, త్రైమాసికం, వార్షిక పద్ధతులతో వడ్డీ పొందవచ్చు. లేదా మెచ్యురిటీ సమయంలో అసలుతో కలిసి తీసుకుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎఫ్ డీలపై వివిధ వడ్డీ రేట్లు అమలవుతున్నాయి. వాటిలో ఐదేళ్ల కాల వ్యవధికి రూ.8 లక్షలను డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ వస్తుందో తెలుసుకుందాం.

Fixed deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఈ బ్యాంకులు చాలా బెస్ట్.. వడ్డీరేటు వివరాలు ఇవే..!
Fixed Deposit
Follow us
Srinu

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 04, 2024 | 7:30 AM

ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన అన్ని బ్యాంకులలో ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలు అమలవుతాయి. అవి అందించే వడ్డీ రేట్లపై మాత్రం తేడాలుంటాయి. సాధారణ ఖాతాదారులకు, సీనియర్ సిటిజన్లకు, సూపర్ సీనియర్ సిటిజన్లకు వేర్వేరుగా అందజేస్తారు. ఎఫ్ డీలలో డబ్బులను ఇన్వెస్ట్ చేసే ముందు ఆయా బ్యాంకులు అందించే వడ్డీరేట్లను ముందుగానే తెలుసుకోవాలి. మంచి వడ్డీని అందిస్తున్న నమ్మకమైన దానిలో పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే ఎఫ్ డీలలో డిపాజిట్లు చాలా సురక్షితంగా ఉంటాయి. గ్యారెంటీ రిటర్న్ లతో పాటు పొదుపు ఖాతాల కంటే ఎక్కువ వడ్డీని అందిస్తాయి. ఈ పెట్టుబడికి ఆదాయపు పన్నుచట్టంలోని సెక్షన్ 80 సి కింద పన్ను ప్రయోజనాలు ఉంటాయి.

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తన ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలపై సాధారణ పౌరులకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీరేటును అందజేస్తోంది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా లో సాధారణ ఖాతాదారులకు 6.50, సీనియర్ సిటిజన్లకు 7.40 శాతం వడ్డీరేటును అమలు చేస్తున్నారు. స్టేట్ బ్యాంకులోని ఎఫ్ డీలలో ఐదేళ్ల కాలపరిమితికి రూ.8 లక్షలను డిపాజిట్ చేస్తే మెచ్యురిటీ తర్వాత సాధారణ ఖాతాదారులు రూ.11,04,336 అందుకుంటారు. అదే సమయంలో సినియర్ సిటిజన్లు రూ.11,59,958 తీసుకోవచ్చు. బ్యాంకు ఆఫ్ బరోడాలో ఐదేళ్ల కాలపరిమితిని రూ.8 లక్షలు డిపాజిట్ చేస్తే గడువు ముగిసిన తర్వాత 6.50 శాతం వడ్డీ రేటు ప్రకారం సాధారణ ఖాతాదారులు రూ.11,04,336 అందుకుంటారు. అదే సీనియర్ సిటిజన్లకైతే 7.40 వడ్డీ రేటు ప్రకారం రూ.11, 54, 279 అందిస్తారు.

దేశంలోని అనేక పెట్టుబడి మార్గాలలో ఎఫ్ డీలకే ప్రజల ఆదరణ ఎక్కువ. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ మెంట్లు పెరుగుతున్నప్పటికీ ఎఫ్ డీలు అంటేనే ఆసక్తి చూపుతారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు తదితర వాటి కోసం ఎక్కువగా ఎఫ్ డీలలో డబ్బులు పెడతారు. కొన్ని కుటుంబాల్లో పిల్లలు పుట్టగానే వారిపేరు మీద ఎఫ్ డీ ఖాతాలో డబ్బులను జమ చేస్తారు. పిల్లలతో పాటు ఆ మొత్తం పెరుగుతూ, భవిష్యత్తులో అవసరాలకు పనికి వస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి