Royal Enfield Himalayan 450: మార్కెట్‌లో రాయల్‌గా ఎంట్రీ ఇచ్చిన హిమాలయన్ బైక్.. ధరెంతో తెలిస్తే షాక్..!
రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న హిమాలయన్ అడ్వెంచర్ బైక్ ఎట్టకేలకు కంపెనీ రిలీజ్ చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ 450 హిమాలయన్ ఎడ్వెంచర్ టూర్ పేరుతో రిలీజ్ చేసిన ఈ బైక్ ధర రూ.2.69 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ 450 బేస్ వెర్షన్‌గా రూపొందించారు. దీని తర్వాత రాయల్ ఎన్‌ఫీల్డ్ 450 పాస్ వెర్షన్‌గా అందుబాటు ఉన్న హిమాలయన్ ఎడ్వెంచర్ ధర రూ.2.74 లక్షలుగా ఉంది.
బైక్ రైడింగ్ అనేది ప్రస్తుతం యువతకు చాలా ఇష్టమైన విషయాల్లో ముఖ్యమైనది. యువతలో ఈ క్రేజ్ రావడానికి ఆయా బైక్స్‌లో వచ్చే ఫీచర్లే కారణం. అయితే భారతదేశంలో మొదటి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు ఉండే క్రేజ్ వేరు. ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను బుల్లెట్ బండి తెలుగు రాష్ట్రాల్లో పిలుస్తూ ఉంటారు. రాయల్‌ఎన్‌ఫీల్డ్ కూడా మారుతున్న టెక్నాలజీను అందిపుచ్చుకుంటూ సరికొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న హిమాలయన్ అడ్వెంచర్ బైక్ ఎట్టకేలకు కంపెనీ రిలీజ్ చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ 450 హిమాలయన్ ఎడ్వెంచర్ టూర్ పేరుతో రిలీజ్ చేసిన ఈ బైక్ ధర రూ.2.69 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ 450 బేస్ వెర్షన్‌గా రూపొందించారు. దీని తర్వాత రాయల్ ఎన్‌ఫీల్డ్ 450 పాస్ వెర్షన్‌గా అందుబాటు ఉన్న హిమాలయన్ ఎడ్వెంచర్ ధర రూ.2.74 లక్షలుగా ఉంది. టాప్ స్పెక్ సమ్మిట్ హనే బ్లాక్ ధర రూ.2.84 లక్షలుగా ఉంది. అలాగే కామెట్ వైట్ పేరుతో రిలీజ్ చేసిన బైక్ ధర రూ.2.79 లక్షలుగా ఉంది. ఈ మూడు వేరియంట్లు ఒకే రకంగా ఉన్నా రంగుల్లో మాత్రం ప్రత్యేకంగా ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 ప్రపంచవ్యాప్తంగా లైనప్‌లో హిమాలయన్ 411 స్థానంలో ఉంది. ఈ బైక్ గ్రౌండ్ అప్ నుంచి అభివృద్ధి చేశారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 షెర్పా 450 ఇంజిన్‌తో పాటు ట్విన్ స్పార్ ఫ్రేమ్‌తో అండర్ పిన్ చేశారు. 452 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో పని చేసే ఈ బైక్ 39.4 బీహెచ్‌పీ పవర్, 40 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా స్లిప్పర్ క్లచ్ సిస్టమ్‌తో 6 స్పీడ్ గేర్ బాక్స్‌తో ఈ బైక్ ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖ్యంగా కొంతప్రాంతాల్లో రైడింగ్ ఈ బైక్ ఆకర్షణీయంగా ఉంటుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 సస్పెన్షన్ కోసం ముందువైపు యూఎస్‌డీ ఫోర్కులు, వెనుకవైపు మోనోషాక్ అబ్జార్బర్‌తో ఆకట్టుకుంటుంది. 230 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌తో వచ్చే ఈ బైక్ బ్రేకింగ్ సిస్టమ్ రైడర్స్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఎత్తయిన సీటుతో పాటు మెరుగైన రక్షణ కోసం ర్యాలీ కిట్ ఈ బైక్ ప్రత్యేకత. ఆల్ డిజిటల్ కన్సోల్‌తో వచ్చే ఈ బైక్ గూగుల్ మ్యాప్స్ ద్వారా టర్న్ బై టర్న్ నావిగేషన్ ఫీచర్లతో వస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 రెండు రైడింగ్ మోడ్స్‌తో కొత్త అనుభూతినిస్తుంది. ఎల్‌ఈడీ లైటింగ్, బ్లూటూత్ కనెక్టవిటీ, జాయ్ స్టిక్ ద్వారా సీట్ అడ్జస్టమెంట్ వంటి అనేక ఫీచర్లతో ఈ బైక్ ఆకట్టుకుంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..