Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Tips: వ్యాపారంలో ఆ నియమం పాటిస్తే లాభాల పంట.. ఆ లక్షణాలు ఉంటే సక్సెస్ సాధ్యం

ఇటీవల కాలంలో యువత లోచనా విధానం మారుతుంది. గతంలో కష్టపడి చదివి మంచి ఉద్యోగంతో స్థిరపడాలని కోరుకునే వారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఒకరి కింద పని చేయడం కంటే మంచి వ్యాపారం పెట్టుకుని సక్సెస్ అవుదామనుకునే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాపారంలో ఓ నియమయం పాటిస్తే సక్సెస్ అవుతారని నిపుణులు చెబుతున్నారు. 85 శాతం నియమంగా చెప్పుకునే ఆ టిప్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Business Tips: వ్యాపారంలో ఆ నియమం పాటిస్తే లాభాల పంట.. ఆ లక్షణాలు ఉంటే సక్సెస్ సాధ్యం
Business
Follow us
Srinu

|

Updated on: Mar 22, 2025 | 3:10 PM

ఇటీవల కాలంలో వ్యాపారంలో యువ వ్యాపారవేత్తలు అధికమయ్యారు. వ్యాపారంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే కష్టేఫలి అనే సూత్రం వ్యాపారులకు సరిపోదని కొంత మంది నిపుణులు చెబుతున్నారు. వ్యాపారం కోసం ప్రతిరోజూ 100% ప్రయత్నం చేయడం వల్ల దీర్ఘకాలిక విజయం కంటే రాబడికి తగ్గే ప్రమాదం ఉందని వాదిస్తున్నారు. ఇటీవల ఓ ప్రముఖ వ్యాపారవేత్త 85 శాతం నియమంగా పిలిచే కొత్త నియమయం సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. వ్యాపారస్తులు అధిక శ్రమను నివారించి, వ్యూహాత్మక, స్థిరమైన ప్రయత్నంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. సంవత్సరాలుగా నిరంతరం పని చేస్తున్నప్పుడు 100 శాతం ఫలితం కోసం ప్రయత్నించడం వాస్తవానికి ఎదురుదెబ్బ తగలవచ్చని గ్రహించానని, బదులుగా ప్రత్యేక దృష్టితో పాటు వ్యూహాత్మక ప్రాధాన్యతను నేర్చుకునేలా 85 శాత నియమం పాటించాలని సూచిస్తున్నారు. 

ముఖ్యంగా ఈ నియమం పాటించే సమయంలో అథ్లెట్ల గురించి ఆలోచిస్తే క్లారిటీ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అథ్లెట్లు కఠినంగా శిక్షణ పొందుతారు. కానీ ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలో? తెలుసుకుని విశ్రాంతి తీసుకోవడంతో సంపూర్ణ ఉత్తమ ప్రదర్శన ఇస్తారని చెబుతున్నారు. వ్యాపారాన్ని నడపడం కూడా ఓ గేమ్ లాంటిదని, కానీ ముందుగా విజయాన్ని చేరుకునే కంటే స్థిరత్వంతో విజయాన్ని చేరుకుంటే ఎక్కువ లాభాలను పొందవచ్చని చెబుతున్నారు. స్టార్టప్‌ను నిర్మించడం ఒక సుదీర్ఘ ప్రయాణమని, ఇది త్వరిత స్ప్రింట్ కాదని చెబుతున్నారు. 

ప్రతిరోజూ పూర్తి శక్తితో పనిచేయడానికి ప్రయత్నించడం స్థిరమైనది కాదని, ప్రతిరోజూ 80 నుంచి 85 శాతం కృషిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా మనం నిజంగా ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టవచ్చని వివరిస్తన్నారు. 8 5శాతం  నియమం అనేక మంది వ్యాపారస్తులకు నచ్చింది. ఈ మేరకు ఆమె పోస్ట్స్‌కు రిప్లయ్ ఇస్తున్నారు. అయితే ఈ నియమం ఎక్కువ గంటలు, నిరంతర కృషిని కీర్తించే ప్రబలంగా ఉన్న ‘హస్టిల్ సంస్కృతి’ని సవాలు చేస్తుంది. అయితే కంపెనీలు ఈ విధానాన్ని ప్రోత్సహించడం ద్వారా సమతుల్యత, వ్యూహాత్మక దృష్టి, ఉద్యోగులకు సకాలంలో విశ్రాంతి దొరుకుతాయని నిపుణులు వివరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..