AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

QR Code Scam: క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే రూ.2.30 లక్షలు హాంఫట్‌.. పోలీసుకే టోకరా వేసిన కేటుగాళ్లు

భారతదేశంలో 2016లో చేసిన నోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ పేమెంట్లు పెరిగాయి. ముఖ్యంగా ఎన్‌పీసీఐ తీసుకొచ్చిన యూపీఐ పేమెంట్లు భారీగా ఉన్నాయి. యూపీఐ పేమెంట్ల క్యూ ఆర్‌ స్కాన్‌ చేసి చేయవచ్చు. తాజాగా పూణేలోని పోలీసును మోసగాళ్లు క్యూఆర్‌ కోడ్‌ స్కామ్‌ ద్వారా మోసగించారు. బేకరీలో స్కాన్‌ చేసి పేమెంట్‌ చేశాక ఏకంగా రూ.2.30 లక్షలు కొట్టేశారు.

QR Code Scam: క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే రూ.2.30 లక్షలు హాంఫట్‌.. పోలీసుకే టోకరా వేసిన కేటుగాళ్లు
Qr Code Scam
Nikhil
|

Updated on: Dec 19, 2024 | 2:00 PM

Share

ఆన్‌లైన్ మోసాలు భారతదేశంలో ఇటీవల కాలంలో భారీగా పెరుగుతున్నాయి. దాదాపు ప్రతిరోజూ స్కామర్లు అమాయకపు వ్యక్తులను టార్గెట్‌ చేస్తూ బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును తస్కరిస్తున్నారు. సైబర్ సెల్‌లు, పోలీసులు పౌరులను జాగ్రత్తగా ఉండమని కోరుతున్నా స్కామర్లు సరికొత్త విధానాలతో ప్రజలను మోసగిస్తున్నారు. తాజాగా పూణేకు చెందిన ఒక పోలీసు కానిస్టేబుల్ స్వయంగా సైబర్ మోసానికి బలి అయ్యాడు. క్యూఆర్ కోడ్‌తో కూడిన స్కామ్‌లో ఏకంగా రూ. 2.30 లక్షలు పోగొట్టుకున్నాడు. పూణే సమీపంలోని సస్వాద్‌లో నివసిస్తున్న బాధితుడు సాస్వాద్‌లోని బేకరీలో క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ ద్వారా బిల్లు చెల్లించాడు. బిల్లు చెల్లింపు తర్వాత తన ఖాతా నుంచి రూ.18,755 అనధికారికంగా డెబిట్ అయ్యాయని గుర్తించాడు. వెంటనే అప్రమత్తమైన అతను తన ఇతర బ్యాంకు ఖాతాలను తనిఖీ చేయగా తన శాలరీ అకౌంట్‌లోని రూ.12,250 సహా ఖాతాలో రూ.50 మాత్రమే మిగిలి ఉండటంతో మరిన్ని అనధికార లావాదేవీలను చూసి ఆశ్చర్యపోయాడు.

అలాగే కానిస్టేబుల్ తన గోల్డ్ లోన్ ఖాతా నుంచి రూ.1.9 లక్షల లావాదేవీకి వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) నోటిఫికేషన్ రావడంతో అవాక్కయ్యాడు. అయితే అతడు ఓటీపీ ఎవరికీ చెప్పకపోయినా లావాదేవీ విజయవంతంగా పూర్తయ్యిందని మెసేజ్‌ వచ్చింది. అలాగే మోసగాళ్లు అతని క్రెడిట్ కార్డ్ వివరాలను ఉపయోగించి రూ. 14,000 విలువైన రెండు లావాదేవీలు చేయడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆ కానిస్టేబుల్‌ బ్యాంకు ఖాతాలతో పాటు క్రెడిట్‌ కార్డులను కూడా బ్లాక్‌ చేశాడు. అనంతరం పూణే రూరల్ పోలీసులకు తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశాడు. 

బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పూణే రూరల్‌ పోలీసులు చెబుతున్నారు. మోసగాళ్ళు హానికరమైన ఏపీకే ఫైల్ ద్వారా కానిస్టేబుల్ మొబైల్ ఫోన్, బ్యాంక్ ఖాతాలకు యాక్సెస్‌ చేయడం వల్ల బాధితుడు డబ్బును కోల్పోయాడని పోలీసులు వెల్లడించారు. మోసగాళ్లు పంపిన హానికరమైన లింక్‌ను కానిస్టేబుల్ తన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయడానికి అనుమతించారని, తెలియకుండా క్లిక్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ మాల్వేర్ నేరస్తులకు లాగిన్ వివరాలు, ఓటీపీలు, మల్టిపుల్‌ ఖాతాలను యాక్సెస్ చేయడం వంటి సున్నితమైన సమాచారాన్ని పొందడానికి వీలు కల్పిస్తుంది. ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయడానికి కానిస్టేబుల్‌ను దారి మళ్లించడానికి క్యూఆర్‌ కోడ్‌ను తారుమారు చేశారా? లేదా?మోసగాళ్లు ఇతర మోసపూరిత వ్యూహాలను ఉపయోగించారా? అనే దానిపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి