AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rent vs Buy a House: అద్దె ఇల్లు..సొంత ఇల్లు..ఈ రెండింటిలో ఏది బెస్ట్..? నిపుణుల సూచనలు ఏంటంటే?

భారతదేశంలోని మధ్య తరగతి ప్రజలకు సొంత ఇల్లు కొనుగోలు చేయడం అనేది ఓ ఎమోషన్. బయట అంతా కష్టపడి సొంత ఇంట్లో సేద తీరాలని ప్రతి ఉద్యోగి అనుకుంటాడు. అందువల్ల రూపాయిరూపాయి కూడబెట్టి మరీ సొంత ఇల్లు కొనుగోలు చేస్తారు. అయితే కొంత మంది మాత్రం లోన్ తీసుకుని నెలనెలా కట్టే అద్దెను ఈఎంఐ రూపంలో కట్టవచ్చనే ఉద్దేశంలో ఇల్లు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఏళ్లుగా ఇల్లు కొనుగోలు చేయడం ఉత్తమమా? అద్దెకు తీసుకోవడం ఉత్తమమా? అనే అనుమానం అందరికీ ఉంటుంది.

Rent vs Buy a House: అద్దె ఇల్లు..సొంత ఇల్లు..ఈ రెండింటిలో ఏది బెస్ట్..? నిపుణుల సూచనలు ఏంటంటే?
Rent Vs Buy A House
Nikhil
|

Updated on: Mar 22, 2025 | 2:52 PM

Share

2025లో ఇల్లు అద్దెకు తీసుకోవడం, కొనడం మధ్య చర్చ మరింత తీవ్రంగా సాగుతుంది. పెరుగుతున్న ఆస్తి ధరలు, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో ఈ చర్చ తీవ్రమైంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో చోటు చేసుకున్న మార్పులు కారణంగా చాలా మంది నిర్ణయం తీసుకోవడానికి జంకుతున్నారు. ఉన్న సొమ్మంతా కలిపి ఇల్లు కొనుగోలు చేస్తే కొన్నేళ్లకు ఇంటి విలువ కంటే ఆ సొమ్ము డిపాజిట్ చేస్తే వచ్చే రాబడే ఎక్కువగా ఉంటుందని కొంత మంది నిపునులు చెబుతున్నారు. అయితే ఇంటి విలువ పెరుగుదల అనేది మనం కొనుగోలు చేసిన ప్రాంతాన్ని బట్టి ఉంటుందని మరికొంత మంది నిపుణులు చెబుతున్నారు.

ఎవరికైనా సొంత ప్రాంతంలో ఇంటిని కొనుగోలు చేయాలని ఉంటుంది. అలా దీర్ఘకాలిక ఆలోచనలు ఉన్న వారు ఇల్లు కొనుగోలు చేస్తే నిర్వహణ, పన్ను ఖర్చులు ఉన్నప్పటికీ ఆస్తిని కొనుగోలు చేయడం అర్ధవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అద్దె బదులు ఈఎంఐ చెల్లించవవచ్చని కొనుగోలు ఉత్తమ నిర్ణయం కాదని చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటి కొనుగోలుకు అయ్యే డౌన్ పేమెంట్ ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అదే సొమ్మును మ్యూచువల్ ఫండ్స్, ప్రభుత్వ సెక్యూరిటీల వంటి ప్రత్యామ్నాయాల ద్వారా 7 శాతం నుంచి 9 శాతం వరకు వడ్డీను సంపాదించవచ్చు. అయితే పెట్టుబడి కింది రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టే వారు అద్దె కోసం ఆశపడకుండా స్థలాలను కొనుగోలు చేయడం మేలని నిపుణులు చెబుతున్నారు. 

ఇంటిని అద్దెకు తీసుకోవాలా లేదా కొనాలా అనే నిర్ణయం ఆర్థిక లక్ష్యాలు, జీవనశైలి అవసరాలు, మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని అన్నారు. కొనుగోలు దీర్ఘకాలిక స్థిరత్వం, ఆస్తి పెరుగుదల, యాజమాన్య భావాన్ని అందిస్తుంది. కానీ భారీ ముందస్తు పెట్టుబడి, కొనసాగుతున్న నిర్వహణ ఖర్చులతో పాటు దీర్ఘకాలిక తనఖా నిబద్ధత అవసరం. ఈఎంఐలు అద్దె కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ అవి కాలక్రమేణా ఈక్విటీని నిర్మిస్తాయి. ఆర్థిక భద్రతతో పాటు దీర్ఘకాలిక గృహ ప్రణాళికలు ఉన్నవారికి ఇల్లు కొనుగోలు చేయడమే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. అయితే మెట్రో నగరాల్లో కొనుగోలు చేయాలనుకునే వారు కాస్త జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టాలని పేర్కొంటున్నారు. అద్దె ధరలు ఏటా పెరుగుతున్నప్పటికీ అద్దెకు తీసుకోవడం వల్ల హెచ్చుతగ్గుల రియల్ ఎస్టేట్ విలువలు, మార్కెట్ తిరోగమనాల ప్రమాదాలు నివారిస్తుంది. ఇంటి కొనుగోలు నిర్ణయం అనేది వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలు, స్థిరత్వం, మార్కెట్ డైనమిక్స్‌పై ఆధారపడి తీసుకోవాల్సి ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..