RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకింగ్ ప్రకటన.. ఏకంగా 31 లక్షల కోట్ల నగదు..
ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. ప్రపంచం మొత్తం డిజిటల్‌మయమే. ఆర్ధిక లావాదేవీలు కూడా డిజిటల్‌లోనే సాగుతున్నాయ్. ఇండియాలో పెద్ద నోట్ల

ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. ప్రపంచం మొత్తం డిజిటల్‌మయమే. ఆర్ధిక లావాదేవీలు కూడా డిజిటల్‌లోనే సాగుతున్నాయ్. ఇండియాలో పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ ట్రాన్‌జాంక్షన్స్ పెరిగాయ్. అయితే, ఎంతగా డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నా.. నగదు చెలామణి మాత్రం తగ్గడం లేదంటోంది ఆర్‌బీఐ. అందుకు సంబంధించిన లెక్కలను అధికారికంగా విడుదల చేసింది. పెద్ద నోట్ల రద్దు జరిగి సిక్స్ ఇయర్స్ దాటిపోయింది. అయితే, నోట్ల రద్దు టైమ్ కంటే, ఇప్పుడే జనం దగ్గర అత్యధిక నగదు ఉందంటోంది ఆర్బీఐ. అప్పటితో పోలిస్తే ఇప్పుడు 70శాతానికి పైగా ఎక్కువ డబ్బు ప్రజల దగ్గర ఉందని తెలిపింది.
2022 అక్టోబర్ 21 నాటికి ప్రజల దగ్గరున్న నగదు విలువ సుమారు 31లక్షల కోట్ల రూపాయలుగా వెల్లడించింది ఆర్బీఐ. పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు ప్రజల దగ్గరున్న నగదు విలువతో పోలిస్తే ఇది 71.84శాతం అధికమని తెలిపింది. నోట్ల రద్దు జరిగిన 2016 నవంబర్ 4 నాటికి ప్రజల దగ్గర 17.7లక్షల కోట్ల రూపాయలు ఉంటే, అదిప్పుడు 30.88లక్షల కోట్లకు పెరిగిందని లెక్కలు చెప్పింది. నార్మల్ ట్రాన్‌జాంక్షన్స్, వ్యాపార లావాదేవీలు, వస్తువుల కొనుగోళ్లకు వినియోగించే డబ్బును ప్రజల దగ్గర ఉండే నగదుగా లెక్కిస్తారు. చెలామణిలో ఉన్న మొత్తం నగదు నుంచి బ్యాంకుల దగ్గరుండే డబ్బును మైనస్ చేస్తే, జనం దగ్గరుండే మనీ 31లక్షల కోట్లగా తేలింది. పెద్ద నోట్ల రద్దు జరిగి సిక్స్ ఇయర్స్ దాటిపోయినా.. నగదు చెలామణి తగ్గలేదనడానికి ఇదే రుజువంటోంది ఆర్బీఐ.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..