AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబ్బును సంపాదించడం నేర్చుకోండి! పేదోళ్లకు రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌ రచయిత విలువైన సూచన!

రాబర్ట్ కియోసాకి పేదల పట్ల తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ, బిట్‌కాయిన్‌ను కోల్పోయినవారికి వెండి కొనే అవకాశం ఉందంటున్నారు. 'చేపలు పట్టడం నేర్పండి' సూత్రం చెప్పిన కియోసాకి, ఇప్పుడు వెండి తక్కువ ధరకు ఉందని, ఇది భవిష్యత్తులో $200కి చేరవచ్చని అంచనా వేస్తున్నారు.

డబ్బును సంపాదించడం నేర్చుకోండి! పేదోళ్లకు రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌ రచయిత విలువైన సూచన!
Silver Price Soars Kiyosaki
SN Pasha
|

Updated on: Nov 12, 2025 | 6:45 AM

Share

ఒకరికి నిజంగా సాయం చేయాలంటే, వారిని జీవితంలో పైకి తీసుకురావాలంటే.. వారికి చేపలు పట్టి ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పించాలనే మాట వినే ఉంటారు. ఇప్పుడు రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌ పుస్తక రచయిత రాబర్ట్‌ కియోసాకి కూడా అదే చెబుతున్నారు. పేదోళ్లకు తానో విలువైన హింట్‌ ఇచ్చానని, బిట్‌కాయిన్‌ తక్కువ ధరకు ఉన్నప్పుడు కొనలేకపోయినా వారు.. ఇప్పుడు కనీసం వెండి అయినా కొనుకుంటే ధనవంతులు అవుతారంటూ పేర్కొన్నారు.

ఆయన ఎక్స్‌లో ట్వీట్‌ చేస్తూ.. ‘పేదవాళ్ళ పట్ల నాకు జాలి ఉంది. పేదవాళ్ళకి డబ్బు ఇవ్వడంలో నాకు నమ్మకం లేదు. నేను ఆదివారం స్కూల్‌లో నేర్చుకున్నట్లుగా ఒక వ్యక్తికి ఒక చేప ఇస్తే.. వారికి మీరు ఒక రోజు ఆహారం పెట్టినవారు అవుతారు. అదే వ్యక్తికి చేపలు పట్టడం నేర్పండి. మీరు వారికి జీవితాంతం ఆహారం పెట్టినట్టే. వెండి ధర 50 డాలర్లకు చేరింది. నెక్ట్స్‌ స్టాప్‌ 70 డాలర్లా? అని నా మునుపటి ట్వీట్‌లో నేను ఈ ప్రశ్న అడిగాను. అయినా కూడా చాలా మంది పేదవాళ్లు ఇప్పటికీ వెండి కొనరు. కొద్దిమంది మాత్రమే ఇప్పుడు బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేయగలరు. నేను నా మొదటి బిట్‌కాయిన్‌ను 6000 డాలర్లకు కొన్నాను.

నా మొదటి 100 బిట్‌కాయిన్‌లు ఇప్పుడు మిలియన్ల విలువైనవి. నేను 100000 డాలర్ల బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేయలేకపోతే, వెండి 50 డాలర్ల నుండి 70 డాలర్లకి మారుతుందనే నా విలువైన అంచనా గురించి నేను సంతోషిస్తాను. మీరు కొనుగోలు చేసినప్పుడు మీకు లాభం వస్తుంది. మీరు అమ్మినప్పుడు కాదు. ఇప్పటి నుండి ఒక సంవత్సరం తర్వాత వెండి ఔన్సుకు 200 డాలర్లు ఉంటుందని నేను భావిస్తున్నాను. వెండి ఔన్సుకు 200 డాలర్లు అయినప్పుడు చాలా మంది కొనడం ప్రారంభిస్తారు. నిజానికి వారంతా ఈ రేసులో ఓడిపోయినవారు. తక్కువ ధరకు వస్తున్నప్పుడు కొనకుండా ధర పెరిగిన తర్వాత కొంటారు. దయచేసి మీరు ఓడిపోకండి. ధరలు తక్కువగా ఉన్నప్పుడు కొనండి. ఓడిపోయినవారు కొనుగోలు చేస్తున్నప్పుడు మీరు అమ్మండి.’ అని కియోసాకి తన ట్వీట్‌లో వెల్లడించారు. సో ఆయన చెప్పినట్లు ఇప్పుడు వెండి కొంటే ఒక ఏడాది తర్వాత దాదాపు మూడు రెట్ల ఆదాయం పొందవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి
మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి
ఒకే మ్యాచ్‌లో 414 పరుగులు..ఢిల్లీ కోటను కూల్చిన సోఫీ
ఒకే మ్యాచ్‌లో 414 పరుగులు..ఢిల్లీ కోటను కూల్చిన సోఫీ
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్
7 వైడ్లు, 4 నోబాల్స్.! పిల్లబచ్చా జట్టుపై 17 బంతులు ఓవర్‌..
7 వైడ్లు, 4 నోబాల్స్.! పిల్లబచ్చా జట్టుపై 17 బంతులు ఓవర్‌..
వడోదరలో విరాట్ విధ్వంసం..సెంచరీ మిస్సైనా రికార్డుల పంచ్ అదిరింది
వడోదరలో విరాట్ విధ్వంసం..సెంచరీ మిస్సైనా రికార్డుల పంచ్ అదిరింది