AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2024: వేతన జీవులకు బడ్జెట్‌లో ఊరట.. ఆ విధానం ద్వారా రూ.17,500 ఆదా

బీజేపీ ప్రభుత్వం వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టాక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ మంగళవారం 2024-25 ఆర్థిక సంవత్సర పూర్తి బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో ప్రజలకు మేలు చేసేలా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా గతేడాది అమల్లోకి తీసుకొచ్చిన కొత్త పన్ను విధానంలో కీలక మార్పులు చేశారు. వేతన జీవులకు మేలు కల్పించేలా ఉద్యోగులు గరిష్టంగా రూ.17,500 ఆదా చేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Budget 2024: వేతన జీవులకు బడ్జెట్‌లో ఊరట.. ఆ విధానం ద్వారా రూ.17,500 ఆదా
Budget 2024
Nikhil
|

Updated on: Jul 24, 2024 | 4:09 PM

Share

బీజేపీ ప్రభుత్వం వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టాక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ మంగళవారం 2024-25 ఆర్థిక సంవత్సర పూర్తి బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో ప్రజలకు మేలు చేసేలా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా గతేడాది అమల్లోకి తీసుకొచ్చిన కొత్త పన్ను విధానంలో కీలక మార్పులు చేశారు. వేతన జీవులకు మేలు కల్పించేలా ఉద్యోగులు గరిష్టంగా రూ.17,500 ఆదా చేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆదాయపు పన్ను శ్లాబ్‌లను సర్దుబాటు చేస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల ఉద్యోగులకు మేలు జరుగుతుందని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త బడ్జెట్ ద్వారా వేతన జీవులకు కలిగే మేలు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

బడ్జెట్ 2025లో ప్రతిపాదించిన మార్పుల కారణంగా కొత్త పన్ను విధానంలో ఉద్యోగులు సంవత్సరానికి రూ. 17,500 వరకు పన్నులను ఆదా చేస్తారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రకటించారు. కొత్త ఆదాయపు పన్ను విధానంలో కొత్త పన్ను స్లాబ్‌లు ఏప్రిల్ 1, 2024 నుండి అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు.  ముఖ్యంగా ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000కి పెంచారు. అలాగే కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను శ్లాబ్‌లను కూడా సర్దుబాటు చేశారు. 0- రూ 3 లక్షలు ఆదాయం వరకు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే రూ 3-రూ.7 లక్షల మధ్య సంపాదిస్తే  5 శాతం, రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య 10 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం, రూ.15 లక్షలు ఆ పైన సంపాదిస్తే 30 శాతం ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 

రూ. 17,500 ఆదా ఇలా

కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగా స్లాబ్ రేటు తగ్గింపు ప్రభావం రూ.10,000గా ఉంటుంది. స్టాండర్డ్ డిడక్షన్ రూ. 25,000 అదనంగా మరో 30 శాతం అంటే రూ. 7,500 కలిపి రూ. 17,500గా ఉంటుంది. అయితే రూ. 3 లక్షల బేస్ మినహాయింపు పరిమితి మారలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది స్వల్పంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుత రూ.3 లక్షల  నుంచి రూ.6 లక్షల శ్లాబ్ విస్తరించారని నిపుణులు చెబుతున్నారు. అత్యధిక పన్ను శ్లాబ్ 30 శాతం యథాతథంగా కొనసాగుతుంది. కొత్త పాలనను ఎంచుకునే వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు రూ.17,500 ఉపశమనం ఉంటుంది. ప్రతిపాదిత సడలింపులు లేని పాత పన్ను విధానంతో పోలిస్తే ఇది కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికే మేలు చేస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..